తిరిగి

తెలుగు

تلجو

ముఖ్యమైన పాఠాలు

1 వీడియోలు
PDF

అబ్లూషన్

3 వీడియోలు
Description of Wudu
0:00 / 0:00
How to Perform Wudu
0:00 / 0:00
Wudu Affairs
0:00 / 0:00

ప్రార్థన

3 వీడియోలు
Description of Prayer
0:00 / 0:00
Salah with Duaa
0:00 / 0:00
How to Perform Prayer
0:00 / 0:00

ముఖ్యమైన ప్రశ్నలు

272 ప్రశ్నలు
తౌహీద్ (ఏకదైవ విశ్వాస) విభాగము42

1వ ప్రశ్న: నీ ప్రభువు ఎవరు?

జవాబు: నా ప్రభువు అల్లాహ్. ఆయనే నన్నూ మరియు సర్వలోకాలనూ తన అనుగ్రహంతో ఉద్ధరించాడు.
దీనికి సాక్ష్యం:
అల్లాహ్ యొక్క వాక్కు: {సకల ప్రశంసలూ, కృతజ్ఞతలూ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.(2)} [సూరతుల్ ఫాతిహా: 2వ ఆయతు]

2వ ప్రశ్న: నీ ధర్మము ఏది?

జవాబు: నా ధర్మము ఇస్లాం. ఏకదైవారాధన ద్వారా అల్లాహ్ కు సమర్పించుకోవడం, వినయవిధేయతలతో, వినమ్రతతో ఆయనను ఆరాధించడం, షిర్క్ (బహుదైవారాధన) నుండి మరియు బహుదైవారాధకుల నుండి తనను తాను దూరంగా ఉంచడమే ఇస్లాం ధర్మము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం మాత్రమే (ఇస్లాం ధర్మం మాత్రమే). [సూరతు ఆలే ఇమ్రాన్ : 19వ ఆయతు]

3వ ప్రశ్న: నీ ప్రవక్త ఎవరు?

జవాబు: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు. [సూరతుల్ ఫతహ్: 29వ ఆయతు]

4వ ప్రశ్న: తౌహీద్ పదాలు ఏమిటో తెలుపు మరియు తౌహీద్ అర్థం ఏమిటో వివరించు?

జవాబు: తౌహీద్ పదాలు "లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే అల్లాహ్ తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాదు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్ధం: అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యుడు లేడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. [సూరహ్ ముహమ్మద్ : 19వ ఆయతు]

5వ ప్రశ్న: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?

అల్లాహ్ స్వర్గంలో, తన అర్ష్ పై (సింహాసనంపై) ఉన్నాడు. అది మొత్తం సృష్టి పైన ఉన్నది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఆ కరుణా ప్రధాత, అర్ష్ పై (సింహాసనంపై) అధీష్టించి ఉన్నాడు. [సూరతు తాహా : 5వ ఆయతు] ఇంకా ఇలా సెలవిచ్చాడు : మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు. [సూరతుల్ అన్ఆమ్: 18వ ఆయతు]

6వ ప్రశ్న: 'ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలకటం' అంటే అర్ధం ఏమిటి?

జవాబు: దాని అర్థం - నిశ్చయంగా అల్లాహ్ ఆయనను సర్వలోకాలకు శుభవార్త తెలిపే వానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపినాడు.
అందువలన ఆయన గురించి ప్రతి ఒక్కరిపై క్రింది విషయాలు విధి గావించబడి ఉన్నాయి:

1. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను శిరసావహించుట.
2. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని విశ్వసించుట.
3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపకుండా ఉండుట.
4. మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన షరీఅతు ప్రకారం మాత్రమే ఆరాధించుట అంటే సున్నతులను అనుసరించుట మరియు ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలను, ఆవిష్కరణలను బహిష్కరించుట అత్యవసరమైది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
"ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో, వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే." [సూరతున్నిసా: 80వ ఆయతు]. ఇంకా మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు(3). అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే(4).} [సూరతున్నజమ్ : 3 - 4] ఇంకా మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీ కొరకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉన్నది - ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో వారి కొరకు!}[21] [సూరతుల్ అహ్'జాబ్ : 21వ ఆయతు]

7వ ప్రశ్న: అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు?

జవాబు: ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా, కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించినాడు.
ఆయన మనల్ని వినోదం కోసమో లేదా ఆటపాటల కోసమో సృష్టించలేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.} [సూరతు అజ్జారియాత్ : 56వ ఆయతు]

8వ ప్రశ్న: ఆరాధన అంటే ఏమిటి?

ఆరాధన (ఇబాదత్) అనేది ఒక విస్తృతమైన పదము. ఇది అల్లాహ్ ఇష్టపడే మరియు సంతుష్టపడే అన్నిరకాల బహిర్గతమైన మరియు గోప్యమైన మొత్తం మాటలు మరియు ఆచరణలు కలిగి ఉన్నది.
తస్బీహ్ (అల్లాహ్ ను కీర్తించడం), తహ్మీద్ (అల్లాహ్ ను స్తుతించడం), మరియు తక్బీర్ (అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం) మొదలైన పదాలతో అల్లాహ్ యొక్క జిక్ర్ ను (ధ్యానాన్ని) తమ నాలుకతో చేయుట, సలాహ్ (నమాజు) చేయుట మరియు హజ్ యాత్ర చేయుట వంటివి బహిర్గతమైన ఆరాధనకు ఉదాహరణ.
మరోవైపు, అల్లాహ్ పై ఆధారపడుట, ఆయనకు భయపడుట మరియు ఆయనపై ఆశలు పెట్టుకొనుట మొదలైనవి గోప్యమైన ఆరాధనకు ఉదాహరణలు.

9వ ప్రశ్న: మన అసలు కర్తవ్యము ఏమిటి?

జవాబు: మనపై ఉన్న అసలు కర్తవ్యము 'తౌహీద్ అల్లాహ్' అంటే మహోన్నతుడైన అల్లాహ్ పట్ల ఏకదైవత్వ విశ్వాసము కలిగి ఉండుట.

10వ ప్రశ్న: తౌహీద్ విభాగాలు ఎన్ని?

జవాబు: తౌహీద్ మూడు భాగాలలో విభజింపబడినది. మొదటిది తౌహీద్ రుబూబియ్యహ్ (విశ్వాసంలో ఏకత్వం): కేవలం అల్లాహ్ మాత్రమే సమస్త సృష్టిరాశుల సృష్టికర్త, ప్రధాత, యజమాని మరియు వ్యవహారాలను నిర్వహించేవాడని నమ్ముట.
రెండవది తౌహీద్ ఉలూహియ్యహ్ (ఆరాధనలలో ఏకత్వం): సకల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుట అంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకుండా ఉండుట.
ఇక మూడవది తౌహీద్ అస్మా వ సిఫ్ఫాత్ (దివ్యనామాలు మరియు దివ్యగుణాలలో ఏకత్వం): ఖుర్ఆన్ మరియు సున్నతులలో తమ్'సీల్ (అల్లాహ్ మరియు ఆయన సృష్టి మధ్య సారూప్యతను కల్పించుట), తష్'బీహ్ (అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుట), లేదా త’అతీల్ (నిరాకరించుట, తిరస్కరించుట) మొదలైన వాటికి తావు లేకుండా అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యగుణాలను విశ్వసించడం అని దీని అర్థం.
మూడు రకాల తౌహీదులకు సంబంధించిన ప్రామాణిక ఆధారం:
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: "ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు. కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధన పైనే స్థిరంగా ఉండండి. నీకు తెలిసినంత వరకు ఆయనకు సాటి గలవాడు ఎవడైన ఉన్నాడా?" [సూరతు మర్యమ్ : 65వ ఆయతు]

11వ ప్రశ్న: అత్యంత ఘోరమైన పాపం ఏది?

జవాబు: షిర్క్ (మహోన్నతుడైన అల్లాహ్ కు సాటి కల్పించుట, ఆయన ఏక దైవత్వంలో భాగస్వాములను చేర్చుట)
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనినైనా (ఏ పాపాన్ని అయినా), ఆయన తాను కోరిన వారి విషయంలో క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు! [సూరతున్నిసా : 48వ ఆయతు]

12వ ప్రశ్న: షిర్క్ యొక్క నిర్వచనం మరియు దాని రకాలను పేర్కొనండి?

జవాబు: షిర్క్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు కాకుండా ఇతరులకు ఎలాంటి ఆరాధనలనైనా అంకితం చేయడం.
షిర్క్ లోని రకాలు:

షిర్కే అక్బర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను వేడుకొనుట, ఇతరులకు సజ్దా చేయుట (సాష్టాంగ పడుట), ఇతరుల పేరు మీద జిబహ్ చేయుట (బలిపశువు వధించుట, ఖుర్బానీ చేయుట) మొదలైనవి.
షిర్కే అస్గర్:
ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయుట; తమకు ప్రయోజనం కలిగిస్తాయనే లేదా హాని నుండి రక్షిస్తాయనే నమ్మకంతో తాయెత్తులు కట్టుకొనుట లేదా వ్రేలాడ దీయుట; ఇతరుల మెప్పు కోసం తన ఆరాధనలను మరింతగా పొడిగించుట (ప్రదర్శనాబుద్ధి).

13వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప అగోచర విషయాల జ్ఞానం ఇంకెవరికైనా ఉందా?

కేవలం అల్లాహ్ ఒక్కనికే తప్ప అగోచర విషయాల జ్ఞానం మరెవ్వరికీ లేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయ జ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు". [సూరతున్నమల్ : 65వ ఆయతు]

14 వ ప్రశ్న: అర్'కాన్ అల్ ఈమాన్ (విశ్వాసం యొక్క మూలనియమాలు) ఎన్ని?

జవాబు: ఈమాన్ యొక్క మూలనియమాలు ఆరు. అవి: 1) మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం.
2) ఆయన దూతలపై విశ్వాసం.
3) ఆయన గ్రంధాలపై విశ్వాసం.
4) ఆయన సందేశహరులపై విశ్వాసం.
5) అంతిమదినంపై విశ్వాసం.
6) ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.
దీనికి సాక్ష్యాధారం:
ముస్లిం హదీసు గ్రంధంలో నమోదు చేయబడిన సుప్రసిద్ధ హదీసు జిబ్రయీల్ అలైహిస్సలాం లో దీని సాక్ష్యాధారం ఉన్నది: ఇక ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి. దానికి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించుట".

15వ ప్రశ్న: ఈమాన్ (విశ్వాసం) యొక్క మూలనియమాల గురించి వివరించండి?

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:
మిమ్మల్ని సృష్టించిన, మిమ్మల్ని పోషిస్తున్న, ఇంకా సకల సృష్టిరాశుల యజమాని మరియు నిర్వాహకుడు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించుట.
మరియు ఆయనే ఆరాధ్యుడు. నిజానికి, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు.
మరియు ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయనను పోలిన వారెవ్వరూ లేరు. ఆయనలో ఎలాంటి లోపాలూ, కొరతలూ లేవు.
దైవదూతల పై విశ్వాసం:

కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి మరియు తన ఆజ్ఞలను మాత్రమే పూర్తిగా అనుసరించేందుకు, అల్లాహ్ కాంతి నుండి సృష్టించిన గొప్ప సృష్టిరాశులే దైవదూతలు.
వారిలో జిబ్రయీల్ అలైహిస్సలామ్ ఒకరు. ఆయన ప్రవక్తలకు, సందేశహరులకు ప్రత్యక్షంగా దైవసందేశాన్ని అందిస్తారు.
దైవగ్రంధాల పై విశ్వాసం:

ఉదాహరణకు అల్లాహ్ తన సందేశహరులపై అవతరింప జేసిన గ్రంధాలు.
ఖుర్ఆన్ గ్రంధం:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింప జేయబడింది.
ఇంజీలు గ్రంధం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
తౌరాతు గ్రంధం ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
జబూర్ గ్రంధం ప్రవక్త దూవూద్ అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
సహీఫ ఇబ్రాహీమ్ మరియు మూసా (అలైహిమ స్సలాం): ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు మూసా అలైహిమస్సలాంల పై అవతరింప జేయబడినాయి.
దైవసందేశహరుల పై విశ్వాసం:

మరియు తన దాసులకు (ధర్మం) బోధించడానికి, మంచితనం మరియు స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను అందించడానికి, ఇంకా చెడు మరియు నరకం నుండి వారిని హెచ్చరించడానికి అల్లాహ్ తన సందేశహరులను ఉద్భవింపజేసాడు.
మరియు వారిలో ఉత్తములు మరియు దృఢసంకల్పం గల కొందరు సందేశహరులు:

నూహ్ అలైహిస్సలాం.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం.
మూసా అలైహిస్సలాం.
ఈసా అలైహిస్సలాం.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రళయదినం పై విశ్వాసం:

ప్రళయదినంపై విశ్వాసం అంటే సమాధిలోని మరణానంతరం జీవితంపై విశ్వాసం ఉదాహరణకు ప్రళయదినం, పునరుత్థాన దినం, అంతిమ తీర్పుదినం, చివరికి శాశ్వతంగా స్వర్గవాసులు స్వర్గంలోని తమ స్థానాల్లో మరియ నరకవాసులు నరకంలోని తమ స్థానాల్లో చేరటంపై విశ్వాసం.
6) అల్ ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం:
అల్ ఖదర్: విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు అనీ, ఆయన ఆ జ్ఞానాన్ని దానిని అత్యంత సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే దివ్యగ్రంధంలో లిఖించి ఉంచాడని, దాని ఉనికి ఆయన ఇష్టానుసారమే ఉందని మరియు దానిని ఆయనే సృష్టించాడని విశ్వసించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
"నిశ్చయంగా మేము ప్రతి దానినీ నిర్ణీత పరిమాణములో సృష్టించాము." [సూరతుల్ ఖమర్ 49]
అది నాలుగు స్థాయిలలో జరిగింది:
మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహాద్భుత జ్ఞానము. ప్రతిదీ సంభవించక ముందు మరియు సంభవించిన తర్వాత విషయాల గురించి తన అపూర్వ జ్ఞానం వలన ఆయన ముందే ఎరుగును.
దీనికి సాక్ష్యం:
మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ యొక్క జ్ఞానము కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షాన్ని కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తమూ తెలిసినవాడు (ఎరిగినవాడు). [సూరతు లుఖ్మాన్: 34వ ఆయతు]
రెండవది: దీనిని అల్లాహ్ సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే మహాద్భుత గ్రంధంలో లిఖించాడు. కాబట్టి జరిగినదీ మరియు జరగబోయేదీ ప్రతిదీ ఆయన అందులో నమోదు చేసి ఉంచాడు.
దీనికి సాక్ష్యం:
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజా, అది పచ్చిది కానీ ఎండినది కానీ, అంతా స్పష్టంగా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.}[59] [సూరతుల్ అన్ఆమ్: 59వ ఆయతు]
మూడవది: ప్రతిదీ అల్లాహ్ యొక్క చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయన ఇష్టానుసారంగా కాకుండా జరగదు.
దీనికి సాక్ష్యం:
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [సూరతు అత్తక్వీర్: 28-29వ ఆయతులు]
నాల్గవది: మొత్తం సృష్టిలోని జీవరాశులన్నీ అల్లాహ్ చే సృష్టించబడిన జీవరాశులు అని విశ్వసించుట. ఆయనే వాటి ఆత్మలనూ, గుణగణాలనూ, కదలికలనూ మరియు వాటిలో ఉన్న ప్రతిదాన్నీ సృష్టించాడు.
దీనికి సాక్ష్యం:
మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: "వాస్తవానికి, మిమ్మల్నీ మరియు మీరు చేసిన (చెక్కిన) వాటినీ సృష్టించింది అల్లాహ్ యే కదా!" [సూరతు అస్సాఫ్ఫాత్: 96]

16వ ప్రశ్న: ఖుర్ఆన్ ను నిర్వచించండి?

ఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు, అది సృష్టించబడిన వాటిలోనిది కాదు.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు బహుదైవారాధకులలో (ముష్రికీనులలో) ఎవడైనా నీ శరణు కోరితే – అతడు అల్లాహ్ గ్రంధాన్ని (ఖుర్ఆను) వినటానికి – అతనికి శరణు ఇవ్వు. [సూరతు అత్తౌబా: 6వ ఆయతు]

17వ ప్రశ్న: సున్నతు అంటే ఏమిటి?

జవాబు: సున్నతు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, ఆచరణలు, అనుమతులు మరియు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క స్వభావం.

18వ ప్రశ్న: బిద్అతు (ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలు, ఆవిష్కరణలు) అంటే ఏమిటి? మనం వాటిని అంగీకరిస్తామా ?

జవాబు: ప్రజలు ధర్మంలో ఆవిష్కరించిన ప్రతి నూతన కల్పితమూ బిద్అత్ గానే పరిగణించబడుతుంది. మరియు దాని ఉనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల కాలంలో కనబడదు.
దానిని మనం అంగీకరించకూడదు, వాస్తవానికి దానిని సూటీగా తిరస్కరించ వలెను.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ప్రతి నూతన ధార్మిక కల్పితం, ఆవిష్కరణ మార్గభ్రష్టత్వమే. అబూ దావుద్ హదీసు గ్రంధము.
ఉదాహరణకు:
వుజులో (మూడు సార్లు కడగటంతో ఆగకుండా) నాల్గవ సారి కడగటం, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆరాధనలో నిర్దేశించబడిన వాటిలో హద్దులు మీరటం. ఇలాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి గానీ, ఆయన సహాబాల రజియల్లాహు అన్హుమ్ నుండి గానీ నమోదు చేయబడలేదు.

19వ ప్రశ్న: అల్ వలాఅ మరియు అల్ బరాఅ కు సంబంధించిన సిద్ధాంతాన్ని పేర్కొనండి?

జవాబు: అల్ వలాఅ అంటే దైవవిశ్వాసులతో ప్రేమగా మెలుగుతూ, వినమ్రతతో వారికి సహాయ సహకారాలు అందించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరి కొకరు స్నేహితులు. [సూరతు అత్తౌబా: 71వ ఆయతు]
అల్ బరాఅ: అంటే సత్యతిరస్కారులను మరియు ఇస్లాంకు విరుద్ధంగా వారు చూపే శత్రుత్వాన్ని ద్వేషించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
"వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకో: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది". [సూరతుల్ ముమ్తహినహ్: 4వ ఆయతు]

20వ ప్రశ్న: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అంగీకరిస్తాడా?

జవాబు: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అస్సలు అంగీకరించడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత చూపడాన్ని (ఇస్లాం ను) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు. [సూరతు ఆలే ఇమ్రాన్ : 85వ ఆయతు]

21వ ప్రశ్న: కుఫ్ర్ (సత్యతిరస్కారం, అవిశ్వాసం) అనేది మాటల్లోనూ, చేతల్లోనూ, మనస్సులోనూ జరుగుతుంది అనడానికి ఉదాహరణ ఇవ్వండి?

జవాబు: మాటల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: అల్లాహ్ ను లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దూషించడం.
చేతల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: ఖుర్ఆన్ ను అవమానించడం లేదా మహోన్నతుడైన అల్లాహ్ కు కాకుండా మరొకరికి సజ్దా (సాష్టాంగం) చేయడం.
మనస్సులోపల సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఆరాధనలకు అర్హుడు మరొకడు ఉన్నాడని లేదా మహోన్నతుడైన అల్లాహ్ తో పాటు మరో సృష్టికర్త ఉన్నాడని నమ్మడం.

22వ ప్రశ్న: నిఫాఖ్ (కపటత్వం) అంటే ఏమిటి?

జవాబు:
1) ఘోరమైన కపటత్వము (అన్నిఫాఖు అల్ అక్బరు): మనసు లోపల అవిశ్వాసాన్ని దాచి పెట్టి, బయటికి విశ్వాసిగా నటించడం.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది మరియు ఇది ఘోరమైన అవిశ్వాసంగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలోని అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు చూడవు. [సూరతున్నిసా : 48వ ఆయతు]
2) అల్పమైన కపటత్వము:
ఉదాహరణ: అబద్ధం పలకడం, వాగ్దాన భంగము, నమ్మకద్రోహము మొదలైనవి.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు. గానీ, పాపకార్యంగా పరిగణించ బడుతుంది, అలాంటి వ్యక్తికి కఠినశిక్షలు విధించబడతాయి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
{కపటవిశ్వాసిలో మూడు చిహ్నాలు ఉంటాయి: అతడు మాట్లాడినప్పుడు అసత్యమాడుతాడు, ప్రమాణం చేసి తప్పుతాడు, అమానతుగా ఉంచమని అప్పగిస్తే, నమ్మకద్రోహం చేస్తాడు.} బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

23వ ప్రశ్న: ప్రవక్తల మరియు సందేశహరుల పరంపరను అంతం చేసే సీలుముద్ర వంటి వారు ఎవరు ?

జవాబు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు. [సూరతుల్ అహ్ జాబ్ : 21వ ఆయతు] రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను ప్రవక్తల పరంపరను ముగించే సీలుముద్రను. నా తరువాత ఏ ప్రవక్తా పంపబడడు. అబూ దావూద్, తిర్మిజీ, నసాయి హదీసు గ్రంధాలు

24వ ప్రశ్న: మహిమ (అద్భుతం) అంటే ఏమిటి ?

ప్రతి అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటనను మోజిజా అంటే మహిమ లేదా అద్భుతం అంటారు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తలకు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి మద్దతుగా వారికి కొన్ని మహిమలు, అద్భుతాలు ప్రసాదించాడు. ఉదాహరణకు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం (అల్లాహ్ ఆజ్ఞతో) చంద్రుడిని రెండుగా చీల్చడం.
మూసా అలైహిస్సలాం (అల్లాహ్ ఆజ్ఞతో) సముద్రాన్ని రెండుగా చీల్చడం, ఫిరౌనును మరియు అతడి సైన్యాన్ని అందులో ముంచి వేయడం.

25 వ ప్రశ్న: సహాబా అంటే ఎవరు? మనం వారిని ప్రేమించ వలసి ఉన్నదా?

జవాబు: ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రత్యక్ష్యంగా కలిసారో, విశ్వసించారో మరియు విశ్వాసిగానే చనిపోయారో, అతనిని సహాబా అంటారు.
మనం వారిని ప్రేమించ వలెను మరియు వారిని అనుసరించ వలెను. ప్రవక్తల తరువాత మానవజాతిలో వారు ఉత్తములు మరియు శుభమైన వారు.
వారిలో అత్యుత్తములు:
నలుగురు ఖలీఫాలు.
అబూబక్ర్ రజియల్లాహు అన్హు
ఉమర్ రజియల్లాహు అన్హు
ఉస్మాన్ రజియల్లాహు అన్హు
అలీ రజియల్లాహు అన్హు

26వ ప్రశ్న: ఉమ్మహాతుల్ మోమినీన్ అంటే ఎవరు ?

జవాబు: వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర భార్యలు
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : విశ్వాసులకు (ముస్లింలకు) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, స్వయం కంటే కూడా ముఖ్యులు మరియు అతని భార్యలు వారికి తల్లులు. [సూరతుల్ అహ్'జాబ్: 6వ ఆయతు]

27వ ప్రశ్న: మనపై విధిగా ఉన్న 'అహ్లే బైత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకుల' హక్కు ఏమిటి ?

వారిని గౌరవించేవారిని మేము గౌరవిస్తాము, వారిని ద్వేషించేవారిని మేము ద్వేషిస్తాము. మరియు మేము వారితో హద్దుమీరి ప్రవర్తించము మరియు వారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర భార్యలు.

28వ ప్రశ్న: ముస్లింల పాలకుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?

జవాబు. వారిని గౌరవించడం, శ్రద్ధగా వినడం,విధేయత చూపడం వారి పై తిరుగుబాటు చేయకుండా ఉండడం, వారిని విడిచి పెట్టకుండా ఉండడం, బహిరంగంగా కాకుండా గోప్యంగా వారికి సలహా ఇవ్వడం.

29వ ప్రశ్న: విశ్వాసుల నివాస స్థలము ఏది?

జవాబు: స్వర్గం (జన్నత్). మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. [సూరతు ముహమ్మద్ : 19వ ఆయతు]

30వ ప్రశ్న: అవిశ్వాసుల నివాస స్థలము ఏది?

జవాబు: నరకాగ్ని (జహన్నుమ్). మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయ పడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది. [సూరతుల్ బఖరహ్: 24వ ఆయతు]

31వ ప్రశ్న: భయపడటం అంటే ఏమిటి? ఆశ పడటం అంటే ఏమిటి? వాటికి సాక్ష్యాధారాలు ఏవి?

జవాబు: భయపడటం అంటే అది అల్లాహ్ నుండి మరియు ఆయన కఠినశిక్షల నుండి భయపడటం
ఆశ పడటం అంటే అల్లాహ్ నుండి అనుగ్రహాలు లభిస్తాయని ఆశించడం, అల్లాహ్ మనల్ని మన్నిస్తాడని మరియు మనపై కారుణ్యం చూపుతాడని ఆశించడం.
దీనికి ఆధారం :
మహోన్నతుడై అల్లాహ్ వాక్కు : {వారే అంటే ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!} [సూరతుల్ ఇస్రా: 57వ ఆయతు] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నా దాసులకు ఇలా తెలియజెయ్యి: నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించేవాడను, కరుణించేవాడను. మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష! [సూరతుల్ హిజ్ర్: 49-50వ ఆయతులు)

32వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలు పేర్కొనండి?

జవాబు: అల్లాహ్, అర్రబ్, అర్రహ్మాన్, అస్సమీయి, అల్ బసీర్, అల్ అ'లీమ్, అర్రజ్జాఖ్, అల్ హయ్యి, అల్ అజీమ్ మొదలైనవి మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలూను.

33వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ దివ్యనామము గురించి వివరించండి?

జవాబు: అల్లాహ్ - అర్ధము అల్ ఇలాహ్, నిజమైన ఆరాధ్యుడు, ఏకైకుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి గానీ, భాగస్వాములు గానీ ముమ్మాటికీ ఎవ్వరూ లేరు, ఏదీ లేదు.
అర్రబ్:
సృష్టికర్త, యజమాని, పోషకుడు, వ్యవహారాలను చక్కబెట్టేవాడు, ఏకైకుడు, ఏ లోపమూ మరియు ఏ కొరతా లేని వాడు.
అస్సమీఉ:
సృష్టిలోని ప్రతిదీ వినగలిగేటంతటి గొప్ప శ్రవణశక్తి గలవాడు. వాటి మధ్య తేడాలు మరియు వైరుధ్యాలు ఉన్నప్పటికీ సృష్టిలోని శబ్దాలన్నింటినీ వినగలవాడు,
అల్ బసీరు:
సృష్టిలోని ప్రతిదీ చూడగలిగేవాడు. సూక్ష్మమైనదైనా, అతి పెద్దది అయినా ప్రతిదీ చూడగలిగేవాడు.
అల్ అ'లీము:
భూత, వర్తమాన, భవిష్య కాలములలో సృష్టిలోని ప్రతిదానిని తన అపూర్వ జ్ఞానంతో ఆవరించి ఉన్నవాడు.
అర్రహ్మాన్:
సకల సృష్టిరాశులను ఆవరించగలిగేంత కరుణ కలిగినవాడు. ప్రతి దాసుడూ, ప్రతి సృష్టిరాశీ ఆయన కారుణ్యం వలననే జీవిస్తున్నాయి.
అర్రజ్'జాఖ్:
మొత్తం మానవజాతినీ, జిన్నాతులనూ మరియు సృష్టిరాశులన్నింటినీ పోషించగలిగే శక్తి గలవాడు.
అల్ హయ్యి:
నిత్యుడు, మరణం లేనివాడు. మొత్తం సృష్టి నాశనమై పోయినా మిగిలి ఉండే వాడు.
అల్ అజీమ్:
తన దివ్యనామాలు, గుణగుణాలు మరియు దివ్య కార్యాలలో పరిపూర్ణతలన్నీ మరియు మహిమలన్నీ కలిగి ఉన్నవాడు.

34వ ప్రశ్న: ముస్లింల పండితుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?

జవాబు: ముస్లిం పండితుల పట్ల మన కర్తవ్యం ఏమిటంటే వారిని ప్రేమించడం మరియు షరీఅతు సంబంధిత సమస్యలు మరియు అపూర్వమైన సంఘటనల పరిష్కారం కొరకు వారిని సంప్రదించడం. మనం పండితులను సగౌరవంగా సంభోదించాలి మరియు ప్రస్తావించాలి. ఎవరైతే వారితో ప్రతికూలంగా, అవమానకరంగా ప్రవర్తిస్తారో, వారు సన్మార్గంపై లేనట్లే.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించ- బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు.11} [సూరతుల్ ముజాదిలహ్:11]

35వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఔలియాలు అంటే ఎవరు ?

జవాబు: వారు మోమినీనులు (విశ్వాసులు) మరియు ముత్తఖీనులు (అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారు).
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{నిశ్చయంగా అల్లాహ్ కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! 62 ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో!63} [సూరతు యూనుస్: 62-63]

36వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) మాటల్లో మరియు చేతల్లో కూడా ఉంటుందా?

జవాబు: అవును, ఈమాన్ మాటల్లోనూ, చేతల్లోనూ, మనస్సులోనూ ఉంటుంది.

37వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) పెరుగుతూ, తరుగుతూ ఉంటుందా?

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ కు విధేయత చూపుతున్నప్పుడు ఈమాను పెరుగుతుంది మరియు అవిధేయత చూపుతూ, పాపాలు చేస్తున్నప్పుడు ఈమాన్ తరుగుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు. (సూరతుల్ అన్'ఫాల్: 2వ ఆయతు)

38వ ప్రశ్న: అల్ ఇహ్సాన్ అంటే ఏమిటి?

అల్ ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం.

39వ ప్రశ్న: ఏ యే సమయాలలో చేసే ఆచరణలు లోపరహితుడైన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యంగా ఉంటాయి?

జవాబు: ఈ రెండు షరతులు పూర్తయినప్పుడు.
1 - మహోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆ ఆచరణ అయి ఉండాలి.
2 - ఆ ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును (విధానాన్ని) బట్టి ఉండాలి.

40వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ పై నమ్మకం పెట్టుకోవడం (తవక్కుల్ అలల్లాహ్) అంటే ఏమిటి ?

జవాబు: అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగించుకుంటూ, ప్రయోజనం పొందడంలో మరియు హానిని నివారించడంలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{ఎవరైతే అల్లాహ్ పై నమ్మకము ఉంచుతారో, అలాంటి వానికి ఆయనే చాలు...3} [సూరతు అత్తలాఖ్: 3]
హస్బుహు: అంటే ఆయన అతనికి సరిపోయేటంత అధికంగా ప్రసాదిస్తాడు అని అర్థము.

41వ ప్రశ్న: అల్ అమర్ బిల్ మఅరూఫ్ వ అన్నహీ అనిల్ ముంకర్ (మంచి చేయమని ఆదేశించడం మరియు చెడు చేయవద్దని నిరోధించడం) ఆదేశంలో తప్పనిసరి విధి ఏమిటి?

జవాబు: అల్ మఆరూఫ్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ కు అన్ని విధాలా విధేయత చూపడం మరియు అల్ ముంకర్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ అవిధేయత చూపుతూ పాపకార్యాలకు పాల్పడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు.} [సూరతు ఆలే ఇమ్రాన్: 110వ ఆయతు]

42 : అహ్లె సున్నతు వల్ జమాఅతు అంటే ఎవరు ?

జవాబు: తమ విశ్వాసంలోనూ, మాటలలోనూ మరియు చేతలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన సహాబాలను మాత్రమే తు.చ. తప్పకుండా అనుసరించేవారు.
మరియు వారికి అహ్లుల్ సున్నహ్ అనే పేరు పెట్టారు:
ఎందుకంటే వారు కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను మాత్రమే అనుసరించినందుకు మరియు ధర్మంలో నూతన కల్పితాలను త్యజించినందుకు గానూ.
మరియు జమాఅతు:
ఎందుకంటే వారు సామూహికంగా సత్యంపై జమ అయ్యారు మరియు తమలో తాము భేదభావాలతో విడిపోలేదు.

ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్ర) విభాగము47

1: అత్తహారతు (పరిశుద్ధత) అంటే ఏమిటి?

జవాబు: అత్తహారతు: అంటే అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) మరియు ఖబస్ (పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి పరిశుద్ధత పొందుట.
అత్తహారతుల్ ఖబస్ (నజాసహ్, పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే ఒకరి శరీరం నుండి, బట్టల నుండి లేదా సలాహ్ (నమాజు) చేసే స్థలం నుండి భౌతిక మలినాలను తొలగించడం.
తహారతుల్ హదస్:
అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే స్వచ్ఛమైన నీటితో వుజు చేయడం; లేదా గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం; లేదా నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించడం కష్టంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ (పరిశుభ్రమైన మట్టి ద్వారా శుద్ధీకరణ) చేయడం.

2: నజాసహ్ (పదార్థ అశుద్ధత) ద్వారా ప్రభావితమైన వాటిని ఎలా శుద్ధి చేయవచ్చు?

జవాబు: అపరిశుద్ధత తొలగిపోయే వరకు శుభ్రంగా నీటితో కడగటం ద్వారా.
కుక్క నాకిన దానిని శుద్ధి చేసేందుకు మొదట దానిని శుభ్రమైన మట్టితో (దుమ్ము, ధూళితో) శుభ్రం చేసి, తర్వాత ఆరు సార్లు నీటితో కడగ వలెను, అంటే మొత్తం ఏడు సార్లు శుభ్రం చేయవలెను.

3: వుజు ఘనత ఏమిటి?

జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక ముస్లిం దాసుడు లేదా ఒక మోమిన్ దాసుడు (ముస్లిం లేదా మోమిన్ పదాలలో ఏది అన్నారనే దానిపై ఉల్లేఖకునికి సంశయం ఉంది ) వుజు ఆచరిస్తున్నపుడు తన ముఖాన్ని నీటితో శుభ్రపరుస్తాడు ఆ క్రమం లో అతని ముఖం నుండి కళ్ల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేదా ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. చేతులు శుభ్రపరిచినపుడు ఆ చేతుల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేక ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. కాళ్ళు శుభ్రపరిచినప్పుడు వాటి ద్వారా జరిగిన పాపాలన్నీ తుడిచి వేయబడతాయి. చివరికి అతను తన పాపాలన్నింటి నుండి పరిశుద్దుడవుతాడు. ముస్లిం హదీసు గ్రంధము

4: వుజు ఎలా చేయాలి?

జవాబు: ముందుగా అరచేతులు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
తత'మజ్ మజ, తస్'తంషఖ్ మరియు తస్'తంసిర్ మూడు సార్లు చేయాలి.
అల్ మజ్'మజహ్:
అంటే నోటిలో నీరు పట్టి, బాగా పుక్కిలించి, బయటకు ఉమ్మేయాలి.
అల్ ఇస్తింషాఖ్:
అంటే ముక్కులో నీరు ఎక్కించి, ఎడమచేతి వేళ్ళతో ముక్కు లోపల శుభ్రం చేసుకోవటం.
తస్'తంసిర్:
ముక్కు లోపల ఎడమచేతి వ్రేళ్ళతో శుభ్రపరుచుకున్న తరువాత ముక్కును పట్టుకుని, ఆ నీటిని బయటికి చీదడం.
ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి
ఆ తరువాత, మోచేతుల వరకు రెండు చేతులూ మూడు సార్లు చేతులు కడగాలి (ముందుగా కుడిచేయి కడగాలి, తరువాత ఎడమచేయి).
ఆ తరువాత, రెండు తడి అరచేతులను దగ్గరగా చేర్చి, తలపై తుడవాలి (నుదురు పైభాగం నుండి ప్రారంభించి, వెనక్కు), రెండు చెవుల లోపలి భాగాన్ని చూపుడు వ్రేలితో, మరియు చెవి వెనుక భాగాన్ని బొటన వ్రేలితో శుభ్రపరచుకోవాలి.
ఆ తరువాత, రెండు పాదాలను చీలమండలాల వరకు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. (ముందుగా కుడిపాదం కడగాలి, తరువాత ఎడమపాదం).
దీనితో మీ వుజు పూర్తి అవుతుంది. ఉస్మాన్, అబ్దుల్లాహ్ బిన్ జైద్ మొదలైన వారి (రదియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనల ఆధారంగా సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంధాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన అత్యంత పరిపూర్ణమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ పద్ధతి. వుజులో శుభ్రపరచుకోవలసిన శరీర అవయవాలు ఒక్కోసారి లేదా రెండు రెండు సార్లు కడగ వలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా సహీహ్ అల్ బుఖారీ మరియు ఇతర హదీసు గ్రంధాలలో నమోదు చేయబడింది.

5: వుజులో తప్పనిసరి ఆచరణలు ఏమిటి?

జవాబు: వుజులో విధిగా చేయవలసిన ఆచరణలు ఇక్కడ పేర్కొనబడినాయి. వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టినా, ఒకరి వుజు చెల్లుబాటు కాదు. అవి:
1 - ముఖం కడుక్కోవడం, నోట్లో మరియు ముక్కులో నీరు ఎక్కించి శుభ్రం చేసుకోవడం.
2 - రెండు చేతులూ మోచేతుల వరకు కడుక్కోవడం.
3 - తడి అరచేతులతో తలపై తడపడం మరియు రెండు చెవులను శుభ్రం చేసుకోవడం.
4 - రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం.
5 - ముందుగా ముఖాన్ని కడుక్కోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత తలపై తుడవడం, చివరగా పాదాలు కడుక్కోవడం వరుస క్రమంలో పాటిస్తూ, నిర్దేశించిన క్రమాన్ని అనుసరించడం.
6 - వరుస క్రమంలో అంటే అవయవాలు పొడిగా మారడానికి అనుమతించే సమయ వ్యవధి అధిగమించకుండా వుజు అవయవాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి కడగడం.
వుజు మొత్తం ఒకేసారి పూర్తి చేయకుండా, ఒకసారి సగం మాత్రం చేసి, కొంతసేపటి తరువాత మిగతా సగం చేస్తే ఆ వుజు చెల్లదు.

6: వుజులోని సున్నతులు ఎన్ని? అవి ఏవి?

జవాబు: సునన్ అల్ వుజు అంటే వీటిని పూర్తి చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, ఒకవేళ పూర్తి చేయక పోతే ఎలాంటి దోషమూ లేదు మరియు అతని వుజు చెల్లుతుంది.
1 - తస్మియహ్ - బిస్మిల్లాహ్ పదాలతో ప్రారంభించడం.
2 - అస్,సివాక్ (పంటిపుల్లతో పళ్ళు శుభ్రం చేసుకోవడం)
3 - రెండు అరచేతులు శుభ్రం చేసుకోవడం.
4 - వ్రేళ్ళ మధ్య శుభ్రం చేసుకోవడం
5 - ఉదూలో కడగ వలసిన అవయవాలను రెండోసారి మరియు మూడోసారి కడగడం
6 - ప్రతిసారీ కుడువైపుతో ప్రారంభించడం
7 - వుజు పూర్తి చేసిన తరువాత అల్లాహ్ యొక్క ధ్యానం (అద్కార్) చేయడం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్'హదు అన్న ముహమ్మదన్ అబ్'దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
8 - వుజు చేసిన తరువాత రెండు రకాతుల సలాహ్ చేయడం

7: వుజు భంగం చేసే విషయాలు ఏమిటి?

జవాబు: రెండు మర్మాంగాల నుండి బయటికి వచ్చేది ఏదైనా సరే అంటే మూత్రం, మలం, గాలి మొదలైనవి వుజును భంగం చేస్తుంది.
నిద్ర పోవడం లేదా పిచ్చి పట్టడం లేదా స్పృహ కోల్పోవడం
ఒంటె మాంసం భుజించడం
మర్మాంగాలను ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా స్పర్శించడం

8: తయమ్ముమ్ అంటే ఏమిటి?

జవాబు: తయమ్ముమ్ అంటే నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించలేనప్పుడు శుభ్రమైన ఇసుక, దుమ్ము, ధూళి లేదా మట్టి వంటి వాటిని ఉపయోగించి పరిశుభ్రం కావడం.

9: తయమ్ముమ్ ఎలా చేయాలి?

జవాబు: రెండు అరచేతులను ఒక్కసారి దుమ్ము (మట్టి) పై కొట్టి, ముఖాన్ని, చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే తుడిచి తయమ్ముమ్ పూర్తి చేస్తాము.

10: తయమ్ముమ్ ను భంగం చేసే విషయాలేమిటి?

జవాబు: వుజును భంగం చేసే విషయాలన్నీ తయమ్ముమ్ ను కూడా భంగం చేస్తాయి.
ఇంకా, నీరు అందుబాటులోకి రాగానే తయమ్ముమ్ తో చేసిన శుద్ధీకరణ ముగుస్తుంది.

11: అల్ ఖుఫ్ఫైన్ మరియు అల్ జవరబైన్ అంటే ఏమిటి? వాటిపై మసహ్ (తుడవటం) చేయ వచ్చునా?

జవాబు: అల్ ఖుఫ్ఫైన్: అంటే పాదాలకు తొడిగే చర్మపు మేజోళ్ళు.
అల్ జవరబైన్:
అంటే చర్మంతో తయారు చేసిన మేజోళ్ళు కాకుండా పురుషులు పాదాలకు తొడిగే ఇతర మేజోళ్ళు.
వుజు చేస్తున్నప్పుడు, పాదాలను నీటితో కడగకుండా, వాటిపై మసహ్ చేయడం అంటే తడి చేతితో తుడవడం అనుమతించబడింది.

12: అల్ ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయడం వెనుకనున్న వివేకం ఏమిటి?

జవాబు: ఇది ప్రజలకు విషయాలను సులభతరం చేయడానికి మరియు ముఖ్యంగా శీతాకాలంలో ఎముకలు కొరికే అతి చల్లటి వాతావరణంలో మరియు ప్రయాణంలో సాక్సు తీయడం కష్టంగా ఉన్నప్పుడు వుజు చేయడంలోని కలిగే కష్టాలు, ఇబ్బందులు తగ్గించడానికి ఉద్దేశించబడింది.

13: తోలు సాక్సు పై మసహ్ చేయడం (తుడవడం) యొక్క చెల్లుబాటుకు సంబంధించిన షరతులు ఏమిటి?

జవాబు: 1 - తహారతు (ఆచార శుద్ధి) స్థితిలో ఉన్నప్పుడు అంటే వుజు చేసిన తర్వాత తోలు సాక్సు ధరించడం.
2 - తోలు సాక్సు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే అశుద్ధమైన వాటిపై మసహ్ చేయడం (తుడవడం) అనుమతించబడదు.
3 - తోలు సాక్సు తప్పనిసరిగా చీలమండలంతో సహా మొత్తం పాదాలను కప్పి ఉంచాలి.
4 - తోలు సాక్సు పై తుడవడం తప్పనిసరిగా పరిమిత వ్యవధి లోపలే ఉండాలి - అంటే ఒకచోట స్థిరంగా నివాసిస్తున్న వ్యక్తి కొరకు ఆ పరిమిత వ్యవధి ఒక పగలు మరియు రాత్రి. అలాగే ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.

14: అల్ ఖుఫ్ఫైన్ పై మసహ్ చేసే పద్ధతి ఏమిటి?

జవాబు: ఇది ఒకరి తడి వేళ్లను అతని కాలి వేళ్లపై ఉంచి అంటే తోలు సాక్సుపై ఉంచి, వాటిని పాదం పైభాగం (మోకాలి క్రింది భాగం) వరకు మసహ్ చేయాలి (తుడవాలి); అయితే కుడి చేతితో కుడి పాదంపై మరియు ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి (తుడవాలి). మసహ్ చేసే (తుడిచే) సమయంలో వేళ్లను వేరు వేరుగా ఉంచాలి మరియు పునరావృతం చేయకుండా ఒకసారి మాత్రమే చేయాలి.

15: మసహ్ ను (తోలు మోజోళ్ళపై తుడవడాన్ని) భంగం చేసే విషయాలు ఏవి?

జవాబు: 1 - మసహ్ (తోలు మేజోళ్ళపై తుడవడం) కోసం తెలుప బడిన నిర్దిష్ట వ్యవధి గడువు పూర్తి కావడం. ఎందుకంటే ఆ వ్యవధి ముగిసిన తర్వాత మరలా వాటిపై మసహ్ చేయడం (తోలు మేజోళ్ళపై తుడవడం) అనుమతించ బడలేదు: ఆ వ్యవధి - ఒకచోట స్థిరంగా నివసిస్తున్న వ్యక్తి కొరకు ఒక పగలు మరియు రాత్రి, మరియు ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
2 - వుజు స్థితిలో తొడిగిన తోలు మేజోళ్ళను వాటిలో ఒకదానిని లేదా రెండింటిని విడవడం.

16: సలాహ్ (నమాజు) అంటే ఏమిటి?

జవాబు: సలాహ్ (నమాజు) అంటే నిర్దిష్ట పదాలు మరియు చర్యల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది తక్బీర్ (అంటే అరబీ భాషలో అల్లాహు అక్బర్ (అందరి కంటే గొప్పవాడు)) అనే పదాలతో మొదలై, తస్లీమ్ (సలాహ్ (నమాజు)ను ముగించే సలాం పదాలతో ముగుస్తుంది.

17: సలాహ్ (నమాజు) గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది అంటే తప్పనిసరి చేయబడింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{నిస్సందేహంగా సలాహ్ (నమాజు) ను నిర్ణీత వేళల్లో పూర్తి చేయటం విశ్వాసులపై విధిగావించబడింది.} [సూరతున్నిసా : 103వ ఆయతు]

18: సలాహ్ (నమాజు) చేయని ముస్లింల గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: సలాహ్ (నమాజు) చేయకపోవటం అనేది కుఫ్ర్ (అవిశ్వాసం) గా పరిగణించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
"మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు".
అహ్మద్ మరియు అత్తిర్మిజి మొదలైన హదీసు గ్రంధాలు

19: రాత్రింబవళ్ళలో (అంటే 24 గంటలలో) ఒక ముస్లింపై ఎన్ని సలాహ్ లు (నమాజులు) విధిగావించబడినాయి? ప్రతి సలాహ్ లోని రకాతుల సంఖ్య ఎంత?

జవాబు: రాత్రింబవళ్ళలో (అంటే 24 గంటలలో) ప్రతి ముస్లింపై ఐదు సార్లు సలాహ్ (నమాజు) విధిగావించబడినది, ఫజ్ర్ - రెండు రకాతులు, జొహర్ - నాలుగు రకాతులు, అస్ర్ నాలుగు రకాతులు, మగ్రిబ్ - మూడు రకాతులు, ఇషా - నాలుగు రకాతులు.

20: సలాహ్ (నమాజు) చేయటానికి తప్పనిసరిగా పాటించ వలసిన షరతులు ఏమిటి?

1 - అల్ ఇస్లాం: అవిశ్వాసుల సలాహ్ (నమాజు) చెల్లదు.
2 - అల్ అఖల్: మతిస్థిమితంలేని వారి సలాహ్ చెల్లదు.
3 - అల్ తమియ్యజ్: బుద్ధి, వివేకం లేని పిల్లల సలాహ్ చెల్లదు.
4 - అన్నియ్యహ్: సంకల్పం
5 - సలాహ్ యొక్క నిర్ణీత సమయంలో ప్రవేశించడం.
6 - అల్ హదస్ (ఆచార అశుద్ధి) నుండి పరిశుభ్రము కావడం.
7 - అల్ నజాసహ్ (పదార్థ అశుద్ధి) ను తొలగించడం.
8 - అవ్రహ్ (తప్పనిసరిగా కప్పుకోవలసిన శరీర భాగాలను) కప్పుకోవడం.
9 - ఖిబ్లాకి అభిముఖంగా నిలబడడం.

21: సలాహ్ (నమాజు)లోని మొత్తం అర్'కానుల (సలాహ్ చెల్లుబాటు కావాలంటే, అందులో తప్పనిసరిగా ఆచరించవలసిన చర్యల) సంఖ్య?

జవాబు: మొత్తం పధ్నాలుగు అర్'కానులు: అవి
వాటిలో మొదటిది: తప్పనిసరి ఫర్ద్ సలాహ్ లో (నమాజులో) నిటారుగా నిలబడటం (ఆరోగ్యంగా ఉంటే).
"అల్లాహు అక్బర్" అనే పదాలతో తక్బీర్ అల్ ఇహ్రామ్ పలకడం.
సూరతుల్ ఫాతిహా పఠించడం
రుకూ చేయడం అంటే తన తల మరియు వీపు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా తన వీపును ముందుకు వంచడం.
రుకూ నుండి లేవడం
నిటారుగా నిలబడటం
సుజూద్ (సాష్టాంగం): నుదురు, ముక్కు, రెండు అరచేతులు (చెవులకు దగ్గరలో), రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు నేలపై ఆన్చి, సాష్టాంగం చేయడం.
సజ్దా నుండి పైకి లేవడం
రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం
ఇక్కడ కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్లను ఖిబ్లా దిశలో ఉంచుతూ, ఎడమ పాదం మీద కూర్చోవడం అనేది సున్నతు చర్య.
ప్రశాంతత:
సలాహ్ (నమాజు) లోని ప్రతి భంగిమను, చర్యను ప్రశాంతంగా, మనస్సు లగ్నం చేసి మరీ ఆచరించవలెను.
చివరి తషహ్హుద్ పఠించడం.
తషహ్హుద్ పఠించడం కొరకు కూర్చోవడం.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ ముందుగా కుడివైపు తల త్రిప్పాలి, ఆ తరువాత ఎడమ వైపు తల త్రిప్పాలి.
పైన పేర్కొనబడిన చర్యలను ఇదే వరుసక్రమంలో ఆచరించడం. అంటే ఒకవేళ ఎవరైనా కావాలని రుకూ చేయకుండా ముందు సజ్దా చేసి, ఆ తరువాత రుకూ చేసినట్లయితే, అతని సలాహ్ చెల్లదు. ఒకవేళ మతిమరుపు వలన అలా జరిగితే, అతను లేచి నిలుచొని ముందుగా రుకూ చేసి, తరువాత సజ్దా చేయవలెను.

22: సలాహ్ (నమాజు) లోని వాజిబాతులు పేర్కొనండి?

జవాబు: సలాహ్ (నమాజు)లో వాజిబాతులు తొమ్మిది. అవి,
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ కాకుండా మిగిలిన తక్బీర్లు
2 - ఇమాం మరియు ఒంటరిగా సలాహ్ చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను ఎవరైనా స్తుతిస్తే, అల్లాహ్ దానిని ఆలకిస్తాడు)" అని పలకడం.
3 - "రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి)" అని పలకడం.
4 - రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని మూడు సార్లు పలకడం.
5 - సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఆలా" అని మూడుసార్లు పలకడం.
6 - రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
7 - తషహ్హుద్ మొదటి భాగం పఠించడం.
8 - తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.

23: సునన్ సలాహ్ అంటే ఏవి?

జవాబు: మొత్తం 11 సునన్ అస్సలాహ్ ఉన్నాయి.
1 - దుఆ అల్ ఇస్తఫ్తాహ్ అంటే తక్బీర్ అల్ ఇహ్రామ్ తరువాత "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, వ తబారకస్ముక, వ తఅఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" అని పలకడం.
2 - తఅ'వ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ అని పలకడం.
3 - బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం.
4 - ఆమీన్ అని పలకడం
5 - సూరతుల్ ఫాతిహా తరువాత వేరే ఏదైనా సూరహ్ గానీ, ఏదైనా సూరహ్ లోని కొన్ని ఆయతులు గానీ పఠించడం.
6 - బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం చేసే సలాహ్ లలో వెనుక ఉన్న వారికి చక్కగా వినిపించేలా ఇమామ్ తన కంఠస్వరాన్ని పెంచి, ఖుర్ఆన్ వచనాలు పఠించడం.
7 - తహ్మీద్ పలకడం (అల్లాహ్ ను స్తుతించడం) - "మిలస్సమావాతి వ మినల్ అర్ద్, వ మినల్ మా షి'త మిన్ షైఇన్ బఆద్" అనే పలుకులు ఇమాం నుండి విన్న తరువాత అల్హందులిల్లాహ్ అంటూ అల్లాహ్ ను స్తుతించడం.
8 - తస్బీహ్ - రుకూలో ఎక్కువసార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అనే పలుకులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
9 - సజ్దాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ చదవటం.
10 - రబ్బిగ్'ఫిర్లీ అనే పదాలను రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
11 - చివరి తషహ్దుద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం. ఆ తరువాత దుఆలు చేసుకోవడం.
నాలుగవది:
సునన్ అల్ అఫ్ఆల్: సలాహ్ లో సిఫారసు చేయబడిన సంజ్ఞలు.
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ పలుకులతో రెండు అరచేతులను ఖిబ్లా దిశలో చెవుల క్రింది భాగం వరకు పైక లేపడం.
2 - రుకూలోకి వెళ్ళే ముందు రఫ్ ఉల్ యదైన్ చేయడం
3 - రుకూ నుండి పైకి లేచిన తరువాత రఫ్ ఉల్ యదైన్ చేయడం.
4 - రఫ్ ఉల్ యదైన్ తరువాత రెండు చేతులను క్రిందికి దించడం.
5 - ఎడమ చేతిపై కుడి చేతిని కట్టడం.
6 - సజ్దా చేసే స్థానంపై మీ కంటిచూపును ఉంచడం.
7 - నిటారుగా నిలబడినప్పుడు రెండు కాళ్ళను సముచితమైన దూరంలో ఉంచడం.
8 - రుకులో రెండు అరచేతులతో మరియు చేతివ్రేళ్ళతో రెండు మోకాళ్లను గట్టిగా పట్టుకోవడం, ఒకరి వీపును నేలకు సమాంతరంగా, తిన్నగా ఉంచుతూ, తల మరియు వీపు సమంగా ఉండేలా ముందుకు వంగడం.
9 - సజ్దా అవయవాలను నేలపై ప్రశాంతంగా ఆన్చడం, అవన్నీ నేలను తాకేలా చూసుకోవడం.
10 - సజ్దాలో రెండు మోజేతులను పక్కల నుండి దూరంగా ఉంచడం, పొత్తికడుపు తొడల నుండి మరియు తొడలను కాళ్ళ నుండి దూరంగా ఉంచడం; మోకాళ్లను వేరుగా ఉంచడం మరియు పాదాల కాలి వేళ్లు వేరు చేయడం మరియు వేళ్ళ మొన భాగాన్ని నేలకు ఆన్చడం; అరచేతులు నేలపై ఆన్చుతూ, వాటి వేళ్ళు కలిపి ఉంచి, మోజేతులను భుజాలకు సమాంతరంగా ఉంచడం.
11 - రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ సమయంలో కూర్చున్నప్పుడు ఇఫ్తీరాష్ (ఎడమ పాదాన్ని దాని వైపే ఉంచి, దానిపై కూర్చోవడం; మరియు కుడి పాదాన్ని ఖిబ్లా వైపు కాలి వేళ్ల మొనలు ఉండేలా చేయడం) చేయడం. అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో తవర్రుక్ (ఎడమ వెనుక భాగాన్ని (పిరుదులను) నేలపై పర్చి, దానిపై కూర్చోవడం; కుడి పాదం కాలి వేళ్ల ఖిబ్లా వైపు ఉంచి, పాదాన్ని నిటారుగా ఉండేలా చేయడం; మరియు ఎడమ పాదాన్ని కుడి పాదం కింద ఉండేలా చేయడం) చేయడం.
12 - రెండు సజ్దాల మధ్య మరియు తషహ్హుద్ సమయంలో చేతి వ్రేళ్ళను దగ్గరగా ఉంచి, రెండు అరచేతులను రెండు తొడల మీద పెట్టడం; అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో, తన కుడి చేతి యొక్క చిన్న మరియు ఉంగరపు వేళ్లను (చివరి రెండు వేళ్ళను) బిగించి, బొటనవేలు మరియు మధ్య వేళ్లతో ఉంగరాన్ని తయారు చేయవచ్చు మరియు అల్లాహ్ నామం ప్రస్తావిస్తున్నప్పుడు చూపుడు వేలును పైకి లేపి చూపవలెను.
13 - తస్లీమ్ చేస్తున్నప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.

24: సలాహ్ (నమాజు) చెల్లకుండా చేసే విషయాలు ఏవి?

జవాబు: (1) సలాహ్ (నమాజు) యొక్క రుకున్ లు లేదా షరతులలో నుండి దేనినైనా పూర్తి చేయక పోవడం.
(2) కావాలని సలాహ్ (నమాజు)లో మాట్లాడటం.
(3) సలాహ్ (నమాజు) లో తినడం లేదా త్రాగటం.
(4) సలాహ్ (నమాజు) లో అనవసరంగా, అధికంగా చేసే శరీర కదలికలు.
(5) కావాలని సలాహ్ (నమాజు) లో ఏదైనా వాజిబు చర్యను వదిలి వేయడం.

25: ఒక ముస్లిం సలాహ్ (నమాజు) ఎలా చేయ వలెను?

జవాబు: సలాహ్ (నమాజు) చేసే పద్ధతి
1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ సలాహ్ (నమాజు) చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
3 - భుజాల ఎత్తులో ఖిబ్లాకు అభిముఖంగా అరచేతులు ఉండేలా రెండు చేతులు పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ తక్బీర్ అల్ ఇహ్రామ్ పూర్తి చేయాలి.
4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
5 - ఈ దుఆ చేస్తూ సలాహ్ ప్రారంభించండి: అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ (ఓ అల్లాహ్! మీరు తూర్పును పశ్చిమం నుండి వేరు చేసినట్లుగా, నా పాపాల నుండి నన్ను వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం నుండి మరకలను తొలగించినట్లు నా పాపాల నుండి నన్ను శుభ్రపరచు. ఓ అల్లాహ్! మంచు, నీరు మరియు వడగళ్ళతో నా పాపాలను కడిగివేయి).
లేదా ఈ దుఆ చేయండి:
"సుబహానకల్లాహుమ్మ వబిహమ్'దిక వతబారకస్ముక వతఆలా జద్'దుక వలా ఇలాహ గైరుక". (ఓ అల్లాహ్! నీ ప్రశంసతో నీకు మహిమ కలుగునుగాక! నీ నామము శుభమైనది మరియు నీ మహిమ శ్రేష్ఠమైనది. మరియు నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు)
6 - అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోండి. అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను) 7 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించ వలెను. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1) అల్హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (స్తుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి).(2) అర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడు) (3) మాలికి యౌమిద్దీన్ (తీర్పుదినానికి యజమాని). (4) ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము).(5) ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్ (మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి).(6) శిరాతల్లదీన్ అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ (నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు).(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను. :
8 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ సలాహ్ లో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయ వలెను.
9 - ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
10 - రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు), ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్లీ ((ఓ అల్లాహ్! నీవు ఎలాంటి లోపాలకూ, కొరతలకూ అతీతుడవు. ఓ అల్లాహ్, నన్ను క్షమించు)
11 - ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలక వలెను. ఇమాంను అనుసరిస్తూ, ఆయన వెనుక సలాహ్ చేస్తున్నవారు, బదులుగా ఇలా పలక వలెను రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి).
12 - అలా పైకి లేచి, నిటారుగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్'ద్ మిల్అ స్సమావాతి వ మిల్ అల్ అర్'ది, వ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైయిన్ బఆదు. అహ్లలథ్థనాయి వల్ మజ్ది అహఖ్'ఖు మా ఖాలల్ అబ్'దు వ కుల్లునా లక అబ్దున్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనఆత వలా యన్'ఫవు దల్ జద్ది మిన్కల్ జద్దు (ఆకాశాల నిండుగా, భూమి నిండుగా మరియు వాటి మధ్య నున్న వాటి నిండుగా, ఆ తరువాత నీవు తలచిన వాటన్నింటి నిండుగా (ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి). సమస్త ప్రశంసలు మరియు ఘనతలు గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. ఓ అల్లాహ్! నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు. మరియు నీవు ఇవ్వదలచక పోతే దాన్ని ప్రసాదించే వాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనమూ నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు) అని పలుక వలెను.
13 - "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, మొదటి సజ్దాలోకి వెళ్ళ వలెను. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.
14 - సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు అపర పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది - సుబహానక అల్లాహుమ్మ, రబ్బనా వ బిహమ్'దిక అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! నేను నిన్నుస్తుతిస్తున్నాను. (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు)
15 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్త వలెను.
16 - ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశాంతంగా కూర్చోవలెను.
17 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను. రబ్బిగ్'ఫిర్లీ వర్'హమ్'నీ, వహ్'దినీ, వరజుఖ్'నీ, వజ్'బుర్'నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకం చేయి, నాకు ఉపాధి ప్రసాదించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదంచు.)
18 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయ వలెను.
19 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేచి నిలబడ వలెను (ఇక్కడితో మొదటి రకాతు పూర్తయింది), మొదటి రకాతులో పలికినట్లుగా, ఆచరించినట్లుగానే చేస్తూ రెండవ రకాతు పూర్తి చేయ వలెను.
20 - రెండవ రకాతులోని రెండవ సజ్దా చేసిన తరువాత రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే లేచి కూర్చో వలెను.
21 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను,
22 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
23 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల సలాహ్ (నమాజు) చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.
24 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, మూడవ రకాతు కొరకు లేచి నిలబడ వలెను.
25 - ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
26 - మొదటి తషహ్హుద్ లో కూర్చున్నట్లుగానే ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి లేదా కుడికాలి క్రింద ఎడమ కాలు క్రాస్ గా తీసుకు వచ్చి, ఎడమ పిరుదుపై కూర్చుని; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశంతంగా కూర్చోవలెను. (గమనిక: ఒకవేళ నాలుగు రకాతుల సలాహ్ చేస్తున్నట్లయితే, మూడవ రకాతులో కూర్చోకుండా, లేచి నిలబడి రెండవ రకాతు పూర్తి చేసినట్లుగానే నాలగవ రకాతు పూర్తి చేసి, రెండవ సజ్దా తరువాత కూర్చుని తషహ్హుద్ లోని రెండవ భాగాన్ని పఠించి, సలాము పలుకుతూ సలాహ్ ను పూర్తి చేయవలెను.)
27 - అలా ప్రశాంతంగా కూర్చుని, తషహ్హుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.
28 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.

26: సలాము పలుకుతూ సలాహ్ ముగించిన తరువాత ఏ అద్కార్ (అల్లాహ్ యొక్క ధ్యాన వచనాలు) పఠించాలి ?

జవాబు: మూడు సార్లు అస్'తగ్'ఫిరుల్లాహ్ (ఓ అల్లాహ్ నన్ను క్షమించు) అని పలకాలి.
అల్లాహుమ్మ అంత'స్సలాము, వ మిన్'కస్సలాము. తబారక్'త యా జల్'జలాలి వల్'ఇక్రామ్ (ఓ అల్లాహ్ నీవు శాంతి ప్రధాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా సకల శుభాలు కలవాడవు నీవే).
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్'దహు లా షరీకలహు, లహుల్ ముల్కు వలహుల్'హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత, వలా ము'అ'తియ లిమా మనఆత, వలా యన్'ఫఉ జల్ జద్ది మిన్'కల్ జద్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును,ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు). (మూడు సార్లు)
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వలా న'ఆబుదు ఇల్లాహ్ ఇయ్యాహు, లహున్నేమతు వలహుల్ ఫద్'ల్, వ లహుస్సనాఉల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన వ లౌ కరిహల్ కాఫిరూన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేది లేదు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే).
సుబహానల్లాహ్ ముప్పై మూడు సార్లు.
అల్ హమ్'దులిల్లాహ్ ముప్పై మూడు సార్లు.
అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు
చివరిగా దీనిని ముగిస్తూ, ఇలా పలుక వలెను: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లుహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు వహుల అలా కుల్లి షైయిన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలన్ని ఆయనకే చెందుతాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు).
ఆ తరువాత ఫజ్ర్ మరియు మగ్రిబ్ సలాహ్ లలో సూరతుల్ ఇఖ్లాస్ (112వ సూరహ్) మూడు సార్లు, సూరతుల్ ఫలఖ్ మూడు సార్లు (113వ సూరహ్) మరియు సూరతున్నాస్ మూడు సార్లు (114వ సూరహ్) పఠించ వలెను. మిగతా సలాహ్ లలో ఒక్కొక్కసారి పఠించవలెను.
ఆ తరువాత ఒకసారి ఆయతుల్ కుర్సీ (2:255) పఠించ వలెను.

27:సునన్ అర్రవాతిబ్ అంటే ఏమిటి? వాటి ఘనత ఏమిటి?

జవాబు: ఫజ్ర్ సలాహ్ కంటే ముందు రెండు రకాతులు
జొహర్ సలాహ్ కు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున)
జొహర్ సలాహ్ తరువాత రెండు రకాతులు
మగ్రిబ్ సలాహ్ తరువాత రెండు రకాతులు
ఇషా సలాహ్ తరువాత రెండు రకాతులు
వాటి ఘనత: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: ఎవరైతే రాత్రింబవళ్ళలో పన్నెండు రకాతులు సలాహ్ చేస్తారో, వాని కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. రవాహు ముస్లిం వ అహ్మద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు

28: మొత్తం వారం దినాలలో ఏది ఉత్తమమైన దినం?

జవాబు: మొత్తం వారం దినాలలో జుమఅహ్ దినం ఉత్తమమైనది. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీ దినాలలో అత్యంత శ్రేష్ఠమైన దినం శుక్రవారం; ఆ దినముననే ఆదమ్ సృష్టించబడ్డాడు, ఆ దినముననే అతను మరణించాడు, ఆ దినముననే చివరి (ప్రళయ) శంఖం ఊదబడుతుంది, ఆ దినముననే (ప్రళయ) ఆర్తనాదాలు వినబడతాయి. కాబట్టి ఆ దినము నాపై మరింత ఎక్కువగా దరూద్ పంపండి, ఎందుకంటే మీ దరూద్ లు నాకు సమర్పించబడతాయి. దానికి ప్రజలు ఇలా అడిగారు: ఓ రసూలుల్లాహ్, మీ భౌతిక శరీరం కుళ్ళిపోయిన తరువాత కూడా మా దరూద్ లు మీకు ఎలా చేరతాయి? అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తల శరీరాలు కుళ్ళకుండా భూమిని నిషేధించాడు. రవాహు అబూ దావూద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు

29: జుమఅహ్ సలాహ్ గురించి ఇస్లాం యొక్క ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: ఇది యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిఉన్న, స్థిరంగా ఒకచోట నివాసం ఉంటున్న ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి వ్యక్తిగత విధి.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు సలాహ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి, అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకో గలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది. [సూరతుల్ మునాఫిఖూన్: 9వ ఆయతు]

30: సలాతుల్ జుమఅహ్ లోని రకాతులు ఎన్ని?

జవాబు: సలాతుల్ జుమఆహ్ లోని రకాతుల సంఖ్య రెండు. ఇమాం రెండు జుమఅహ్ ఖుత్బా ప్రసంగాల తరువాత, బిగ్గరగా ఖుర్ఆన్ ఆయతులు పఠిస్తూ, రెండు రకాతుల జుమఅహ్ సలాహ్ చేయిస్తారు.

31: జుమఅహ్ సలాహ్ కు (నమాజుకు) హాజరుకాకుండా ఉండవచ్చా?

జవాబు: సరైన షరయీ కారణం లేకుండా జుమఅహ్ సలాహ్ కు (నమాజుకు) హాజరుకాకుండా ఉండేందుకు అనుమతి లేదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, ఎవరైనా నిర్లక్ష్యంతో వరుసగా మూడు జుమఅహ్ నమాజులు గైరుహాజరు అయితే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర వేస్తాడు. రవాహు అబూ దావూద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు

32: జుమఅహ్ దినమున పాటించ వలసిన సున్నతులు ఏవి?

జవాబు:
1 - గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం
2 - అత్తరు పూసుకోవడం
3 - మంచి దుస్తులు ధరించడం
4 - ముందుగానే మస్జిదుకు వెళ్ళడం
5 - వీలయినంత ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపడం
6 - సూరతుల్ కహఫ్ పారాయణం
7 - మస్జిదుకు కాలినడకన వెళ్ళడం
8 - దుఆలు ఎక్కువగా ఆమోదించబడే అవకాశం ఉన్న ఘడియను అన్వేషించడం (ఆ ఘడియ దుఆలలో గడపడం).

33: జమఆతుతో కలిసి చేసే సలాహ్ అంటే సామూహికంగా చేసే సలాహ్ (నమాజు) యొక్క ఘనత ఏమిటి?

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ఒంటరిగా చేసే సలాహ్ కంటే జమఆతుతో పాటు చేసే సలాహ్ ఇరవై ఏడు 27 రెట్లు విలువైనది" రవాహు ముస్లిం

34: సలాహ్ (నమాజు)లో ఖుషూ అంటే ఏమిటి?

జవాబు: మనస్సును, శరీరాన్ని స్థిమితంగా, ప్రశాంతంగా హాజరు పరచి, పూర్తి ఏకాగ్రతతో, అణుకువ, వినమ్రతతో, విధేయతతో (బయటి ప్రపంచాన్ని మరచి) సలాహ్ (నమాజు)లో లీనమై పోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;1 వారే! ఎవరైతే తమ సలాహ్ లో ఖుషు (వినమ్రత) పాటిస్తారో!2 [సూరతుల్ మోమినూన్ : 1-2వ ఆయతులు]

35: జకాతు యొక్క నిర్వచనం ఏమిటి?

జవాబు: ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
{మరియు మీరు జకాత్ చెల్లించండి}. [సూరతుల్ బఖరహ్: 43వ ఆయతు]

36:? సదఖతుల్ ముస్తహబ్ అంటే సిఫారసు చేయబడిన దానధర్మం అంటే ఏమిటి?

జవాబు: సదఖతుల్ ముస్తహబ్ అంటే సిఫారసు చేయబడిన దానధర్మాలలో జకాతు కాకుండా ఇతర అన్ని రకాల దానధర్మాలు వస్తాయి. ఉదాహరణకు ఏ సమయంలోనైనా ఏ మంచి పనికైనా ఉపయోగపడేలా ఏదైనా దానం చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
అల్లాహ్ మార్గంలో ఖర్చు (దానధర్మాలు) చేయండి. [సూరతుల్ బఖరహ్: 195 ఆయతు]

37: సియామ్ (ఉపవాసం) యొక్క నిర్వచనం ఏమిటి?

జవాబు: ఉపవాసం పాటించాలనే సంకల్పంతో, తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని నిర్వీర్యం చేసే వాటన్నింటి నుండి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ను ఆరాధించడం. ఇది రెండు రకాలు:
మొదటిది: సియాము వాజిబ్ అంటే విధిగావించబడిన తప్పనిసరి ఉపవాసాలు: ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటైన రమదాన్ నెల ఉపవాసాల వంటివి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{ఓ విశ్వాసులారా! ఉపవాసం మీ కొరకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడిందో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} (183) [సూరతుల్ బఖరహ్: 183వ ఆయతు]
రెండవది: స్వచ్ఛంద ఉపవాసం: సోమవారం మరియు గురువారాల్లో ఉపవాసం; ప్రతి నెలా మూడు రోజుల ఉపవాసం, వీటిలో ఉత్తమమైనవి ప్రతి చంద్రమాన నెలలో తెల్లటి దినాల ఉపవాసాలు (13, 14, 15) మొదలైన తప్పనిసరి విధిగావించ బడని ఉపవాసాలు.

38: రమదాన్ మాసపు ఉపవాసాల ఘనత ఏమిటి?

జవాబు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ పై విశ్వాసముతో మరియు పుణ్యప్రాప్తిని ఆశిస్తూ రమదాన్ ఉపవాసాలను నిష్టగా పాటించేవారి వెనుకటి పాపాలన్నీ మన్నించ బడతాయి. ముత్తఫఖున్ అలైహి

39:రమదాన్ మాసంలో కాకుండా ఇతర దినాలలో పాటించే స్వచ్ఛంద ఉపవాసాల ఘనత ఏమిటో వివరించండి?

జవాబు: అబీ సయీద్ అల్ ఖుద్'రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక దినము ఉపవాసం ఉంటారో, అల్లాహ్ ఆ దినము ఉపవాసానికి బదులుగా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై శరదృతువులంత (సంవత్సరాలంత) దూరంగా ఉంచుతాడు. ముత్తఫఖున్ అలైహి
డెబ్బై శరదృతువులు అంటే డెబ్బై సంవత్సరాలు అని అర్థం

40: ఉపవాసాలను చెల్లుబాటు కాకుండా చేసే వాటిలో కొన్నింటిని పేర్కొనండి?

జవాబు: 1 - ఉద్దేశపూర్వకంగా తినడం మరియు త్రాగడం
2 - కావాలని వాంతి చేసుకోవడం
3 - ఇస్లాం ధర్మాన్ని విడిచి పెట్టి మతభ్రష్టుడు కావడం

41: ఉపవాసంలోని సున్నతులు ఏమిటి?

జవాబు: 1 - సమయం కాగానే ఉపవాసాన్ని విరమించడంలో త్వరపడటం.
2 - తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించ వలసిన సమయం వరకు ముందు వరకు ఆగి, అప్పుడు సహరీ భోజనం చేయడం.
3 - మంచిపనులు మరియు అల్లాహ్ ఆరాధనలు అధికంగా చేయడం
4 - ఒకవేళ ఎవరైనా మీతో జగడం మొదలు పెడితే, వారితో "నేను ఉపవాసం పాటిస్తున్నాను" అని పలికి అతనితో తగవులాట నుండి దూరంగా ఉండటం
5 - ఉపవాసం విరమించే సమయంలో (ఇఫ్తార్ సమయంలో) దుఆ చేయడం
6 - అప్పుడే కోసిన ఖర్జూరపు పండ్లతో లేదా మామూలు ఖర్జూరపు పండ్లతో ఉపవాసాన్ని విరమించడం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, మంచినీళ్ళతో ఉపవాసాన్ని విరమించడం.

42: హజ్ అంటే ఏమిటో వివరించండి?

జవాబు: హజ్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను “నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆచారాలు పాటిస్తూ మక్కా నగరంలోని ఆయన పవిత్ర గృహాన్ని సందర్శించిడం” ద్వారా ఆరాధించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు హజ్ యాత్ర చేసే స్తోమత కలిగి ఉన్నవారు, అల్లాహ్ కొరకు అల్లాహ్ గృహ సందర్శన చేయవసలసి ఉంది; మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు'}[97] [సూరతు ఆలే ఇమ్రాన్ : 97 ఆయతు]

43: హజ్ యాత్రలోని అర్కాన్లు (మూలనియమాలు) ఏవి?

జవాబు: 1 - ఇహ్రాం
2 - అరఫాతు మైదానంలో నిలబడటం
3 - తవాఫ్ అల్ ఇఫాదహ్
4 - సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయడం

44: హజ్ యొక్క ఘనత ఏమిటో వివరించండి?

జవాబు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నానని తెలిపారు:- ఎవరైతే అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ హజ్జ్ యాత్రను పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా మరలుతాడు. రవాహు అల్ బుఖారీ, ముస్లిం మరియు ఇతర హదీసు గ్రంధాలు.
క యౌమ వలదతహు ఉమ్ముహు (తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా) అంటే పాపరహితుడిగా, పవిత్రంగా అని అర్థం.

45:ఉమ్రహ్ యొక్క నిర్వచనం తెలుపండి?

జవాబు: ‘ఉమ్రహ్ (చిన్న యాత్ర) అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను “ఏ సమయంలోనైనా నిర్ణీత ఆచారాలు నిర్వహించడానికి మక్కాలోని ఆయన పవిత్ర కాబాగృహాన్ని సందర్శించడం ద్వారా” ఆరాధించడం.

46:ఉమ్రహ్ లోని అర్కాన్లు ఏవి?

జవాబు: 1 - ఇహ్రాం
2 - కాబాగృహ ప్రదక్షిణలు
3 - సఫా మరియు మర్వాల మధ్య సయీ

47: అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం (జిహాదు) అంటే ఏమిటి?

జవాబు: దీని అర్థం, సత్యాన్ని కాపాడటంలో, ఇస్లాంను వ్యాపింపజేస్తూ మరియు దాని ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించడంలో, ఇస్లాం మరియు ముస్లింల బద్ధశత్రువులతో వారి దాడిని ఎదుర్కొంటూ ధర్మపోరాటం చేయడంలో అత్యంత కృషి చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది. [సూరతు అత్తౌబా: 6వ ఆయతు]

సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:32

1: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశం ఏది?

జవాబు: ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక సుప్రసిద్ధ తెగ. అరబ్ వాసులు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ బిన్ ఇస్మాయీల్ సంతానం. ఆయనపై మరియు మన ప్రవక్త పై అల్లాహ్ శుభశాంతులు కురిపించుగాక.

2: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి పేరు ఏమిటి?

జవాబు: ఆమిన బిన్తె వహబ్

3: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తండ్రి ఎప్పుడు చనిపోయారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహిన సల్లం తండ్రి మదీనా పట్టణంలో ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇంకా జన్మించకుండా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయారు.

4:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు జన్మించారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఏనుగుల సంవత్సరంలో రబీఉల్ అవ్వల్ నెలలో 12వ తేదీన జన్మించారు.

5: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎక్కడ జన్మించారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా నగరంలో జన్మించారు

6: తల్లి కాకుండా ఏ యే ఆయాలు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం కు పాలు త్రాపించినారు?

జవాబు: తండ్రి బానిసరాలైన ఉమ్మె అయిమన్
పినతండ్రి అబు లహబ్ బానిసరాలైన సువైబహ్
హలీమా అస్సాదియహ్.

7: ఆయన సల్లల్లాహు అలాహివ సల్లం తల్లి ఎప్పుడు చనిపోయింది?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తల్లి చనిపోయింది. ఆ తరువాత తాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనాపాలనా బాధ్యతలను తీసుకున్నారు.

8: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను ఎవరు తీసుకున్నారు?

జవాబు:తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఉండినప్పుడు. అపుడు ఆయన ఆలనాపాలనా బాధ్యతలను ఆయన పినతండ్రి అబూతాలిబ్ తీసుకున్నారు.

9: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రి అబూ తాలిబ్ తో కలిసి షామ్ (నేటి సిరియా, లెబనాన్, జోర్డార్ తదితర ప్రాంతాలు) వైపునకు ఎప్పుడు ప్రయాణించారు?

జవాబు: 12 సంవత్సరాల వయస్సులో ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రితో కలిసి షామ్ వైపునకు ప్రయాణించినారు.

19: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎప్పుడు ప్రయాణించారు?

జవాబు: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఖదీజహ్ రదియల్లాహు అన్హా వ్యాపార బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రయాణించారు. ఆ ప్రయాణం నుండి మరలి వచ్చిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వివాహం ఖదీజహ్ రజియల్లాహు అన్హ తో జరిగింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు.

11: కాబాగృహ పునఃనిర్మాణాన్ని ఖురైషీయులు ఎప్పుడు ప్రారంభించారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు, ఖురైషీయులు కాబాగృహ పునఃనిర్మాణాన్ని చేపట్టినారు.
కాబాగృహ పునఃనిర్మాణంలో భాగంగా హజ్రె అస్వద్ (నలుపు రాయి)ను దాని స్థానంలో ఎవరు పునరుద్ధరించాలనే విషయంపై ఖురైషీ సర్దారులు విభేదించినప్పుడు, వారు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ను తీర్పు చెప్పమని కోరినారు; అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దానిని ఒక దుప్పటిలాంటి వస్త్రంపై ఉంచారు మరియు ముఖ్యమైన నాలుగు తెగలలో నుండి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఆ వస్త్రం యొక్క నాలుగు చివరలు పట్టుకోవాలని ఆదేశించారు. అలా, వారు దానిని ఎత్తినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హజ్రె అస్వద్ ను తన శుభమైన చేతులతో దాని స్థానంలో పునరుద్ధరించారు.

12: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎంత?

జవాబు: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు నలభై ఏళ్ళు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజలకు (స్వర్గం గురించిన) శుభవార్తలు తెలిపేవానిగా మరియు (నరకాగ్ని నుండి) హెచ్చరించేవానిగా చేసి పంపబడినారు.

13: వహీ (దివ్యావతరణ) ఎలా ప్రారంభమయ్యింది ?

జవాబు: వహీ, యదార్థమైన కలలతో ప్రారంభమైంది: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం కు కలలో ఏదైతే కనబడిందో, అది యదార్థంగా కళ్ళ ముందు జరిగేది.

14:వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పరిస్థితి ఎలా ఉండేది? మొట్టమొదటిసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై వహీ ఎప్పుడు అవతరించింది?

జవాబు: మొట్టమొదటిసారి వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హిరా గుహలో అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు.
హిరా గుహలో ఆరాధనలో ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై మొట్టమొదటిసారి వహీ అవతరించింది.

15: మొట్టమొదటిసారి ఆయన పై ఖుర్ఆన్ లో నుండి ఏమి అవతరించింది?

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: పఠించు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!1 ఆయన మానవుడిని రక్తపుముద్దతో సృష్టించాడు.2 పఠించు! మరియు నీ ప్రభువు పరమదాత.3 ఆయన కలము ద్వారా నేర్పాడు.4 మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.5 [సూరతుల్ అలఖ్ : 1-5]

16: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దివ్యసందేశంపై మొట్టమొదట ఎవరు విశ్వాసం ప్రకటించారు?

జవాబు: పురుషులలో అబూ బకర్ సిద్ధీఖ్, మహిళలలో ఖదీజహ్ బిన్తె ఖువైలిది, యువతలో అలీ బిన్ అబీ తాలిబ్, బానిసలలో జైద్ బిన్ హారిసహ్, ఇంకా అరబ్బేతరులలో బిలాల్ అల్ హబషీ రదియల్లాహు అన్హుమ్ మొదలైన వారు.

17: ఇస్లాం వైపు ఆహ్వానించే ధర్మప్రచారం ఆ కాలంలో ఎలా జరిగేది?

జవాబు: మొదటి మూడు ఏళ్ళు రహస్యంగా ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ధర్మప్రచారం జరిగింది. ఆ తరువాత బహిరంగంగా సత్యధర్మ ప్రచారం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆజ్ఞాపించబడింది.

18: ఆ కాలంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయనను విశ్వసించిన వారి పరిస్థితి ఎలా ఉండేది?

జవాబు: విశ్వాసులకు అబిసీనియాలోని నజాషి (నెగస్) రాజు యొక్క ప్రాంతానికి వలస వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడనంత వరకు మక్కాలోని బహుదైవారాధకులు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ను మరియు విశ్వాసులను తీవ్రంగా బాధపెట్టేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలనే పన్నాగాన్ని బహుదైవారాధకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు; అయినప్పటికీ, అల్లాహ్ ఆయన ను రక్షించాడు మరియు వారి నుండి ఆయన ను రక్షించడానికి, పినతండ్రి అబూ తాలిబ్ ఆయన కు మద్దతు ఇచ్చేలా చేసాడు.

19: ప్రవక్తగా ప్రకటించబడిన 10వ సంవత్సరంలో ఎవరు చనిపోయారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి అబూ తాలిబ్, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఖతీజహ్ రదియల్లాహు అన్హా చనిపోయారు.

20: అల్ ఇస్రాఅ వల్ మేరాజ్ ఎప్పుడు జరిగింది?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరియు అందులో ఐదు పూటల సలాహ్ (నమాజు) తప్పనిసరి విధిగావించబడినది.
అల్ ఇస్రాఅ:
మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ నుండి అల్ అఖ్సా మస్జిదు వరకు చేసిన ప్రయాణం.
అల్ మేరాజ్:
మస్జిద్ అల్ అఖ్సా నుండి సిద్రతుల్ ముంతహా వరకు చేసిన స్వర్గారోహణ.

21: మక్కా నగరం వెలుపల ఉన్న వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించేవారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తాయిఫ్ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. మదీనా పట్టణానికి చెందిన అన్సారు ప్రజలు మక్కా వచ్చి తనకు మద్దతుగా విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేసే వరకు, వేర్వేరు ప్రాంతాల నుండి మక్కా నగరానికి విచ్చేసే యాత్రికుల సమావేశ సమయాలలో, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజల ముందుకు స్వయంగా వెళ్ళి ఇస్లాం గురించి వారికి వివరించేవారు.

22: ఎన్ని సంవత్సరాల పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కా నగరంలో ఇస్లాం ధర్మప్రచారం చేసారు?

జవాబు: పదమూడు సంవత్సరాల పాటు.

23: ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి హిజ్రత్ చేసారు అంటే వలస వెళ్ళారు?

జవాబు: మక్కా నుండి మదీనా కు

24:ఎన్ని సంవత్సరాల పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మదీనా పట్టణంలో ఇస్లాం ధర్మప్రచారం చేసారు?

జవాబు: పది సంవత్సరాల పాటు.

25: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, ఏ యే ఇస్లామీయ శాసనాలు నిర్దేశించబడ్డాయి?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, జకాతు (విధి దానం), సియామ్ (రమదాను మాసపు తప్పనిసరి ఉపవాసాలు), హజ్ యాత్ర, జిహాద్ (అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం), అజాన్ (ఐదు పూటలా సలాహ్ కొరకు ఇచ్చే పిలుపు) మొదలైన ధర్మాదేశాలు నిర్దేశించబడ్డాయి.

26: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా పాల్గొన్న ముఖ్యమైన ధర్మయుద్ధాలు (గజ్వాలు) ఏవి?

జవాబు: గజ్వతుల్ బదర్ అల్ కుబ్రా
గజ్వతుల్ ఉహద్
గజ్వతుల్ అహ్'జాబ్
గజ్వతు ఫతహ్ మక్కహ్

27: ఖుర్ఆన్ లో చిట్టచివరగా ఏమి అవతరింప జేయబడింది?

జవాబు: మహోన్నతుడై అల్లాహ్ ప్రకటన: మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతీ వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.281 [సూరతుల్ బఖరహ్: 281వ ఆయతు]

28: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మరణించారు మరియు మరణించేటప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం వయస్సు ఎంత?

జవాబు: హిజ్రీ 11వ సంవత్సరము, రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీన ఆయన మరణించినారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అరవై మూడు సంవత్సరాలు.

29: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర భార్యలు ఎవరు?

జవాబు: 1 - ఖదీజహ్ బిన్తె ఖువైలిద్ రదియల్లాహు అన్హా
2 - సౌదహ్ బిన్తె జ'మఅ రదియల్లాహు అన్హా
3 - ఆయిషహ్ బిన్తె అబూబకర్ అస్సిద్దీఖ్ రదియల్లాహు అన్హా
4 - హఫ్సహ్ బిన్తె ఉమర్ రదియల్లాహు అన్హా
5 - జైనబ్ బిన్తె ఖుజైమహ్ రదియల్లాహు అన్హా.
6 - ఉమ్మె సలమహ్ హింద్ బిన్తె అబీ ఉమయ్యహ్ రదియల్లాహు అన్హా
7 - ఉమ్మే హబీబా బిన్తె అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హా.
8 - జువైరియా బిన్తె అల్ హారిస్ రదియల్లాహు అన్హా.
9 - మైమూనా బిన్తె అల్ హారిస్ రదియల్లాహు అన్హా.
10 - సఫియ్య బిన్తె హుయై రదియల్లాహు అన్హా.
11 - జైనబ్ బిన్తె జహష్ రదియల్లాహు అన్హా.

30: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సంతానం ఎవరు?

జవాబు: ముగ్గురు మగపిల్లలు
అల్ ఖాసిమ్, ఇతని వలననే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అబుల్ ఖాసిమ్ అనే మారుపేరుతో పిలిచేవారు.
అబ్దుల్లాహ్
ఇబ్రాహీమ్
ఆడపిల్లలు:

ఫాతిమహ్
రుఖయహ్
ఉమ్ కుల్'సూమ్
జైనబ్
ఇబ్రాహీమ్ తప్ప పిల్లలందరూ ఖదీజహ్ రజియల్లాహు అన్హా ద్వారానే జన్మించారు మరియు ఫాతిమహ్ రజియల్లాహు అన్హా తప్ప పిల్లలందరూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలోనే మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన ఆరు నెలల తరువాత ఫాతిమహ్ రజియల్లాహు అన్హా మరణించారు.

31: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భౌతిక లక్షణాలలో కొన్నింటిని వివరించండి?

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తు సగటు ఎత్తు, చాలా పొట్టీ కాదు - చాలా పొడుగూ కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెల్లటి రంగు కలిగి ఉండేవారు, అది కొద్దిగా ఎర్రగా ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మందపాటి గడ్డం, పెద్ద కళ్ళు మరియు విశాలమైన నోరు కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుట్టు చాలా నల్లగా ఉండేది, ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం భుజాలు విశాలంగా ఉండేవి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాసన ఇతర సుందరమైన లక్షణాలతో పాటు చాలా ఆహ్లాదకరంగా ఉండేది.

31:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజాన్ని దేనిపై విడిచిపెట్టి వెళ్లారు?

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను (సమాజాన్ని) స్పష్టమైన మార్గంలో విడిచిపెట్టి వెళ్ళారు, దేని రాత్రి అయితే దాని పగలంత స్పష్టంగా ఉంటుందో. నాశనానికి గురైన వ్యక్తి తప్ప ఎవరూ దాని నుండి దారితప్పరు. ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం తన ఉమ్మతును సన్మార్గాలన్నింటి వైపు నిర్దేశించారు మరియు చెడులన్నింటి నుండి వారిని హెచ్చరించారు.

తఫ్సీర్ (ఖుర్ఆన్ వ్యాఖ్యాన) విభాగము17

1:సూరతుల్ ఫాతిహా పఠించండి మరియు దానిని వివరించండి?

జవాబు: సూరతుల్ ఫాతిహా మరియు దాని తఫ్సీరు (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, (1) సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. (2) అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. (3) తీర్పుదినానికి యజమాని.(4) మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము.(5) మాకు ఋజుమార్గము చూపించు.(6) నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రమే (చూపించు); నీ ఆగ్రహానికి గురి అయిన వారి మరియు మార్గభ్రష్టులైన వారి (మార్గం) కాదు.(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ఇది పవిత్ర ఖుర్ఆన్ ప్రారంభ సూరహ్ కాబట్టి దీనికి సూరతుల్ ఫాతిహా (తొలి అధ్యాయం) అనే ఈ పేరు పెట్టారు.
🎧 బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ 1 - అల్లాహ్ పేరిట నేను ఖుర్ఆన్ పఠించడం ప్రారంభిస్తున్నాను. ఆయన సహాయం కోరుతూ, ఆయన నామమును ప్రస్తావించడం ద్వారా ఆయన దీవెనలు కోరుతున్నాను.
అల్లాహ్ - నిజంగా సకల ఆరాధనలకు ఏకైక అర్హుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు తప్ప మరెవ్వరికీ ఆ నామము ఇవ్వబడలేదు.
అర్రహ్మాను - కరుణాప్రధాత: సమస్తాన్ని ఆవరించి ఉన్న మహోన్నతమైన మరియు సువిశాలమైన అపార కారుణ్యం కలిగి ఉన్నవాడు.
అర్రహీమ్:
విశ్వాసులపై ప్రత్యేక కృపాకటాక్షాలు కురిపించేవాడు.
🎧 2 - అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్: అన్ని రకాల ప్రశంసలు మరియు పరిపూర్ణత అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.
🎧 3 - అర్రహ్మా నిర్రహీమ్: సృష్టిలోని ప్రతిదానిని ఆవరించేటంతటి విస్తృతమైన దయాదాక్షిణ్యాలు గలవాడు మరియు విశ్వాసులపై ప్రత్యేక దయను ప్రసాదించేవాడు.
🎧 4 - మాలికి యౌమిద్దీన్: ఇది తీర్పు దినాన్ని సూచిస్తుంది.
🎧 5 - ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్: మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు సహాయం కొరకు కేవలం నిన్ను మాత్రమే అర్థిస్తాము.
🎧 6 - ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్: ఇది ఇస్లాం మరియు సున్నతుల వైపునకు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది
🎧 7 - శిరాతల్లదీన అన్అమ్'త అలైహిమ్ గైరిల్ మగ్'దూబి అలైహిమ్ వలద్'దాల్లీన్: అల్లాహ్ యొక్క శాపానికి గురైన క్రైస్తవులు మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన యూదుల మార్గానికి భిన్నమైన మార్గము, ప్రవక్తలు, వారి అనుచరులు, అల్లాహ్ యొక్క నీతిమంతులైన దాసులు నడిచిన మార్గం.
సూరతుల్ ఫాతిహా చదివిన తర్వాత "ఆమీన్" (మా ప్రార్థన స్వీకరించు!) అని పలకడం సున్నతు.

2:సూరతుల్ జల్'జలహ్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?

జవాబు: సూరతుల్ జల్'జలహ్ మరియు దాని వ్యాఖ్యానము
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు, 1 మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2 మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3 ఆ రోజు అది తనలోని సమాచారాన్నంతా బహిరంగ పరిచినప్పుడు, 4 ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5 ఆ రోజు తమ తమ కర్మలు చూపించబడటానికి ప్రజలను వేర్వేరు గుంపులలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 6 మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8 [సూరతుల్ జల్'జలహ్: 1-8వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - ఇజా జుల్'జిలతిల్ అర్దు జిల్'జాలహా: (భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు!)
🎧 2 - వ అఖ్రజతిల్ అర్'జు అస్'ఖాలహా: (మరియు భూమి తన లోపల ఉన్న చనిపోయిన వారి అవశేషాలను మరియు ఇతర వస్తువులను బయటకు తీసుకు వచ్చినప్పుడు!)
🎧 3 - వ ఖాలల్ ఇన్'సాను మా లహా: (మరియు మనిషి గందరగోళంగా ఇలా అంటాడు: "ఎందుకు భూమి అలా కదులుతోంది మరియు కంపిస్తుంది?!")
🎧 4 - యౌమఇజిన్ తుహద్దిసు అఖ్'బారహా: (ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.)
🎧 5 - బి అన్న రబ్బక ఔహా లహా: (ఎందుకంటే అల్లాహ్ దానిని అలా చేయమని ఆదేశించాడు.)
🎧 6 - యౌమఇజియ్ యశ్'దురున్నాసు అష్'తాతల్'లియురౌ అ'మాలహుమ్: (ఆ మహత్తర దినాన, భూమి కంపించినప్పుడు, లెక్కల కోసం ప్రజలు గుంపులుగా వస్తారు మరియు వారికి వారి ప్రాపంచిక పనులు చూపబడతాయి.)
🎧 7 - ఫమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ ఖైరైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత మేలు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.
🎧 8 - వమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ షర్రైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత కీడు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.)

3: సూరతుల్ ఆదియాత్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?

జవాబు: సూరతుల్ ఆదియాత్ పఠనం మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానము):
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
- వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా 1 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2 తెల్లవారుజామున దాడిచేసే వాటి; 3 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;4 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.5 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.6 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.7 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.8 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;9 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;10 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! 11 [సూరతుల్ ఆదియాత్ : 1-11 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - : వల్'ఆదియాతి జబ్'హా 1 (అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.)
🎧 2 - : ఫల్ మూరియాతి ఖద్'హా 2 (నేలపై రాళ్లను బలంగా తాకినప్పుడు తమ గిట్టలతో అగ్ని మెరుపులను మెరిపించే గుర్రాలపై కూడా ప్రమాణం చేస్తున్నాడు.)
🎧 3 - : ఫల్ ముగీరాతి శుబ్'హా 3 (ఉదయాన్నే శత్రువులపై దాడి చేసే గుర్రాలపై ప్రమాణం చేస్తున్నాడు.)
🎧 4 - : ఫఅసర్'న బిహీ నఖ్'ఆ 4 (కాబట్టి, అవి తమ పరుగు ద్వారా దుమ్మును లేపుతాయి.)
🎧 5 - : ఫ వసత్'న బిహీ జమ్'ఆ 5 (శత్రువుల గుంపు మధ్యలోకి తమ రౌతులతో దూకుతాయి.)
🎧 6 - : ఇన్నల్ ఇన్'సాన లిరబ్బిహి లకనూద్ 6 (నిజానికి, మనిషి తన ప్రభువు (ఇతరులకు) ఇవ్వమని తనకు ఆజ్ఞాపించిన మంచితనాన్ని (ఇవ్వకుండా తన వద్దే) ఆపు కుంటున్నాడు.)
🎧 7 - : వ ఇన్నహు అలా జాలిక లషహీద్ 7 (మంచితనాన్ని తన వద్దనే ఆపి వేసిన దానికి స్వయంగా అతనే సాక్షి మరియు అది స్పష్టంగా ఉన్నందున అతను దానిని తిరస్కరించలేడు.)
🎧 8 - : వ ఇన్నహు లి హుబ్బిల్ ఖైరి లషదీద్ 8 (సంపదపై అతనికి ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా, అతను అత్యాశతో దానిని ఆపివేస్తాడు.)
🎧 9 - : అఫలా యఅ'లము ఇజా బుఅ'సిర మా ఫిల్'ఖుబూర్ 9 ( ఏమీ, ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాధులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్న విషయం కాదని తెలియదా ?!)
🎧 10 - : వ హుస్సిల మా ఫిస్సుదూర్ 10 (ఉద్దేశాలు, విశ్వాసాలు మరియు ఇతరుల హృదయాలలో దాగి ఉన్నవన్నీ చూపబడతాయి మరియు వెలుగులోకి వస్తాయి.)
🎧 11 - ఇన్న రబ్బహుమ్ బిహిమ్ యౌమఇజిన్ ల ఖబీర్ (నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసి ఉంటాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన వద్ద గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని ప్రకారం ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.11:)

4:సూరతుల్ ఖారిఅహ్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానాన్ని వివరించండి?

జవాబు: సూరతుల్ ఖారిఅహ్ మరియు దాని వ్యాఖ్యానం
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1 ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? 2 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 3 ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.4 మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.5 అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!6 అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.7 మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!8 అతని నివాసం అధఃపాతాళమే. 9 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? (10) అదొక భగభగ మండే అగ్ని (గుండం).11 [సూరతుల్ ఖారిఅహ్ :1-11 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (అల్ ఖారిఅహ్) 1 : ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం!.
🎧 2 - (మల్ ఖారిఅహ్)2: ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!
🎧 3 - (వమా అద్'రాక మల్ ఖారిఅహ్) 3: (ఓ ప్రవక్తా) మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటో? అది ప్రళయదినం!:
🎧 4 - (యౌమ యకూనున్నాసు కల్ ఫరాషిల్ మబ్'సూస్) 4: ఇది ప్రజల హృదయాలను తాకే రోజు. వారు అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్న చిమ్మటలా ఉంటారు.
🎧 5 - (వ తకూనుల్ జిబాలు కల్ ఇహ్'నిల్ మంఫూష్) 5: పర్వతాలు మెత్తటి ఊలులాగా (గాలిలో ఎగురుతూ) ఉంటాయి.
🎧 6 - (ఫ అమ్మా మన్ సఖులత్ మవాజీనుహు) 6: అపుడు, ఎవరి వద్దనైతే చెడు పనుల కంటే మంచి పనులు ఎక్కువగా ఉంటాయో,
🎧 7 - (ఫహువ ఫీ ఈషతిర్రాజియహ్) 7: అతను స్వర్గంలో ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు.
🎧 8 - (వ అమ్మా మన్ ఖఫ్ఫత్ మవాజీనుహు) 8: మరియు ఎవరి మంచి పనుల కంటే చెడు పనులు ఎక్కువగా ఉంటాయో,
🎧 9 - (ఫ ఉమ్ముహు హావియహ్) 9: అతని నివాసం నరకాగ్ని అవుతుంది.
🎧 10 - (వమా అద్'రాక మా హియ)10: (ఓ ప్రవక్తా) అదేమిటో మీకేమి తెలుసు ?
🎧 11 - (నారున్ హామియహ్) 11: అది ఒక భగభగ మండుతున్న అగ్ని

5:సూరతు త్తకాసుర్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానం వివరించండి?

జవాబు: సూరతు తకాసుర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది 1 మీరు గోరీలలోకి చేరే వరకు.2 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.3 మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.4 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).5 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! 6 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!7 అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 8 [సూరతుత్తకాసుర్: 1-8వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (అల్ హాకుముత్తకాసుర్) 1 : ఓ ప్రజలారా! సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.
🎧 2 - (హత్తా జుర్'తుముల్ మఖాబిర్) 2 : మీరు చనిపోయి మీ సమాధులలోకి ప్రవేశించే వరకు.
🎧 3 - (కల్లా సౌఫ తఅలమూన్) 3 : వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.
🎧 4 - (సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్) 4 : అప్పుడు మీరు దాని పర్యవసానాన్ని తెలుసుకుంటారు.
🎧 5 - (కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యఖీన్) 5 : వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.
🎧 6 - (లతరవున్నల్ జహీమ్) 6: అల్లాహ్ ప్రమాణంగా తీర్పు రోజున మీరు ఖచ్చితంగా నరకాగ్నిని చూస్తారు.
🎧 7 - (సుమ్మ లతరవున్నహా ఐనల్ యఖీన్) 7 : మళ్ళీ (చెబుతున్నాను), మీరు దానిని సంపూర్ణ నిశ్చయతతో చూస్తారు.
🎧 8 - (సుమ్మ లతుస్'అలున్న యౌమఇజిన్ అని న్నయీమ్) 8 : ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.

6:సూరతుల్ అస్ర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ అస్ర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
కాలం సాక్షిగా (1) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3) [1] [సూరతుల్ అస్ర్ : 1-3 వ ఆయతులు)
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (వల్ అస్ర్) 1 : సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కాలంపై ప్రమాణం చేస్తున్నాడు.
🎧 2 (ఇన్నల్ ఇన్'సాన లఫీ ఖుస్ర్) - 2 : మానవాళి అంతా పూర్తిగా నష్టాల్లో ఉన్నది.
🎧 3 - (ఇల్లల్లజీన ఆమనూ, వ అమిలుస్సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్ఖి వతవాసౌ బిస్సబ్ర్) 3 : విశ్వసించి, సత్కార్యాలను ఆచరిస్తూ, అదే సమయంలో సత్యం వైపు పిలుస్తూ, సహనంతో ఉండే వారు మాత్రమే ఆ నష్టం నుండి బయటపడతారు.

7: సూరతుల్ హుమజహ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూతరుల్ హుమజహ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం).
అనంత కరుణాప్రదాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.1 ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!2 తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!3 ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.4 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 5 అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;6 అది గుండెల దాకా చేరుకుంటుంది.7 నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.8 పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!9 [సూరతుల్ హుమజహ్ : 1-9వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్) 1 : ప్రజలను తరచుగా వెన్నుపోటు పొడిచే మరియు దూషించే ప్రతి ఒక్కరికీ బాధాకరమైన మరియు తీవ్రమైన శిక్ష ఉంది.
🎧 2 - (అల్లదీ జమఅ మాలౌ వఅద్దదహ్) 2 : ఎవడైతే డబ్బు కూడబెట్టడం, లెక్కించడం తప్ప మరి దేనిపైనా ఆసక్తి లేకుండా ఉంటాడో.
🎧 3 - (యహ్'సబు అన్న మాలహు అఖ్'లదహ్) 3 : అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.
🎧 4 - (కల్లా లయుంబజన్న ఫిల్ హుతమహ్) 4 : ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.
🎧 5 - (వమా అద్'రాక మల్ హుతమహ్) 5 : (ఓ ప్రవక్తా!) తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?
🎧 6 - (నారుల్లాహిల్ ము'ఖదహ్) 6: ఇది అల్లాహ్ యొక్క మండుతున్న అగ్ని.
🎧 7 - (అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్'ఇదహ్) 7 : అది ప్రజల శరీరాల్లోకి చొచ్చుకుపోయి వారి హృదయాలను చేరుకుంటుంది.
🎧 8 - (ఇన్నహా అలైహిమ్ ము'సదహ్) 8 : అందులో హింసించబడుతున్న వారిపై అది మూసివేయబడుతుంది.
🎧 9 - (ఫీ అమదిమ్ ముమద్దదహ్) 9 : ఇది పొడవాటి మరియు పొడిగించిన నిలువు వరుసలతో మూయబడింది, తద్వారా వారిని బయటకు రానివ్వకుండా చేస్తాయి.

8: సూరతుల్ ఫీల్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ ఫీల్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 1 ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 2 మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; 3 అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి. 4 ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. 5 [సూరతుల్ ఫీల్ : 1-5వ ఆయతులు ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (అలమ్ తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్'హాబిల్ ఫీల్) 1: (ఓ ప్రవక్తా!) - అబ్రహాహ్ మరియు అతని సహచరులు, ఏనుగులతో వచ్చి, కాబాగృహాన్ని కూల్చివేయాలనుకున్నప్పుడు వారిని నీ ప్రభువు ఏమి చేసాడో నీ ప్రభువుకు తెలియదా?
🎧 2 - (అలమ్ యజ్అల్ కైదహుమ్ ఫీ తజ్'లీల్) 2 : నిశ్చయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.
🎧 3 - (వ అర్'సల అలైహిమ్ తైరన్ అబాబీల్) 3 : ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు.
🎧 4 - (తర్'మీహిమ్ బిహిజారతిమ్ మిన్ సిజ్జీల్) 4 : అవి కాల్చిన మట్టిరాళ్లను వారిపై విసిరి కొట్టాయి.
🎧 5 - (ఫజఅలహుమ్ కఅస్'ఫిమ్ మ'కూల్) 5 : అల్లాహ్ వారిని జంతువులు తిని ఉమ్మేసిన పొట్టులా చేసేసాడు.

9: సూరతు ఖురైష్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి ?

జవాబు: సురతు ఖురైష్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు. (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. 2 కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! 3 వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 4 [సూరతు ఖురైష్ : 1-4వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (లి ఈలాఫి ఖురైష్) 1 : ఇది మక్కా ప్రజలకు సుపరిచితమైన శీతాకాలం మరియు వేసవికాలం వ్యాపార ప్రయాణాలను సూచిస్తుంది.
🎧 2 - (ఈలాఫిహిమ్ రిహ్'లత ష్షితాయి వస్"సైఫ్) 2 : శీతాకాలపు ప్రయాణంలో యెమన్ మరియు వేసవి ప్రయాణంలో వారు మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న సిరియా వంటి ప్రదేశాలకు (వ్యాపారబృందాలతో) సురక్షితంగా వెళ్ళేవారు.
🎧 3 - (ఫల్ యఅబుదూ రబ్బ హాదల్ బైత్) 3 : కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.
🎧 4 - (అల్లజీ అత్'అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్) 4 : అరబ్బులు అల్-హరామ్ (పవిత్ర ప్రాంగణాన్ని) మరియు దాని ప్రజలను గౌరవించేలా చేయడం ద్వారా ఈ వ్యాపార ప్రయాణాల ఏర్పాటు ఆకలిదప్పులకు గురికాకుండా మక్కా ప్రజలకు సమృద్ధిగా సంపదను అందించింది మరియు భయం నుండి వారిని రక్షించింది.

10: సూరతుల్ మాఊన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ మాఊన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1 అతడే అనాధులను కసరి కొట్టేవాడు; 2 మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. 3 అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7) [సూరతుల్ మాఊన్ : 1-7వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (అరఐతల్లజీ యుకజ్జిబు బిద్దీన్) 1 : తీర్పుదినాన ప్రతిఫలాన్ని నిరాకరించే వ్యక్తి ఎవరో తెలుసా?
🎧 2 - (ఫజాలికల్లజీ యదువ్వుల్ యతీమ్) 2 : అతడు అనాధను నిర్దయగా తిప్పికొట్టేవాడు.
🎧 3 - (వలా యహుజ్జు అలా తఆమిల్ మిస్'కీన్) 3 : అతడు పేదలకు ఆహారం పెట్టమని స్వయంగా ముందుకు అడుగు వేయడు లేదా ఇతరులను ప్రేరేపించడు.
🎧 4 - (ఫవైలుల్ లిల్ ముసల్లీన్) 4 : అలాంటి నమాజీలు నాశనమవు గాక.
🎧 5 - (అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్) 5 : ఎవరైతే సలాహ్ పట్ల నిర్లక్ష్యం వహిస్తారో.
🎧 6 - (అల్లజీన హుమ్ యురావూన్) 6 : ఎవరైతే ఇతరులకు చూపడానికే నమాజులు మరియు మంచిపనులు చేస్తారో మరియు వాటిని అల్లాహ్ కు చిత్తశుద్ధితో అంకితం చేయరో.
🎧 7 - (వ యమ్'నఊనల్ మావూన్) 7 : మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.

11: సూరతుల్ కౌసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ కౌసర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. 1 {కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!}[2] నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3 [సూరతుల్ కౌసర్ : 1-3వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఇన్నా అ'ఆతైనాకల్ కౌసర్) 1: (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.
🎧 2 - (ఫసల్లి లిరబ్బిక వన్'హర్) 2: కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా.
🎧 3 - (ఇన్న షానిఅక హువల్ అబ్'తర్) 3 : నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోతాడు, నామరూపాలు లేకుండా మరపింప చేయబడతాడు, ఒకవేళ అతడి ప్రస్తావన జరిగినా చెడ్డగా ప్రస్తావించ బడతాడు.

12: సూరతుల్ కాఫిరూన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ కాఫిరూన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఇలా అను:
"ఓ సత్యతిరస్కారులారా!1 మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;2 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.3 మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.4 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.5 మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"6 [సూరతుల్ కాఫిరూన్ : 1-6వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) 1 : (ఓ ప్రవక్తా! వారితో ఇలా అను) - : అవిశ్వాసులారా!
🎧 2 - (లా అఆబుదు మా తఅబుదూన్) 2 : మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఆరాధించను.
🎧 3 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 3 : అలాగే, నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఆరాధించరు.
🎧 4 - (వలా అన ఆబిదుమ్ మా ఆబద్'తుమ్) 4 : మరియు మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఎన్నటికీ ఆరాధించను.
🎧 5 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 5 : అలాగే నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఎప్పుడూ ఆరాధించరు.
🎧 6 - (లకుమ్ దీనుకుమ్ వలియదీన్) 6 : మీరు కనిపెట్టిన మతం మీ కొరకే మరియు అల్లాహ్ నాకు వెల్లడించిన నా ధర్మం నా కొరకు ఉండనే ఉంది.

13 సూరతున్నసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతున్నసర్ మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1 మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2 అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3 [సూరతున్నసర్: 1-3వ ఆయతులు ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్'హ్) 1: ఓ ప్రవక్తా! అల్లాహ్ మీ ధర్మానికి విజయాన్ని మరియు బలాన్ని ప్రసాదించినప్పుడు మరియు మక్కాను జయించినప్పుడు.
🎧 2 - (వరఐతన్నాస యద్'ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్'వాజా) 2: ప్రజలు తండోప తండాలుగా ఇస్లాం స్వీకరించడాన్ని నీవు చూస్తావు.
🎧 3 - (ఫసబ్బిహ్ బిహమ్'ది రబ్బిక వస్'తగ్'ఫిర్హు ఇన్నహు కాన తవ్వాబా) 3 : కాబట్టి మీరు అది మీరు ఏ కార్యంతో పంపించబడ్డారో దాని ముగింపు దగ్గర పడినది అనటానికి సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్తుతులతో ఆయన పరిశుద్ధతను కొనియాడండి. సహాయం, విజయాల యొక్క అనుగ్రహాలకు బదులుగా ఆయనకు కృతజ్ఞత చూపుతూ, ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.

14: సూరతుల్ మసద్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ మసద్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1 అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2 అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3 మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4 ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5 [సూరతుల్ మసద్ : 1-5వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్బ్) 1 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దుర్భాషలాడడం వల్ల ప్రవక్త యొక్క పినతండ్రి అబూ లహబ్ ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్ అతని పనులు నశించినట్లే, అతని చేతులు నశించును.
🎧 2 - (మా అగ్'నా అన్'హు మాలహు వమా కసబ్) 2 : అతని సంపద మరియు సంతానం అతనికి ఏమైనా ఉపయోగపడ్డాయా? వారు అతనిని హింస నుండి రక్షించలేరు లేదా అతనిని కరుణింపబడేలా చేయలేరు.
🎧 3 - (సయస్'లా నారన్ జాత లహబ్) 3 : తీర్పుదినాన, అతను నరకాగ్నిలోకి ప్రవేశించబడతాడు, అక్కడ అతను దాని వేడిని అనుభవిస్తాడు.
🎧 4 - (వమ్'రఅతుహు హమ్మాలతల్ హతబ్) 4 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దారిలో ముళ్ళు విసిరి గాయపరిచే అతని భార్య ఉమ్మే జమీల్ కూడా నరకాగ్నిలో చేర్చబడుతుంది.
🎧 5 - (ఫీ జీదిహా హబ్'లుమ్ మిమ్ మసద్) 5 : ఆమె మెడకు బిగుతైన తాడు బిగించబడి, నరకాగ్నిలోకి విసిరి వేయబడుతుంది.

15: సూరతుల్ ఇఖ్లాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ ఇఖ్లాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
{ఇలా అను:
"ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [సూరతుల్ ఇఖ్లాస్: 1-4వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఖుల్ హువల్లాహు అహద్) 1 : (ఓ ప్రవక్తా! ప్రకటించు): ఆయనే అల్లాహ్, ఏకైకుడు; ఆయన తప్ప ఆరాధనలకు అర్హుడైన ఆరాధ్యుడు లేడు.
🎧 2 - (అల్లాహుస్ సమద్) 2 : సృష్టి యొక్క అన్ని అవసరాలు ఆయన మాత్రమే తీర్చగలడు.
🎧 3 - (లమ్ యలిద్ వలమ్ యూలద్) 3 : ఆయన ఎవరినీ కనలేదు మరియు ఆయనను ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
🎧 4 - (వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్) 4 : సృష్టిలో ఏదీ ఆయనలా లేదు.

16:సూరతుల్ ఫలఖ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ ఫలఖ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఇలా అను:
"నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 : [సూరతుల్ ఫలఖ్ : 1-5వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఖుల్ అవూదు బిరబ్బిల్ ఫలఖ్) 1 : ఓ ప్రవక్తా! ప్రకటించు: నేను ఉదయం యొక్క యజమానిని ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాను.
🎧 2 - (మిన్'షర్రిల్ మా ఖలఖ్) 2 : హానికరమైన జీవుల చెడు నుండి
🎧 3 - (వ మిన్'షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్) 3 : మరియు విషజంతువులు మరియు దొంగలు వంటి రాత్రిపూట కనిపించని చెడుల నుండి నేను అల్లాహ్ను శరణు కోరుతున్నాను.
🎧 4 - (వ మిన్'షర్రిన్ నఫ్ఫా సాతి ఫిల్ ఉఖద్) 4 : మరియు ముడుల మీద ఊదుతున్న మాంత్రికుల చెడు నుండి నేను అల్లాహ్ వద్ద శరణు కోరుతున్నాను.
🎧 5 - (వ మిన్'షర్రి హాసిదిన్ ఇజా హసద్) 5 : మరియు అల్లాహ్ వారికి ప్రసాదించిన దీవెనలను చూసి ఓర్పుకోలేక, ప్రజలను ద్వేషించే మరియు అసూయపడే వ్యక్తి యొక్క చెడు నుండి. ఆ ప్రజలు ఇకపై అలాంటి ఆశీర్వాదాలను పొందకూడదని మరియు వారికి హాని కలిగించాలని ఆ దుష్టులు కోరుకుంటారు.

17: సూరతున్నాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతున్నాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఇలా అను:
"నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6 [సూరతున్నాస్: 1-6వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
🎧 1 - (ఖుల్ అవూదు బిరబ్బిన్నాస్) 1 : ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించు: నేను మానవాళి ప్రభువు వద్ద రక్షణ మరియు ఆశ్రయం పొందుతున్నాను.
🎧 2 - (మలికిన్నాస్) 2 : ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.
🎧 3 - (ఇలాహిన్నాస్) 3 : వారి నిజమైన ఆరాధ్యుడు, మరియు వారి ఆరాధనల కొరకు ఆయనను మించిన వేరే ఆరాధ్యుడు మరొకడు లేడు.
🎧 4 - (మిన్'షర్రిల్ వస్'వాసిల్ ఖన్నాస్) 4 : ప్రజల వద్ద గుసగుసలాడే షైతానుల యొక్క చెడు నుండి.
🎧 5 - (అల్లజీ యువస్'విసు ఫీ సుదూరిన్నాస్) 5 : ఎవరైతే మానవాళి హృదయాలలో గుసగుసలాడుతూ ఉంటారో.
🎧 6 - (మినల్ జిన్నతి వన్నాస్) 6 : అలా గుసగుసలాడేది జిన్ నుండి కావచ్చు లేదా మానవజాతి నుండి కావచ్చు అని దీని అర్థం.

హదీసు విభాగము14

1: ఈ హదీసు పూర్తి చేయండి: "«... إنما الأعمال بالنيات ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అమీరుల్ మోమినీన్ అబీ హఫ్స ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నానని ఆయన రజియల్లాహు అన్హు తెలిపారు: ‘నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి నియ్యతులపై (సంకల్పాలపై) ఆధారపడి ఉంటాయి ‘ప్రతి వ్యక్తికీ అతని సంకల్పాన్ని బట్టి ప్రతిఫలము లభిస్తుంది. ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు హిజ్రత్ చేస్తే (వలస వెళితే), అతని హిజ్రత్ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు (హిజ్రత్ చేసినట్లుగా) నమోదు చేయబడుతుంది. మరెవరైతే ప్రాపంచిక లాభాల కోసం హిజ్రత్ చేస్తాడో అతనికి అది లభిస్తుంది, అలాగే ఒక స్త్రీని వివాహమాడుటకు వలస పోతే, అతను సంకల్పించిన దాని ప్రకారంగానే ఆ హిజ్రత్ నమోదు చేయబడుతుంది. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ప్రతి కార్యానికీ అంటే ఉదాహరణకు సలాహ్ (నమాజు), ఉపవాసం, హజ్ యాత్ర మొదలైన వాటన్నింటికీ సంకల్పాన్ని బట్టే ప్రతిఫలం ప్రసాదించబడుతుంది.
2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే, మరియు పూర్తి చిత్తశుద్ధితో మాత్రమే ఏ ఆచరణ అయినా చేయాలి.
రెండవ హదీసు:

2: ఈ హదీసు పూర్తి చేయండి, «من أحدث في أمرنا هذا ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: ఉమ్ముల్ మోమినీన్ ఉమ్మే అబ్దుల్లాహ్ ఆయిషహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ధర్మంలో కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను ప్రవేశపెట్టడం నిషేధించబడింది
2 - మతపరమైన ఆవిష్కరణల, నూతన కల్పిత పోకడలపై ఆధారపడిన ఆరాధనలు, చర్యలు తిరస్కరించబడతాయి
*మూడవ హదీసు:

3:ఈ హదీసు పూర్తి చేయండి, (بينما نحن جلوس عند رسول الله ﷺ ...), ? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘మేము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాము, అపుడు అక్కడికి తెల్లటి దుస్తులు ధరించి, నల్లటి వెంట్రుకలు కలిగి, ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను నేరుగా వెళ్ళి మహనీయ ప్రవక్తకి దగ్గరగా ఆయన మోకాళ్ళకు మోకాళ్ళు ఆన్చి పెట్టి, తన చేతులు తొడలపై పెట్టుకుని కూర్చున్నాడు, పిదప "ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇస్లాం అంటే ఏమిటో నాకు బోధించండి?" అంటూ అడిగాడు. దానికి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బదులిస్తూ ‘ఇస్లాం అంటే ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు సందేశ హరుడని నీవు సాక్ష్యమివ్వటం, నమాజులు ఆచరించడం,(స్తోమత ఉంటే )జకాతు చెల్లించడం, రమదాన్’మాసపు ఉపవాసాలు పాటించడం, ఒకవేళ నీకు వెళ్లగలిగే శక్తి, స్తోమత ఉంటే హజ్జ్ యాత్ర చేయడం అని చెప్పారు. దానికి ఆ వ్యక్తి ‘ యదార్థం చెప్పారు’ అన్నాడు, మాకు ఆవిషయం ఆశ్చర్యం కలిగించింది అతను ప్రశ్నిస్తున్నాడు తరువాత జవాబును కూడా దృవీకరిస్తున్నాడే! మళ్ళీ ప్రశ్నిస్తూ ‘నాకు ఈమాన్ అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘అల్లాహ్ ను, దైవదూతలను, ఆకాశ గ్రంధాలను, ప్రవక్తలను, మరియు పరలోకదినాన్ని నీవు విశ్వసించాలి, దాంతో పాటు విధివ్రాత మంచి ఐనా మరియు చెడుఐనా ను విశ్వసించాలి, అని చెప్పారు. అతను ‘యదార్ధం చెప్పారు మీరు అన్నాడు. ఆ పై ‘ఇహ్సాన్ ‘ అంటే ఏమిటి ఓ ప్రవక్తా? అని ప్రశ్నించాడు. నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అలా చేయలేక పోతే అల్లాహ్ యే నిన్ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అని తెలిపారు దానికి అతను ‘ప్రళయం గురించి బోధించండి’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ‘ఎవరినైతే ఇది అడుగుతున్నావో అతనికి ప్రశ్నిస్తున్న వాడి కంటే ఈ విషయం లో ఎక్కువ జ్ఞానం లేదు‘ అన్నారు. దానికి అతను అయితే ప్రళయ సూచనలు నాకు చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘ఒకటి ‘బానిసరాలు తన యజమానిని జన్మనిస్తుంది, రెండవ సూచన ‘నువ్వు చూస్తావు దుస్తులు లేని, కాళ్ళకు చెప్పులు లేని నగ్నులను, దరిద్రులు పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తారు. పిదప ఆ వ్యక్తి వెళ్లి పోయాడు, చాలా సేపు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ప్రవక్త ‘ ఓ ఉమర్ ! నీకు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా? అని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును‘ అన్నాను. అపుడు ఆయన ‘నిశ్చయంగా అతను జీబ్రయీల్ అలైహిస్సలామ్ మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చారు' అని తెలియజేశారు. ముస్లిం హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలు (మూల నియమాలు) ఐదు అని గుర్తుంచుకోండి; అవి:
షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ - (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం).
వ ఇఖాము స్సలాహ్ - సలాహ్ (నమాజు) ను స్థాపించడం.
వ ఈతాఇ జ్'జకాహ్ - జకాతు (విధిదానం) చెల్లించడం
వ సౌము రమజాన్ - రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం
వ హజ్జ బైతుల్లాహిల్ హరామ్ - హజ్ యాత్ర చేయడం
2 - అర్కానుల్ ఈమాన్ (విశ్వాస మూల నియమాలు) లను గుర్తుంచుకోండి. అవి ఆరు:
అల్లాహ్ పై విశ్వాసం
దైవదూతలపై విశ్వాసం
దైవగ్రంధాలపై విశ్వాసం
దైవప్రవక్తలపై విశ్వాసం
ప్రళయదినముపై విశ్వాసం
ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.
3 - రుకునుల్ ఇహ్'సాన్ (ఇహ్'సాన్ మూలనియమం). ఇహ్'సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించ లేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం.
4 - ప్రళయదినం సంభవించే సమయం , మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాని గురించి తెలియదు.
నాలుగవ హదీసు:

4: ఈ హదీసు పూర్తి చేయండి, «أكمل المؤمنين إيماناً ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు. అత్తిర్మిజీ హదీసు గ్రంధం, ఈ హదీసు హసన్ (ఉత్తమ) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికినారు:
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - మంచి నైతికతను ప్రోత్సహించడం
2 - నైతికత యొక్క పరిపూర్ణత, విశ్వాసం యొక్క పరిపూర్ణతలోని భాగముగా పరిగణించబడుతుంది.
3 - ఈమాన్ (విశ్వాసం) పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది.
ఐదవ హదీసు:

5: ఈ హదీసు పూర్తి చేయండి, «من حلف بغير الله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేస్తాడో, అతను కుఫ్ర్ (అవిశ్వాసము) లేక షిర్కు (బహుదైవారాధన) కు ఒడిగట్టినట్లే, పాల్బడినట్లే. తిర్మిజీ హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం సరికాదు.
- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం అనేది షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) గా పరిగణించబడుతుంది.
ఆరవ హదీసు:

6: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى أكون أحب إليه ...» ఈ హదీసు ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి:

జవాబు: అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు". బుఖారీ, ముస్లిం హదీసు గ్రంధాలు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

- మొత్తం మానవజాతి కంటే అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రేమించవలెను.
- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఏడవ హదీసు:

7: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى يحب لأخيه ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఒక విశ్వాసి తనకు మంచి జరగడాన్ని ఎలా ఇష్టపడతాడో, అలాంటి మంచి ఇతర విశ్వాసుల కొరకు కూడా జరగడాన్ని ఇష్టపడాలి.
- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఎనిమిదవ హదీసు:

8: ఈ హదీసు పూర్తి చేయండి, «والذي نفسي بيده! ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు : అబీ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో ఆయన సాక్షిగా, ఇది (సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం) ముూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము. అల్ బుఖారీ హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - సూరతుల్ ఇఖ్లాస్ యొక్క ఘనత, విశిష్ఠత, ఔన్నత్యము.
2 - సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం, మూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.
తొమ్మిదవ హదీసు:

9: ఈ హదీసు పూర్తి చేయండి, «لا حول ولا قوة إلا بالله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అబీ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే గొప్ప పలుకులు స్వర్గం యొక్క ఖజానాలలో ఒక నిధి. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఈ పలుకుల ఘనత ఎంత గొప్పది అంటే అది స్వర్గపు ఖజానాలలో ఒక నిధి.
2 - తన శక్తిసామర్ధ్యాలపై ఆధార పడకుండా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.
పదవ హదీసు:

10: ఈ హదీసు పూర్తి చేయండి, «ألا إن في الجسد مضغة...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అన్నోమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: నిజానికి, శరీరంలో ఒక మాంసం ముక్క ఉన్నది; అది సరైన దారిలో ఉంటే, శరీరం మొత్తం సరైన దారిలోనే ఉంటుంది. ఒకవేళ అది భ్రష్టుపడితే, శరీరం మొత్తం అవినీతిమయం అయిపోతుంది. నిశ్చయంగా, అదే హృదయం. బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలలో ఉల్లేఖించబడింది.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - హృదయం సరైన దారిలో ఉండటం అనేది ఒక వ్యక్తిని బాహ్యంగానూ (మాటలలో, చేతలలో) మరియు ఆంతరంగీకంగానూ (ఆలోచనలో, సంకల్పంలో) సరైన దారిలో ఉండేలా చేస్తుంది.
2 - హృదయాన్ని సరైన దారిలో ఉంచటంపై శ్రద్ధ చూపడం, ఎందుకంటే మనిషి నిజాయితీ దానిపైనే ఆధారపడి ఉంటుంది.
:
పదకొండవ అధ్యాయం

11: ఈ హదీసు పూర్తి చేయండి, «من كان آخر كلامه من الدنيا:لا إله إلا الله» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: మఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే చివరిగా (మరణం ఆసన్నమైనపుడు) "లా ఇలాహ ఇల్లల్లాహు అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు" అని పలుకుతాడో, అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అబూ దావూద్ హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుల ఘనత, ఆ పలుకుల ఔన్నత్యం కారణంగా ఒక దాసుడు స్వర్గంలో ప్రవేశించగలడు.
2 - ఈ ప్రపంచ జీవితంలో ఒకరి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ కావడంలోని శ్రేష్ఠత.
పన్నెండవ హదీసు:

12: ఈ హదీసు పూర్తి చేయండి, «ليس المؤمن بالطعان، ولا اللعان ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి అనేవాడు ‘దెప్పిపొడవడం, శపించడం, సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం మొదలైన దుర్గుణాలకు ఎంతో దూరంలో ఉంటాడు. అత్తిర్మిజీ హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - అన్ని తప్పుడు మరియు అసభ్య పలుకుల నిషేధం.
విశ్వాసి పలుకులు ఎలా ఉండాలో వివరించబడింది.
పదమూడవ హదీసు*:

13: ఈ హదీసు పూర్తి చేయండి, «من حسن إسلام المرء ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

అబు హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: తమకు సంబంధించని విషయాలలో తలదూర్చక పోవడం అనేది (అంటే వాటిని వదిలివేయడం) అనేది ఒక ఉత్తమ ముస్లిం యొక్క లక్షణం. అత్తిర్మిజి మరియు ఇతరు హదీసు గ్రంధాలు:
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఇతరుల ధార్మిక లేదా ప్రాపంచిక విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
2 - ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది ఒకరి పరిపూర్ణ ఇస్లాంలో భాగం
పధ్నాలగవ హదీసు*:

14: ఈ హదీసు పూర్తి చేయండి, «من قرأ حرفاً من كتاب الله...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంధము (ఖుర్ఆన్) నుండి ఒక అక్షరం పారాయణం చేస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక పది పుణ్యాలంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలిఫ్, లామ్, మీమ్ మూడింటినీ కలిపి ఒకే అక్షరమని అనవద్దు గానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ మరొక అక్షరము (గా పరిగణించబడతాయని) అనండి. అత్తిర్మిజీ హదీసు గ్రంధము:
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఖుర్ఆన్ పారాయణం యొక్క ఘనత
2 - ఖుర్ఆన్ లో నుండి చదివే ప్రతి అక్షరానికి బదులుగా మీ కొరకు ఎన్నో పుణ్యాలున్నాయి.

ఇస్లామీయ నైతిక ప్రవర్తనల విభాగం26

1:మహోన్నతుడైన అల్లాహ్ పట్ల మన నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి?

జవాబు: 1 - ఆయనను సృష్టిలోని అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడని మరియు ఆయన కొరతలూ, లోపాలన్నింటికీ అతీతుడని మనస్పూర్తిగా నమ్మడం, గౌరవించడం.
2 - ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా ఉండటం. కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించినాడు.
3 - ఆయనకు విధేయత చూపడం
4 - ఆయనకు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం
5 - ఆయన పట్ల కృతజ్ఞతాభావం చూపుతూ, ఆయన ప్రసాదిస్తున్న లెక్కలేనన్ని సహాయాలు మరియు అనుగ్రహాలకు బదులుగా ఆయనను స్తుతించడం
6 - ఆయన ఆజ్ఞాపించిన వాటిని సహనంతో పూర్తిచేయడం

2: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మన నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి?

జవాబు: 1 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆదర్శంగా తీసుకుని, ఆయన జీవిత విధానాన్ని (సున్నతులను) మనస్పూర్తిగా అనుసరించడం
2 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం
3 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం.
4. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని మనస్పూర్తిగా విశ్వసించడం.
5 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులకు కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను చేర్చకుండా ఉండటం
6 - స్వయం కంటే ఎక్కువగా మరియు మొత్తం మానవాళి కంటే (సృష్టిలోని ప్రతిదాని కంటే) ఎక్కువగా ఆయన ను ప్రేమించడం
7 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను గౌరవించడం మరియు వాటికి పూర్తి మద్దతును ఇవ్వడం

3: తల్లిదండ్రుల పట్ల మన నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి?

జవాబు: 1 - షరిఅహ్ కు విరుద్ధం కానంత వరకు, ఏ విషయంలోనైనా వారికి విధేయత చూపడం
2 - తల్లిదండ్రులకు సేవ చేయడం
3 - తల్లిదండ్రులకు సహాయ పడటం
4 - తల్లిదండ్రుల అవసరాలు పూర్తి చేయడం
5 - తల్లిదండ్రుల కొరకు దుఆ చేయడం
6 - వారితో ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా మాట్లాడటం, చికాకును వ్యక్తం చేసే "ఉఫ్" అనే చిన్న పదం కూడా పెదవులపై రావడం అనుమతించబడదు.
7 - నవ్వుతూ వారి వైపు చూడటం, వారి వైపు చిరాకుగా, తీక్షణంగా చూడటం నిషేధించబడింది.
8 - వారితో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకుండా ఉండటం. మధ్యలో ఎలాంటి అంతరాయం కల్పించకుండా వారి మాటలు పూర్తిగా వినడం. వారిని పేర్లతో పిలవకుండా, బదులుగా "నాన్న" మరియు "అమ్మ" అని పిలవడం.
9 - వారు తమ గదిలో ఉన్నప్పుడు, అందులో ప్రవేశించే ముందు వారి అనుమతి కోరడం
10 - వారి నుదుటిని మరియు చేతులను ముద్దు పెట్టడం

4: రక్తసంబంధీకులతో మన నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి?

జవాబు: 1 - సోదరసోదరీమణులు, బాబాయి,పిన్ని, మామ,పిన్ని మొదలైన బంధువులను సందర్శించడం ద్వారా రక్తసంబంధాలను కొనసాగించాలి.
2 - మాటలలోనూ, చేతలలోనూ వారి పట్ల దయ చూపుతూ వారికి సహాయం అందించడం.
3 - వారికి ఫోన్ చేసి, వారి మంచిచెడ్డలు, బాగోగులు కనుక్కోవడం.

5: ఒక వ్యక్తి తన సోదరులు మరియు స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి?

జవాబు: 1 - మంచి వ్యక్తులను ప్రేమించాలి మరియు వారిని స్నేహితులుగా తీసుకోవాలి.
2 - చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి.
3 - తోటి సోదరులకు సలాం చేయాలి మరియు కరచాలనం చేయాలి.
4 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని సందర్శించాలి మరియు వారి అనారోగ్యం దూరం చేయమని అల్లాహ్ ను వేడుకోవాలి.
5 - తుమ్మిన వ్యక్తి కొరకు "యర్హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక) అని ప్రార్థించాలి.
6 - తమను సందర్శించమని పిలిచిన వారి ఆహ్వానాన్ని స్వీకరించాలి.
7 - వారికి అవసరమైనప్పుడు, మంచి సలహాలు ఇవ్వాలి.
8 - వారికి అన్యాయం జరిగినప్పుడు వారిని ఆదుకోవాలి మరియు ఇతరులను అణచియకుండా వారిని అడ్డుకోవాలి.
9 - స్వయంగా తన కోసం దేనిని ఇష్టపడతారో, దానినే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలి.
10 - అవసరమైనప్పుడు వారికి సహాయ సహకారాలు అందించాలి.
11 - మాటలతో, చేతలతో వారికి హాని కలిగించడం మానుకోవాలి.
12 - వారి రహస్యాలను గోప్యంగా ఉంచాలి.
13 - వారిని అవమానించడం, దూషించడం, తృణీకరించడం, వారి ఎదుగుదలను చూసి అసూయపడడం, వారిపై గూఢచర్యం చేయడం లేదా వారిని మోసం చేయడం వంటివి మానుకోవాలి.

6: ఇరుగు పొరుగువారితో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - తమ ఇరుగుపొరుగువారి పట్ల మాటలలో మరియు చేతలలో దయ చూపడం మరియు అవసరమైనప్పుడు వారికి సహాయం అందించడం.
2 - ఈద్ పండుగలు, వివాహం మొదలైన సంతోషకరమైన శుభ సందర్భాలలో వారిని అభినందించడం.
3 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం మరియు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చడం.
4 - మంచి వంటకాలు వండినపుడు, వీలైనంత వరకు దానిని వారికి కూడా పంపడం.
5 - మాటలతో, చేతలతో వారికి హాని కలిగించకుండా ఉండడం.
6 - పెద్ద శబ్దాలతో వారిని గాభరాపెట్టకుండా, వారిపై నిఘాలు వేయకుండా ఉండాలి. వారితో సహనంతో మెలగాలి.

7: అతిథులు మరియు ఆతిథ్యం ఇచ్చేవారు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - అతిథి ఆహ్వానాన్ని అంగీకరించడం
2 - ఎవరినైనా సందర్శించినప్పుడు, వారి అనుమతి కోరడం మరియు సందర్శన సమయాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడం
3 - ప్రవేశించే ముందు అనుమతి కోరడం
4 - సందర్శన సమయంలో అక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేయకుండా ఉండటం
5 - ఆతిథ్యం ఇస్తున్నవారి కుటుంబం వైపు వారికి ఇబ్బంది కలిగించే చూపులను క్రిందికి దించుకోవడం.
6 - అతిథిని స్వాగతించడం, ఉల్లాసంగా మరియు స్నేహపూర్వక మాటలతో వారిని ఆహ్వానించడం
7 - అతిథిని ఉత్తమ స్థానంలో కూర్చోబెట్టడం
8 - అతిథికి ఆహార పానీయాలు అందించి గౌరవించడం

8: అనారోగ్యుని వైపు చూపే మర్యాదలు మరియు రోగిని పరామర్శించడంలో చూపవలసిన మర్యాదలు వివరించండి?

జవాబు: 1 - నొప్పి ఉన్న చోట కుడి చేయి ఉంచి, "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరిట) అని మూడుసార్లు పలకండి. ఆ తర్వాత ఇలా దుఆ చేయండి: "అవుదు బిఇజ్జతిల్లాహి వ ఖుద్రతీహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిర్" (నేను గుర్తించిన మరియు భయపడుతున్న వాటికి వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క తేజస్సు మరియు శక్తిలో శరణు పొందుతున్నాను) - ఏడు సార్లు.
2 - అల్లాహ్ నిర్ణయించిన దానితో సంతృప్తిగా మరియు సహనంతో ఉండండి.
3 - రోగిని సందర్శించడంలో త్వరపడడం, రోగి కోసం ప్రార్థించడం మరియు రోగి వద్ద ఎక్కువసేపు ఆగకుండా ఉండటం.
4 - వ్యాధిగ్రస్తులు అడగకుండానే రుఖ్యహ్ (ఖుర్అన్ మరియు సున్నతుల ద్వారా వైద్యం చేసే పద్ధతి) చేయడం.
5 - రోగిని ఓపికగా ఉండమని మరియు ప్రార్థనలు, నమాజులు మరియు తహారతుకు (ఆచార స్వచ్ఛతకు) కట్టుబడి ఉండమని సలహా ఇవ్వడం.
6 - రోగి కొరకు ఇలా వేడుకోవడం: "అస్'అలుల్లాహ్ అల్ అజీమ్ రబ్బుల్ ‘అర్షిల్ ‘అజీమ్ అయ్ యష్'ఫీక్” (మిమ్మల్ని నయం చేయమని, మహాద్భుతమైన అర్ష్ (సింహాసనం) యొక్క ప్రభువు అయిన అల్లాహ్ను నేను వేడుకుంటుతున్నాను) - ఏడు సార్లు.

9: జ్ఞానార్జనలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - సంకల్పాన్ని సంపూర్ణ చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం
2 - నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం
3 - గురువును అతని సమక్షంలో మరియు పరోక్షంలో గౌరవించడం మరియు సత్కరించడం
4 - అతని సమక్షంలో వినమ్రతతో, అణుకువతో కూర్చోవడం
5 - గురువుకు మధ్యలో అంతరాయం కలగజేయకుండా శ్రద్ధగా వినడం.
6 - గురువును మర్యాదతో ఉత్తమ పద్ధతిలో తన సందేహాలు అడిగి తెలుసుకోవాలి.
7 - గురువును పేరు పెట్టి పిలవడం తగదు

10: సమావేశాలలో పాటించ వలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - సభలో ప్రజలకు అభివాదం చేయడం
2 - ఎవరి సీటూ ఖాళీ చేయమని అడగకుండా అందుబాటులో తనకు దగ్గరగా ఉన్న మొదటి ఖాళీ సీటులో కూర్చోవడం, ఉభయుల అనుమతితో తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోక పోవడం
3 - ఇతరులు కూడా కూర్చునేలా సర్దుబాటు చేయడం
4 - ఇతరుల మాటలకు అంతరాయం కలిగించకూడదు
5 - సమావేశం విడిచి బయలుదేరే ముందు ప్రజలకు అభివాదం చేయడం మరియు వారి అనుమతి తీసుకోవడం
6 - సభ ముగియగానే అక్కడ జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇలా దుఆ చేయడం: "సుబహానక అల్లాహుమ్మ వబిహమ్'దిక, అష్-హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తఘ్ఫిరుక వ అతూబు ఇలైక్" (ఓ అల్లాహ్, నీవు పరమపవిత్రుడవు, సకల ప్రశంసలు నీకే శోభిస్తాయి. నీవు తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను పశ్చాత్తాపపడుతున్నాను.) సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.

11: నిద్రకు ఉపక్రమించడంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - పెందరాళే నిద్రపోవడం
2 - ఉదూ (ఆచరణ స్వచ్ఛత) స్థితిలో నిద్రకు ఉపక్రమించడం
3 - వెల్లకిలా పొట్ట మీద నిద్ర పోకూడదు
4 - కుడిచేతిని కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకోవడం
5 - పడుకునే ముందు పక్క మీద దుమ్ము దులపడం
6 - నిద్రకు ఉపక్రమించే వేళ చేసే ప్రార్థనలు : అయత్ అల్-కుర్సీ ఒకసారి మరియు సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్నాస్, ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాలి. ఆ తరువాత ఇలా ప్రార్థిస్తూ, పడుకోవాలి: "బిస్మిక అల్లాహుమ్మా అముతు వ అహ్యా" (ఓ అల్లాహ్! నీ పేరుతో నేను చనిపోతాను మరియు మరలా బ్రతుకుతాను)
7 - తెల్లవారుజామున చేసే ఫజ్ర్ నమాజు కొరకు మేల్కొనడం
8 - నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించాలి: "అల్'హమ్'దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్" (మన నుండి తీసుకున్న తర్వాత మరలా మనకు జీవితాన్ని ఇచ్చిన అల్లాహ్ కే సకల స్తోత్రాలు మరియు ప్రళయదినాన ఆయన వైపునకే మరలుతాము)

12:భుజించడంలో పాటించవలసిన మర్యాదలు ఏవి?

జవాబు:
1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు విధేయత చూపేందుకు అవసరమైన శక్తి పొందటానికి అన్నపానీయాలు సేవిస్తున్నాననే సంకల్పం చేయుకోవడం
2 - భుజించడానికి ముందు చేతులు కడుక్కోవడం
3 - భుజించడానికి ముందు ఇలా ప్రార్థించాలి: "బిస్మిల్లాహ్" (అల్లాహ్ పేరుతో). కుడిచేత్తో మరియు పళ్ళెంలో తనకు సమీపంలో ఉన్నదాని నుండి తినాలే గానీ, ప్లేట్ మధ్యలో లేదా ఇతరుల ముందు ఉన్న దాని నుండి కాదు.
4 - భుజించడానికి ముందు "బిస్మిల్లా" అని చెప్పడం మరచిపోయిన సందర్భంలో, ఇలా పలకాలి: "బిస్మిల్లాహి అవ్వలుహు వ ఆఖిరుహు" (అల్లాహ్ పేరతో, ఆరంభంలోనూ మరియు అంతంలోనూ).
5 - లభించిన భోజనంతో తృప్తి పడటం, దానిని విమర్శించకుండా ఉండడం అంటే ఇష్టం ఉంటే తినాలి, లేకుంటే వదిలేయాలి.
6 -కొన్ని ముద్దలు మాత్రమే తినడం మరియు అతిగా తినకుండా ఉండడం.
7 - భోజనం లేదా పానీయంలో ఊదకూడదు మరియు అది చల్లబడే వరకు వేచి ఉండాలి.
8 - తన కుటుంబంతో లేదా అతిథులతో కలిసి తినడం.
9 - పెద్దలు తినడం ప్రారంభించక ముందే మీరు తినడం మొదలు పెట్టకూడదు.
10 - ఏదైనా పానీయం, మంచినీళ్ళు త్రాగే ముందు అల్లాహ్ పేరుతో ప్రారంభించడం, కూర్చుని మూడు గుక్కల్లో త్రాగడం.
11 - భుజించిన తర్వాత అల్లాహ్ ను స్తుతించడం.

13: వస్త్రధారణలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1- అల్లాహ్ ను స్తుతిస్తూ, కుడివైపు నుండి వస్త్రధారణ ప్రారంభించడం
2 - వస్త్రం, చీలమండలం క్రింద వరకు వేలాడేంత పొడువుగా ఉండకూడదు.
3 - అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించకూడదు. అలాగే అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు ధరించకూడదు.
4 - అవిశ్వాసుల మరియు దుర్మార్గుల వస్త్రధారణను అనుకరించ కూడదు.
5 - బట్టలు విప్పేటప్పుడు ముందుగా అల్లాహ్ పేరును ప్రస్తావించాలి.
6 - పాదరక్షలు ధరించేటప్పుడు ముందుగా కుడి వైపు నుండి మరియు వాటిని తీసేటప్పుడు ముందుగా ఎడమ నుండి ప్రారంభించండి.

14: ప్రయాణికులు పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - తన ప్రయాణాన్ని "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో, అల్'హందు లిల్లాహ్ (సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి)" అనే పదాలతో ప్రారంభించాలి పరమ పరిశుద్ధుడగు అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు లోబరిచాడు,మేము దీనిని మేము (ఆయన అనుగ్రహం లేకపోతే) దీనిని లోబరుచుకోలేక పోయేవారము, 13 మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది! 14 [సూరతుల్ జుఖ్'రుఫ్:13-14]
2 - ఒకవేళ ఎవరైనా ముస్లింను దాటుతున్న సందర్భంలో, అతనికి సలాం పలుకుతూ ముందుకు సాగండి

15: రోడ్లపై, రహదార్లపై పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - సాధారణ వేగంతో, వినమ్రత, అణుకువలతో రహదారికి కుడు వైపు నడవడం (ప్రభుత్వం నిర్దేశం ప్రకారం).
2 - దారిలో ఎదురయ్యే వారికి (పరిచయం ఉన్నా, లేకపోయినా) సలాం చేస్తూ, శుభాకాంక్షలతో పలకరించడం.
3 - చూపులు క్రిందకు దించి, ఎవరికీ హాని కలుగ జేయకుండా ప్రయాణించడం.
4 - మంచి వైపుకు ఆహ్వానించడం, చెడును ఖండించడం.
5 - దారి నుండి హానికరమైన వాటిని తొలగించడం.

16: ఇంటిలో ప్రవేశించే మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళటంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - ఎడమ కాలు బయట పెట్టి, ఇంటి నుండి బయటకు అడుగు వేస్తూ ఇలా దుఆ చేయ వలెను: "బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.) 2 - కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఇలా దుఆ చేయాలి: "బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ ‘అలా రబ్బినా తవక్కల్నా” (అల్లాహ్ పేరుతో మేము ప్రవేశిస్తాము, అల్లాహ్ పేరుతో మేము బయటికి వెళతాము మరియు మా ప్రభువుపైనే మేము ఆధారపడతాము).
3 - మిస్వాక్ ఉపయోగిస్తూ (దంతాలు శుభ్రపరిచే పంటిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటూ ), ఇంట్లోని వ్యక్తులను సలాం చేస్తూ ఇంటిలోనికి ప్రవేశించవలెను.

17: టాయిలెట్ లేదా హమామ్ విషయంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - ఎడమకాలు లోపలికి పెట్టి ప్రవేశించడం.
2 - టాయిలెట్ లేదా హమామ్ లో ప్రవేశించే ముందు ఇలా దుఆ చేయడం: "అల్లాహ్ పేరుతో" ఓ అల్లాహ్! నేను అపరిశుద్ధమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.
3 - అల్లాహ్ యొక్క ధ్యానం (జిక్ర్) చేస్తూ టాయిలెట్లలో అస్సలు ప్రవేశించకూడదు.
4 - మలమూత్ర విసర్జన సమయంలో ఇతరులకు కనబడకుండా ఉండేందుకు ప్రైవసీతో ఉండే టాయిలెట్ గది లాంటిది లేదా పరదా లాంటిది ఏర్పాటు చేసుకోవడం.
5 - టాయిలెట్లో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకుండా ఉండటం.
6 - మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఖిబ్లా దిశలో కూర్చోకుండా ఉండటం లేదా దాని వైపు వీపు చూపకుండా ఉండడం.
7 - మలినాలను తొలగించడంలో, మర్మాంగాలు కడగడంలో కుడి చేతిని కాకుండా ఎడమ చేతిని ఉపయోగించడం.
8 - ప్రజల మార్గంలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం.
9 - ఉపశమనం పొందిన తర్వాత చేతులు కడుక్కోవడం.
10 - కుడి పాదంతో టాయిలెట్ నుండి బయటకు వస్తూ ఇలా పలకాలి : "గుఫ్రానక్" (ఓ ప్రభూ, నన్ను క్షమించు)

18: మస్జిదులో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - కుడిపాదం లోపలికి పెట్టి మస్జిదులో ప్రవేశి స్తూ ఇలా దుఆ చేయవలెను. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నా కొరకు నీ కారుణ్య ద్వారాలు తెరువుము)
2 - రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ సలాహ్ (నమాజు) పూర్తి చేయకుండా, మస్జిదులో కూర్చోవద్దు.
3 - సలాహ్ (నమాజు) చేసే వ్యక్తుల ముందు నుండి వెళ్ళకూడదు, పోగొట్టుకున్న వస్తువులను వెతకకూడదు లేదా మస్జిదులలో అమ్మడం మరియు కొనడం చేయకూడదు.
4 - ఎడమపాదం బయట పెట్టి, మస్జిదు నుండి బయటికి వస్తూ, ఇలా దుఆ చేయాలి. అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయతో నేను నిన్ను వేడుకుంటున్నాను')

19: సలాం చేయడంలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - ఒక ముస్లిమ్ ను కలిసినప్పుడు, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" (అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక) అని ప్రశాంతంగా పలకరించడంతో సంభాషణ ప్రారంభించాలి. సలాం చెప్పకుండా, కేవలం చేతితో సంజ్ఞ చేయడం మాత్రమే సరిపోదు.
2 - చిరునవ్వు ముఖంతో ఇతరులకు సలాం చేయండి.
3 - కుడిచేత్తో కరచాలనం చేయండి
4 - ఎవరైనా సలాం చేసినప్పుడు, దానికి సమానమైన పదాలతో లేదా దాని కంటే ఉత్తమంగా ఇంకా ఎక్కువ పదాలతో తిరిగి సలాం చేయండి.
5 - అవిశ్వాసిని కలుసుకున్నప్పుడు, అతనికి సలాం చెప్పడంతో ప్రారంభించకూడదు. అతను అభివాదం చేస్తే, అలాంటి పదాలతోనే అతనికి బదులు పలకాలి.
6 - యువకులు వృద్ధులకు సలాం చేయాలి, వాహనం మీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్న వారు, కూర్చున్నవారికి సలాం చేయాలి, కొద్దిమందితో ఉన్న బృందం, ఎక్కువ మంది ఉన్న పెద్ద బృందానికి సలాం చేయాలి.

20: ఇతరుల అనుమతి అడగడంలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - ఒక ప్రదేశంలోకి ప్రవేశించే ముందు అనుమతి కోరడం
2 - ప్రవేశించేందుకు మూడు సార్లు మాత్రమే అనుమతి కోరాలి, అంతకంటే ఎక్కువ సార్లు తగదు. అయినా అనుమతి లభించకపోతే, అక్కడి నుండి వాపసు వెళ్ళిపోవాలి.
3 - తలుపును సున్నితంగా తట్ట వలెను మరియు తలుపు నుండి దూరంగా నిలబడ వలెను అంటే, దాని కుడివైపున గానీ లేదా ఎడమవైపున గానీ.
4 - ముందుగా అనుమతి తీసుకోకుండా, ముఖ్యంగా తెల్లవారుజామున, మధ్యాహ్న సమయంలో మరియు ‘ఇషా’ సలాహ్ తర్వాత తల్లిదండ్రుల గదిలోకి లేదా ఇతరుల గదిలోకి అస్సలు ప్రవేశించవద్దు.
5 - అనుమతి తీసుకోకుండానే ఆసుపత్రి లేదా దుకాణం వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది.

21: జంతువుల సంక్షేమంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - జంతువులకు ఆహారం మరియు నీరు అందించడం.
2 - జంతువుపై దయ చూపడం మరియు అది భరించలేనంత భారం దానిపై వేయకుండా ఉండటం.
3 - ఏ విధంగానైనా జంతువును హింసించడం లేదా బాధించడం వంటివి వాటికి పాల్బడకుండా ఉండటం.

22: క్రీడలలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ఆయన మెప్పును పొందటానికి అవసరమైనంత బలం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడల అభ్యాసం చేయడం.
2 - సలాహ్ (నమాజు) సమయంలో క్రీడలు ఆపి వేయడం.
3 - అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి క్రీడలు ఆడకూడదు.
4 - మర్మవయవాలను (తప్పనిసరిగా కప్పబడి ఉండవలసిన శరీర భాగాలు) కప్పి ఉంచేలా క్రీడా దుస్తులను ధరించడం.
5 - ముఖం పై కొట్టడం లేదా 'మర్మావయవాలను బహిర్గతం చేయడం వంటి నిషేధించబడిన క్రీడలను నివారించడం.

23:హాస్య మర్యాదలు కొన్నింటిని తెలుపండి?

జవాబు: 1 - హాస్యమాడుతున్నప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండాలి.
2 - హాస్యం అనేది ఎగతాళి, అపహాస్యం, హాని మరియు బెదిరింపులు లేకుండా ఉండాలి.
3 - తరచుగా జోకులు వేయడం మానుకోండి.

24: తుమ్మినపుడు పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - తుమ్మేటప్పుడు నోటిపై చేయి, వస్త్రం లేదా రుమాలు పెట్టుకోవడం
2 - తుమ్మిన తర్వాత అల్లాహ్ ను స్తుతిస్తూ: "అల్'హమ్'దు లిల్లాహ్" అని పలకడం.
3 - తుమ్మినవాని సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).
దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి:
"యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)

25: ఆవలించడంలో పాటించ వలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - ఆవలింతలను ఆపివేసేందుకు ప్రయత్నించాలి
2 - ఆవలిస్తున్నప్పుడు గొంతు పెంచి "ఆహ్", "ఉహ్" అంటూ శబ్దాలు చేయకూడదు
3 - నోటిపై చేయి పెట్టాలి

26: ఖుర్ఆన్ పారాయణంలో ఏ మర్యాదలు పాటించాలి?

జవాబు: 1 - ఉదూ చేసిన తర్వాత తహారతు (కర్మ స్వచ్ఛత) స్థితిలో ఉన్నప్పుడు పఠించడం.
2 - వినమ్రతతో, అణుకువతో మర్యాదగా మరియు హుందాగా కూర్చుని ఖుర్ఆన్ పారాయణం చేయడం.
3 - అల్లాహ్ వద్ద షైతాను బారి నుండి కాపాడమని శరణు వేడుకుంటూ పారాయణం ప్రారంభించడం.
4 - దీర్ఘాలోచన చేస్తూ పారాయణం చేయడం.

నైతిక విలువల విభాగం.30

1: ఉత్తమ లక్షణాల ఔన్నత్యం గురించి పేర్కొనండి ?

జవాబు: నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే విశ్వాసులు, అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు. [అత్తిర్మిజీ మరియు అహ్మద్ హదీసు గ్రంధాలలో ఉల్లేఖించబడింది.]

2: మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి?

జవాబు: 1 - మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి అంటే: 1. ఇది అల్లాహ్ ప్రేమకు దారి తీస్తుంది.
2 - ఇది ప్రజల ప్రేమకు దారి తీస్తుంది.
3 - ఇది (తీర్పుదినాన) త్రాసుపై అత్యంత భారీగా తూగుతుంది.
4 - ఇది పుణ్యాలు మరిన్ని రెట్లు గుణించబడటానికి దారి తీస్తుంది.
5 - ఇది పరిపూర్ణ విశ్వాసానికి సంకేతం, చిహ్నం, సూచన.

3: మనం నైతికత విలువలను ఎక్కడ నుండి పొందాలి?

జవాబు: పవిత్ర ఖుర్ఆన్ నుండి, మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: {నిశ్చయంగా ఈ 'ఖుర్ఆను' పటిష్టమైన సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేస్తుంది}. [సూరతుల్ ఇస్రాఅ: 9వ ఆయతు] మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: {నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు, ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను} అహ్మద్ హదీసు గ్రంధం

4:ఇహ్సాన్ (పరోపకారం) యొక్క నాణ్యత మరియు దాని ఉదాహరణలు ఏమిటి?

జవాబు: ఇహ్సాన్ (పరోపకారం) అంటే నిరంతరం అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించడం మరియు అన్ని జీవుల పట్ల దయతో మరియు కనికరంతో వ్యవహరించడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
నిశ్చయంగా, అల్లాహ్ అన్ని విషయాలపై దయతో వ్యవహరించమని ఆదేశించాడు. ముస్లిం హదీసు గ్రంధం
ఇహ్సాన్ కు (ఉపకారానికి) కొన్ని ఉదాహరణలు:
ఆరాధనలను పూర్తి చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం.
మాటలలో మరియు చేతలలో తల్లిదండ్రుల పట్ల దయ చూపటం.
రక్తసంబంధీకులు మరియు బంధువుల పట్ల దయ చూపటం.
ఇరుగు పొరుగు వారి పట్ల దయ చూపటం.
అనాధల పట్ల మరియు అక్కరగలవారి పట్ల దయ చూపటం.
మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి పట్ల దయ చూపటం.
వాక్కులో దయ చూపటం.
వాదనలలో దయ చూపటం.
పశువుల పట్ల దయ చూపటం.

5: ఇహ్సాన్ కు విరుద్ధమైనది ఏమిటి?

జవాబు:ఇహ్సాన్ కు విరుద్ధమైనది అల్ ఇసాఅహ్ (నేరం).
* నేరానికి ఉదాహరణలు:
. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించడంలో చిత్తశుద్ధి లేకుండా ఉండటం.
* తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం.
* రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం.
* ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేషం, శత్రుత్వం చూపటం
* చెడు మాటలు మరియు చేతలతో పాటు పేదలు మరియు అక్కరగలవారి పట్ల దయలేనితనం.

6: నిజాయితీ (త్రికరణశుద్ధి, న్యాయబుద్ధి) యొక్క రకాలు మరియు ఉదాహరణలు ఏమిటి?

జవాబు:
1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క హక్కులను పరిరక్షించడంలో నిజాయితీ, త్రికరణశుద్ధి.
ఉదాహరణలు:
నమాజులు, జకాతు, ఉపవాసం, హజ్ మొదలైన ఆరాధనలను నిర్వహించడంలో త్రికరణశుద్ధి.
2 - ఇతరుల హక్కులను పరిరక్షించడంలో త్రికరణశుద్ధి.
ఉదాహరణలు :
. ప్రజల గౌరవాన్ని భద్రపరచడం.
వారి సంపదను భద్రపరచడం.
వారి ప్రాణాలను భద్రపరచడం.
వారి రహస్య వ్యవహారాలు మరియు ఒకరిపై నమ్మకంతో అప్పగించబడిన ప్రతిదీ.
సాఫల్యం పొందే వారి లక్షణాల గురించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో. [సూరతుల్ మోమినూన్: 8వ ఆయతు]

7: నిజాయితీ (త్రికరణశుద్ధి) కు విరుద్ధమైనది ఏమిటి?

జవాబు: నమ్మకద్రోహం, మోసం, దగా మొదలైనవి అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ప్రజల హక్కులను వృధా చేయడం.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతనికి ఏదైనా అప్పగించినట్లయితే, అతను నమ్మక ద్రోహం చేస్తాడు..." ముత్తఫఖున్ అలైహి

8: సత్యసంధత అంటే ఏమిటి?

జవాబు: సత్యసంధత అంటే ఏది వాస్తవికతకు అనుగుణంగా ఉంటుందో లేదా ఏది నిజమో అదే చెప్పడం.
దాని ఉదాహరణలు:

ప్రజలతో మాట్లాడడంలో సత్యసంధత.
వాగ్దానం నెరవేర్చడంలో సత్యసంధత.
ప్రతి మాటలో, ప్రతి ఆచరణలో సత్యసంధత.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
సత్యసంధతకు కట్టుబడి ఉండండి, ఎందుకంటే సత్యం ధర్మానికి దారి తీస్తుంది మరియు ధర్మం స్వర్గానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి అత్యంత సత్యవంతుడు అయ్యేంత వరకు సత్యాన్ని మాట్లాడుతూనే ఉంటాడు. ముత్తఫఖున్ అలైహి

9: సత్యసంధతకు వ్యతిరేకమైనది ఏమిటి?

జవాబు: అసత్యం పలకడం,అబద్ధాలాడటం. సత్యసంధతకు విరుద్ధం. దీని అర్థం నిజం చెప్పకపోవడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
{మీరు అసత్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది, ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి చేరవేస్తుంది. ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు, అతను ఆ అబద్దాలను విధిగా చేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది’అని లిఖించబడతాడు.} ముత్తఫఖున్ అలైహి నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతడు మాట్లాడితే అసత్యాలే పలుకుతాడు ..." ముత్తఫఖున్ అలైహి

10: సహనంలోని రకాలను పేర్కొనండి?

జవాబు: మొదటిది - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.
రెండవది - పాపాలు మానుకోవడంలో చూపే సహనం.
మూడవది - కఠినమైన దైవాదేశాలను ఆచరణలో పెట్టడంలో చూపే సహనం మరియు అన్ని స్థితులలోనూ అల్లాహ్ నే స్తుతించడంలో చూపే సహనం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు అల్లాహ్ ఓర్పు గల వారిని ప్రేమిస్తాడు. 146 [సూరతు ఆలే ఇమ్రాన్ : 146వ ఆయతు] నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది. ముస్లిం హదీసు గ్రంధం

11: సహనానికి వ్యతిరేకమైనది ఏమిటి?

జవాబు: సహనానికి వ్యతిరేకమైనది అసహనం అంటే అల్లాహ్ కు విధేయత చూపడంలో మరియు పాపాలకు దూరంగా ఉండటంలో అసహనం చూపడం. మాటల ద్వారా లేదా చేతల ద్వారా అల్లాహ్ యొక్క ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దీని క్రిందికే వస్తుంది.
దానికి ఉదాహరణలు:

$ మరణాన్ని కోరుకోవడం.
$ చెంపలపై కొట్టుకోవడం.
$ బట్టలు చింపుకోవడం.
$ జుట్టు చిందర వందరగా వదిలి వేయడం.
$ తనకు త్వరగా మరణం రావాలని వేడుకోవడం.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది. నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షలకు గురిచేస్తాడు. ఎవరైతే వాటిలో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు. మరెవరైతే కష్టనష్టాల్లో సహనం కోల్పోతారో, అల్లాహ్ కూడా అతని పట్ల ఆగ్రహం చూపుతాడు. అత్తిర్మిజీ మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధం

12: సహకారం యొక్క లక్షణం ఏమిటి?

జవాబు: ఇది సత్యం మరియు మంచితనంలో ప్రజల మధ్య సహకారం.
ఉదాహరణలు:

0 హక్కులను పునరుద్ధరించడంలో సహకారం.
0 అణచివేతను నిరోధించడంలో సహకారం.
0 ప్రజల అవసరాలు మరియు నిరుపేదల అవసరాలను తీర్చడంలో సహకారం.
0 అన్ని మంచి విషయాలలో సహకారం.
0 పాపకార్యాలు, ఇతరులకు హాని కలిగించే పనులు మరియు ఇతరులపై అరాచకాలలో సహకరించకపోవడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
మరియు సత్కార్యాల్లో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనులలో ఎవరితోను సహకరించకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు. [సూరతుల్ మాయిద : 2వ ఆయతు] నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక విశ్వాసితో మరొక విశ్వాసి యొక్క సంబంధం ఒక భవనం (ఇటుకలు) లాంటిది, ప్రతి ఒక్కటి మరొక దానిని బలపరుస్తుంది. ముత్తఫఖున్ అలైహి నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరుడు; అతడు మరొకతనికి అన్యాయం చేయడు మరియు దౌర్జన్యుడికి అతనిని అప్పగించడు. ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తారో, అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లింను అతని భారం నుండి విముక్తులను చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినపు భారం నుండి అతనిని విముక్తి చేస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు. ముత్తఫఖున్ అలైహి

13: హయా (వినయం, బిడియం)లోని రకాలు ఏమిటి?

జవాబు: 1 - అల్లాహ్ కు అవిధేయత చూపకుండా ఆయన పట్ల వినయం
2 - అసభ్యకరమైన మరియు అసంబద్ధమైన ప్రసంగాలు మానుకోవడం మరియు 'ఆవరహ్'ను బహిర్గతం చేయకుండా ఉండడం ద్వారా ప్రజల పట్ల వినయం చూపడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి. అందులో "లా ఇలాహ ఇల్లల్లాహ్" వాక్యం పలకడం (విశ్వసించడం) అత్యున్నతమైనది. అయితే "మార్గం మధ్య నుండి హానికరమైన దాన్ని తొలగించడం అతి చిన్నది. ' సిగ్గు (బిడియం) విశ్వాసానికి సంబంధించిన శాఖల్లో ఒక శాఖ. ముస్లిం హదీసు గ్రంధము.

14: దయా లక్షణానికి ఉదాహరణలు పేర్కొనండి?

జవాబు: వృద్ధుల పట్ల దయ చూపడం మరియు వారిని గౌరవించడం.
- యువకులు మరియు చిన్నపిల్లల పట్ల దయ చూపడం.
- పేదలు, అక్కరగలవారు మరియు దిక్కులేని నిరుపేదల పట్ల దయ చూపడం
- జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా మరియు వాటికి హాని కలిగించకుండా ఉండటం ద్వారా వాటిపై దయ చూపడం.
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, విశ్వాసుల ఉపమానం వారి స్నేహం, ఐక్యత మరియు దయ, జాలి విషయాలలో ఒక శరీరం వంటిది. శరీరం లో ఏ భాగానికైనా బాధ కలిగితే ఆ బాధను పూర్తి శరీరం అనుభవిస్తుంది. నిద్రపట్టదు, జ్వరానికి వస్తుంది. ముత్తఫఖున్ అలైహి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కరుణించే జనులపై కరుణామయుడు (అర్రహ్మాన్) కరుణిస్తాడు, మీరు భూవాసులపై కరుణించండి, ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ములను కరుణిస్తాడు. అబూ దావూద్, అత్తిర్మిజీ హదీసు గ్రంధాలు.

15: ప్రేమ ఎన్ని రకాలు?

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ ను ప్రేమించుట.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
“విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు” [సూరతుల్ బఖరహ్: 165వ ఆయతు]
అల్లాహ్ యొక్క రసూల్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించుట
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో ఆయన సాక్షిగా, నన్ను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరియు తన సంతానం కంటే ఎక్కువగా ప్రేమించనంత వరకు మీలో ఎవ్వరూ పరిపూర్ణ విశ్వాసి కాజాలరు. బుఖారీ హదీసు గ్రంధము
విశ్వాసుల పట్ల ప్రేమ మరియు ఒక వ్యక్తి తన కొరకు తాను కోరుకున్నట్లే వారి కొరకు కూడా మంచిని కోరుకోవడం.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
స్వయంగా తన కోసం కోరుకున్నటు వంటిదే, తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు. బుఖారీ హదీసు గ్రంధము

16: ఉల్లాసాన్ని నిర్వచించండి.?

జవాబు: ఉల్లాసమైన ముఖాన్ని కలిగి ఉండటం, దానితో పాటు సంతోషంతో మరియు చిరునవ్వుతో, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్నేహపూర్వకంగా ప్రజలను కలవడం.
ఇది కోపంతో నుదురు చిట్లిస్తూ, అసహ్యంతో మరియు విరోధంతో ప్రజల వైపు చూడడానికి వ్యతిరేకమైన వైఖరి.
ఉల్లాసం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ అనేక హదీసులు ఉల్లేఖించ బడినాయి. వాటిలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు కూడా ఉంది: ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతూ పలకరించడ మైనా సరే! ముస్లిం హదీసు గ్రంధము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: చిరునవ్వుతో నీ సోదరుడిని పలకరించడం కూడా సదఖ (దానం) గా పరిగణించ బడుతుంది. తిర్మిజీ హదీసు గ్రంధము

17: అసూయ అంటే ఏమిటి?

జవాబు: ఇతరులపై కురుస్తున్న అల్లాహ్ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఆగి పోవాలని కోరుకోవడం లేదా ఇతరులు అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఆస్వాదించడాన్ని ద్వేషించడం, ఇతరులు మంచిగా ఉండటం చూసి ఓర్చు కోలేక పోవటం.
:
అల్లాహ్ ప్రకటన: మరియు అతను అసూయపడినప్పుడు, ఆ అసూయ నుండి కలిగే హాని నుండి. 5 [సూరతుల్ ఫలఖ్: 5వ ఆయతు]
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరిపై మరొకరు అసూయపడకండి మరియు ఒకరినొకరు వీపు చూపు కోకండి, అల్లాహ్ దాసులారా, సోదరులుగా మెలగిండి. బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

18:అపహాస్యం చేయడం అంటే ఏమిటి?

జవాబు: ఇది తోటి ముస్లిం సోదరుడిని ఎగతాళి చేయడం మరియు తృణీకరించడం, ఇది అనుమతించ బడలేదు.
దీనిని పూర్తిగా ఖండిస్తున్న మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు), ఇతరులెవరినీ (పురుషులెవరినీ) ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాళ్ళు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు. [సూరతుల్ మజాదిలహ్:11వ ఆయతు]

19: వినయం అంటే ఏమిటో నిర్వచించండి?

జవాబు: ఇతరుల కంటే ఒకరు గొప్పవారు అని ఆలోచించక పోవడమే వినయం, వినమ్రత, అణుకువ; అందువలన, ఒక వ్యక్తి ప్రజలను తృణీకరించడు లేదా సత్యాన్ని తిరస్కరించడు.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
భూమిపై వినయంగా నడిచేవారే అత్యంత కరుణామయుని దాసులు. [సూరతుల్ ఫుర్'ఖాన్: 63వ ఆయతు] వారు నిరాడంబరులు, వినయులు అని అర్థం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ ప్రసన్నత కోసం తనను తాను తగ్గించుకునే వినయం, అణుకువలతో మెలిగేవారి స్థాయిని అల్లాహ్ పెంచకుండా ఎవ్వరూ మిగలరు. ముస్లిం హదీసు గ్రంధము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, {నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ (దివ్యవాణి) పంపాడు: మీరు వినమ్రతను కలిగి ఉండండి. ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దు మీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వం, అహంకారం చూప వద్దు} ముస్లిం హదీసు గ్రంధము

20: నిషేధించబడిన అహంకారం ఎన్ని రకాలు?

జవాబు: 1- సత్యంతో వ్యవహరించడంలో అహంకారం, అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు అంగీకరించకపోవడం
2 - ప్రజలతో వ్యవహరించడంలో అహంకారం, అంటే వారిని తృణీకరించడం మరియు చులకన చేయడం
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఎవరి హృదయంలోనైతే అణువంత గర్వం, అహం ఉంటుందో అతను స్వర్గం లో ప్రవేశించడు. దానికి ఒక వ్యక్తి ఇలా అడిగాడు: "ఒక వ్యక్తి తన బట్టలు మరియు బూట్లు మంచిగా ఉండాలని ఇష్టపడితే?" అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా బదులు పలికారు, "నిశ్చయంగా అల్లాహ్ అందమైనవాడు మరియు ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. కానీ, అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడటం. ముస్లిం హదీసు గ్రంధము
- "సత్యాన్ని తిరస్కరించడం": అంటే దానిని అంగీకరించక పోవడం.
- "వ్యక్తులను తక్కువగా చూడటం": అంటే వారిని తృణీకరించడం, నీచంగా చూడటం.
- అందంగా కనిపించేలా మంచి దస్తులు మరియు బూట్లు ధరించడం అహంకారం క్రిందికి రాదు.

21: నిషేధించబడిన మోసం యొక్క కొన్ని రకాలను పేర్కొనండి?

జవాబు: - సరుకులోని లోపాన్ని దాచిపెట్టి, అమ్మకంలో, కొనగోలులో మోసం చేయడం.
- పరీక్షల్లో విద్యార్థులు మోసం చేసిన విధంగా చదువులో మోసం చేయడం.
- తప్పుడు సాక్ష్యం చెబుతూ మరియు అబద్ధాలు చెబుతూ మాటల్లో మోసం చేయడం.
- ఇతరులతో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)" అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు". ముస్లిం హదీసు గ్రంధము
ధాన్యపు కుప్ప:
అంటే ఆహార ధాన్యాల గుట్ట

22: చాడీలు చెప్పడం (గీబతు చేయడం) అంటే ఏమిటి?

జవాబు: ఇది ఒక ముస్లిం సోదరుడి విషయంలో అతను దగ్గరలో లేనప్పుడు అతను ఇష్టపడని వాటిని గురించి ప్రస్తావించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రధాత.12 [సూరతుల్ హుజురాత్: 12వ ఆయతు]

23: అపనింద వేయడం (పుకార్లు లేపటం, అభాండాలు వేయడం) అంటే ఏమిటి?

జవాబు: అపనిందలు వేయడం, పుకార్లు పుట్టించడం అంటే ఇది ప్రజల మధ్య అపనమ్మకం మరియు విభేదాలను కలిగించే ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఒకరి మాటలను మరొకరికి చేరవేయడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
అపనిందలు వేసేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు’ ముస్లిం హదీసు గ్రంధము

24: సోమరితనము, బద్ధకము అంటే ఏమటి?

జవాబు: సత్కార్యాలు చేయడంలోనూ, విధులు నిర్వర్తించడంలోనూ అలసత్వం వహించడం.
వాజిబాతు (కర్తవ్య బాధ్యత) లను నిర్వర్తించడంలో అలసత్వం కూడా ఇందులోని ఒక భాగమే.:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించ గోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!: [సూరతున్నిసా : 48వ ఆయతు]
కాబట్టి ఒక విశ్వాసి బద్ధకాన్ని, అలసత్వాన్ని మరియు సోమరితనాన్ని విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు నచ్చే విధంగా ఈ జీవితంలో కష్టపడి పని చేయాలి.

25: కోపం యొక్క రకాలను పేర్కొనండి?

జవాబు: 1 - ప్రశంసనీయమైన కోపం: అవిశ్వాసులు, కపటులు లేదా ఇతరులు అల్లాహ్ యొక్క విషయంలో దేనినైనా ఉల్లంఘించినప్పుడు, హద్దుమీరి నప్పుడు అల్లాహ్ కోసం వచ్చే కోపం.
2 - అంగీకరించబడని అవమానకరమైన కోపం: ఒకరు పలక కూడని మాటను నోటితో పలికించడానికి మరియు చేయకూడని పనిని అతనితో చేయించడానికి పురిగొల్పేది కోపమే.
అంగీకరించబడని అవమానకమైన కోపానికి చికిత్స:

వెంటనే ఉదూ చేయడం
నిలబడినవాడు కూర్చోవడం, కూర్చున్నవాడు పడుకోవడం
ఈ విషయంలో "కోపపడకండి" అని పలికిన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సలహాకు కట్టుబడి ఉండటం.
కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకోవడం.
శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని వేడుకోవడం.
మౌనంగా ఉండడం.

26: గూఢచర్యం అంటే ఏమిటి?

జవాబు: - ఇది ప్రజల తప్పులను మరియు వారు గోప్యంగా దాచి ఉంచిన వాటిని వెతకడం మరియు వాటిని బహిర్గతం చేయడం.
నిషేధితమైన గూఢచర్యానికి ఉదాహరణలు:

- వ్యక్తుల ఇళ్లలోని వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం.
- ప్రజల వ్యక్తిగత సంభాషణలు వినడానికి ప్రయత్నించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
ఒకరిపై నొకరు గూఢచర్యం చేయవద్దు. [సూరతుల్ హుజురాత్: 12వ ఆయతు]

27: వ్యర్థం, దుబారా అంటే ఏమిటి? లోభితనం, పిసినారితనం అంటే ఏమిటి? దాతృత్వం అంటే ఏమిటి?

జవాబు: వృధా చేయడం అంటే డబ్బును దాని హక్కులకు భిన్నంగా అసమర్థంగా, అనవసరంగా ఖర్చు పెట్టడం.
ఇది లోభితనానికి, పిసినారితనానికి వ్యతిరేకం, అంటే డబ్బును అవసరమైనప్పుడు కూడా వాడకుండా నిలిపి ఉంచడం మరియు దానిని అవసరమైన మోతాదులో సరిగ్గా ఖర్చు చేయకపోవడం.
సరైన వైఖరి ఏమిటంటే వ్యర్థం చేయకుండా మరియు పిసినారితనం చూపకుండా, మధ్యస్థ మార్గంలో అవసరమైనప్పుడు తగిన మోతాదులో దాని హక్కు ప్రకారం ఖర్చు పెట్టడం అంటే ఉదారంగా ఉండటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో; 67} [సూరతుల్ ఫుర్'ఖాన్: 67వ ఆయతు]

28: పిరికితనం అంటే ఏమిటి? శౌర్యం అంటే ఏమిటి?

జవాబు: - పిరికితనం అంటే భయపడకూడని దానికి భయపడటం.
ఉదాహరణకు నిజం చెప్పడానికి లేదా చెడును నిషేధించడానికి భయపడటం వంటివి.
శౌర్యం అంటే అధర్మానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం చేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించడం. ఉదాహరణకు ఇస్లాంను మరియు ముస్లింలను రక్షించేందుకు అల్లాహ్ మార్గంలో పోరాడటం, సత్యం పక్షాన పోరాడటం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దుఆలో (ప్రార్థనలో) ఇలా వేడుకునేవారు: ఓ అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.(అల్లాహుమ్మఇన్నీఅవూదుబిక మినల్' జుబ్'ని). రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బలహీన విశ్వాసి కంటే బలమైన విశ్వాసి అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవాడు మరియు రెండింటిలోనూ మంచి ఉంది. ముస్లిం హదీసు గ్రంధము

29: కొన్ని నిషేధించబడిన పదాలు మరియు పలుకులను పేర్కొనండి?

జవాబు: - శాపము, తిట్లు మరియు అవమానాలు.
- ఎవరినైనా హైవాన్ (జంతువు) లేదా అలాంటిది అనడం.
- అసభ్యకరమైన, అశ్లీలమైన, నీచమైన, సిగ్గుమాలిన పదాలు పలకడం.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వాటిని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, - విశ్వాసి అనువాడు ‘దెప్పిపొడవడం,శపించడం ,సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం లాంటి దుర్గుణాలకు ఆమడ దూరంలో ఉంటాడు. అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధాలు.

30: ఒక ముస్లిం మంచి నైతికతకు కట్టుబడి ఉండటానికి సహాయపడే కొన్ని పద్ధతులను పేర్కొనండి?

జవాబు: 1- మీకు మంచి నైతికతను ప్రసాదించమని మరియు దానికి కట్టుబడి ఉండటానికి మీకు సహాయం చేయమని అల్లాహ్ ను వేడుకోవడం.
2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం మరియు ఆయన మిమ్మల్ని పూర్తిగా తెలుసుకుంటాడని, వింటాడని మరియు చూస్తాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం.
3 - మంచి నైతికత యొక్క ప్రతిఫలాన్ని మరియు అవి స్వర్గంలో ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం
4 - దుర్గుణాల యొక్క పరిణామాలను మరియు అవి నరకాగ్నిలోకి ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం
5 - మంచి నైతికత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ఆయన సృష్టి యొక్క ప్రేమను గెలుచుకోవడానికి దారి తీస్తుంది, అయితే దుర్గుణాలు అల్లాహ్ మరియు అతని సృష్టి యొక్క కోపానికి గురి చేస్తాయి.
6 - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను చదవడం మరియు ఆయనను ఆదర్శంగా తీసుకోవడం.
7 - మంచి వ్యక్తుల సహవాసంలో ఉండటం మరియు చెడు వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండటం

దుఆలు మరియు అద్'కార్ ల విభాగము43

1: అజ్'కార్ (అల్లాహ్ ధ్యానం, జిక్ర్) యొక్క ఔన్నత్యం, ప్రాధాన్యత ఏమిటి?

జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ‘అల్లాహ్ నామస్మరణ జపించేవాడి మరియు జపించని వాడి ఉపమానము ప్రాణమున్న జీవి మరియు ప్రాణం లేని నిర్జీవితో సమానం. [6] బుఖారీ హదీసు గ్రంధము.
ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ఎంత తరచుగా స్మరించుకుంటాడనే దానిపై మనిషి జీవితం యొక్క విలువ మరియు శ్రేష్ఠత ఆధారపడి ఉంటుంది.

2: జిక్ర్ (అల్లాహ్ ధ్యానం) యొక్క కొన్ని ప్రయోజనాలను పేర్కొనండి?

జవాబు: 1- ఇది అత్యంత కరుణామయుడైన అల్లాహ్ ను సంతోషపరుస్తుంది.
2 - ఇది చెడును తొలగిస్తుంది.
3 - ఇది ఒక ముస్లింను చెడు నుండి రక్షిస్తుంది.
4 - ఇది మంచి పర్యవసనాన్ని మరియు ప్రతిఫలాన్ని తెస్తుంది.

3: ఏది ఉత్తమమైన జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)?

జవాబు: లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు) అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధములు.

4: నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఏమని పలకాలి?

జవాబు: చనిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి బ్రతికించిన అల్లాహ్ కే సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది. [15] ముత్తఫఖున్ అలైహి

5వ ప్రశ్న: దుస్తులు ధరించేటప్పుడు ఏమని పలకాలి?

జవాబు: నాకు దీనిని (దుస్తులని) ధరింపజేసిన మరియు నా శక్తి సామర్ధ్యాల ప్రమేయం లేకుండా నాకు వాటిని ప్రసాదించిన ఆ అల్లాహ్ కే సమస్త స్తోత్రములు శోభిస్తాయి. [19] అబూ దాఊద్, తిర్మిజి, నసాయి హదీసు గ్రంధాలు

6: దుస్తులు విడుస్తున్నప్పుడు ఏమని పలకాలి?

జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో తిర్మిజి హదీసు గ్రంధము

7: నూతన దుస్తులు ధరించినప్పుడు చదువు దుఆలు?

జవాబు: ఓ అల్లాహ్ సమస్త స్తోత్రములు నీకే చెందును. నీవే నాకు వీటిని తొడిగించావు. దీని మేలును మరియు ఏ మేలు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ మేలును నాకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. అలాగే దీని కీడు నుండి మరియు ఏ కీడు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను. అబూ దావుద్, అత్తిర్మిజీ హదీసు గ్రంధాలు

8: నూతన దుస్తులు ధరించే వారి కొరకు చేయు దుఆ ?

జవాబు: ఎవరైనా కొత్త వస్త్రాన్ని ధరిస్తూ ఉండగా మీరు చూసినప్పుడు, అతని కోసం ఇలా ప్రార్థించాలి: "తుబ్లీ వ యుఖ్లిఫుల్లాహు త'ఆలా" (మీరు దీనిని ధరించవచ్చు మరియు సర్వశక్తిమంతుడు మీకు ఇలాంటి మరొక దానిని కూడా ప్రసాదిస్తాడు). నీవు దానిని పాతవిగా చేయుదువు గాక మరియు అల్లాహ్ దానిని (మరో కొత్త దానితో) మార్చివేయు గాక. అబూ దావూద్ హదీసు గ్రంధము.

9: టాయిలెట్లోకి ప్రవేశించేటప్పుడు చదవవలసిన ప్రార్థనను పేర్కొనండి?

జవాబు: అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ (ఓ అల్లాహ్! నేను అశుద్ధ పురుష ,అశుద్ధ స్త్రీ జిన్నుల నుండి నీ శరణు వెడుతున్నాను) ముత్తఫఖున్ అలైహి

10: టాయిలెట్ నుండి బయటికి వచ్చేటప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి?

జవాబు: గుఫ్రానక్ - ఓ అల్లాహ్ నన్ను క్షమించు అబూ దావుద్, అత్తిర్మిజి హదీసు గ్రంధాలు

11: ఉదూ ప్రారంభించక ముందు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో అబూ దావుద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు

12: ఉదూ పూర్తి చేసిన తరువాత పఠించు దుఆలు ఏమిటి?

జవాబు: అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సాటి ఎవ్వరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ముస్లిం హదీసు గ్రంధము.

13: ఇంటి నుండి బయలుదేరినప్పుడు పఠించు దుఆ ?

జవాబు: బిస్మిల్లాహ్, తవక్కల్'తు అలల్లాహ్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ పేరుతో (బయలుదేరుతున్నాను). నేను అల్లాహ్ నే నమ్ముకున్నాను. నష్టం చేకూర్చే శక్తి, ప్రయోజనం చేకూర్చే సామర్ధ్యం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికి లేదు. అబూ దావుద్, అత్తిర్మిజి హదీసు గ్రంధాలు.

14: ఇంట్లో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: బిస్మిల్లాహి వలజ్'నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ అలల్లాహి రబ్బనా తవక్కల్'నా. మేము అల్లాహ్ పేరుతో ప్రవేశించాము మరియు అల్లాహ్ పేరుతో బయటకు వెళ్ళాము మరియు మా ప్రభువుపైనే మేము నమ్మకం కలిగి ఉన్నాము. ఆ తరువాత ఇంటివారికి సలాం చేయాలి. అబూ దావూద్ ఉల్లేఖన.

15: మస్జిదులో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: అల్లాహుమ్మ ఇఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక. ఓ అల్లాహ్! నా కోసం నీ కారుణ్య ద్వారాలు తెలువుము.

16: మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు పఠించు దుఆ ?

జవాబు: "అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫద్'లిక. ఓ అల్లాహ్! నీ శుభాల ద్వారా నేను నిన్ను అడుగుతున్నాను". ముస్లిం హదీసు గ్రంధము.

17: అదాన్ పిలుపు వింటున్నప్పుడు ఏమి చేయ వలెను?

జవాబు: అదాన్ పలుకులనే మీరు కూడా మరలా పలుక వలెను (లోగొంతుతో రిపీట్ చేయవలెను). హయ్యా లస్సలాహ్, అలాగే హయ్యా లల్ ఫలాహ్ అని ముఅద్దిన్ పలికినప్పుడు మాత్రము, మీరు లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని బదులు పలుక వలెను. ముత్తఫఖున్ అలైహి

18: అదాన్ పలుకులు విన్న తరువాత ఏమని దుఆ చేయవలెను?

జవాబు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపవలెను. ముస్లిం హదీసు గ్రంధము. అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాయిమహ్, ఆతి ముహమ్మదనిల్ వసీలత వ ఫదీలత వ బఅసుహు మఖామ మ్మహ్మూదనిల్లదీ వాఅద్'తహు: ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడు నమాజునకు ప్రభువైన ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వసీలా మరియు 'ఫదీలా'ల అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానము చేసిన ఘనమైన మఖామే మహమూద్ ను ప్రసాదించుము (నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు). బుఖారీ హదీసు గ్రంధము.
అదాన్ మరియు ఇఖామతుల మధ్య దుఆ చేయవలెను ఎందుకంటే ఆ సమయంలో చేసే దుఆ తిరస్కరించబడదు.

19: ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చేసే జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)లో ఏమి పలక వలెను?

జవాబు: 1 - ఆయతల్ కుర్సీ పఠనం : అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. [255] [సూరతుల్ బఖరహ్: 255వ ఆయతు] 2 - బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణాప్రధాత మరియు ఆపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో): {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} మూడుసార్లు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్(a) పేరుతో(b) ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 : మూడుసార్లు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో, ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) [2] మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6 మూడుసార్లు. 3 - ఓ అల్లాహ్ నీవే నా ప్రభువి. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను పుట్టించావు. నేను నీ దాసుడును. నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందమునకు, శాయశక్తులా కట్టుబడి ఉన్నాను. నేను చేసిన కర్మల కీడునుండి నీ శరణు కోరుతున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపములను ఒప్పుకుంటున్నాను, కనుక నన్ను క్షమించు. ఎందుకనగా నీవు తప్ప పాపములను క్షమించేవాడెవడూ లేడు. బుఖారీహదీసు గ్రంధము

20: నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?

జవాబు: బిస్మిక అల్లాహుమ్మ అమూతు వ అహ్యా (ఓ అల్లాహ్! నీ పేరుతోనే చనిపోతాను మరియు నీ పేరుతోనే బ్రతుకుతాను) ముత్తఫఖున్ అలైహి

21: భోజనం ప్రారంభించే ముందు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో)
ఒకవేళ ప్రారంభంలో బిస్మిల్లాహ్ చెప్పటం మరిచిపోతే, ఇలా దుఆ చేయ వలెను.
బిస్మిల్లాహ్ ఫీ అవ్వలిహీ వ ఆఖిరిహీ అబూ దావుద్, అత్తిర్మిజి హదీసు గ్రంధాలు

22: భోజనము ముగించిన తర్వాత పఠించు దుఆ?

జవాబు: సమస్త స్తోత్రములు నన్ను తినిపించిన ఆ అల్లాహ్ కు చెందును, నా ఏ విధమైన కృషి, ఎలాంటి శక్తి లేకుండానే ఆయన నాకు ప్రసాదించాడు. అబూ దాఊదు మరియు ఇబ్నె మాజా మొదలైన హదీసు గ్రంధములు

23: అతిథులు ఆతిథ్యము ఇచ్చిన వాని కొరకు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: ఓ అల్లాహ్! నీవు వారికి ఇచ్చిన దానిలో వారి కొరకు మరిన్ని శుభాలు కలుగజేయి. వారిని క్షమించు వారిని కరుణించు. దాన్ని ముస్లిం ఉల్లేఖించారు.

24: తుమ్ము వచ్చినపుడు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: అల్'హమ్'దులిల్లాహ్ నిస్సందేహంగా స్తోత్రములు అల్లాహ్ కొరకే శోభిస్తాయి.
3 - తుమ్మినవాని ప్రక్కన ఉన్న సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).
దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి:
"యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక) బుఖారీ హదీసు గ్రంధము

25: సమావేశం నుండి నిష్క్రమించేటప్పుడు, సమావేశంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చితంగా అంటే కఫ్ఫారతుల్ మజ్లిస్ గా ఏమని దుఆ చేయాలి?

జవాబు: సుబహానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్తుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను. అబూ దావూద్, తిర్మిజీ, నసాయి హదీసు గ్రంధాలు.

26: ప్రయాణికుడు వాహనం ఎక్కేటప్పుడు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: బిస్మిల్లాహ్, వల్'హమ్'దులిల్లాహ్ - సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్. అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సుబహానక అల్లాహుమ్మ ఇన్నీ జలమ్'తు నఫ్'సీ ఫగ్'ఫిర్'లీ, ఫఇన్నహు లా యగ్'ఫిర ద్దునూబ ఇల్లా అంత. అబూ దావూద్, అత్తిర్మిజి హదీసు గ్రంధాలు

27: ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?

జవాబు: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్. అల్లాహుమ్మ ఇన్నా నస్'అలుక ఫీ సఫరినా హాదా అల్'బిర్ వత్తఖ్'వా వ మినల్ అమల్ వా తర్'దా, అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాదా, వత్వి అన్న బఅదహు, అల్లాహుమ్మ అంత సాహెబు ఫిస్సఫర్, వ ఖలీఫతు ఫిల్ అహల్, అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మివ్వఅసాయి'సఫర్, వ క'అబతిల్ మంజర్, వ సూఇల్ ముంఖలిబ్ ఫిల్ మాలి వల్ అహల్.
ప్రయాణం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ దుఆయే చదివి మరియు ఇంకా ఇలా పలకాలి :

ఆయిబూన, తాఇబూన, ఆబిదూన, లిరబ్బినా హామిదూన్ (మేము వాపసు తిరిగి వచ్చేవారం, పశ్చాత్తాప పడేవారం, ఆరాధించేవారం, మా ప్రభువునే మేము స్తుతించేవారము). ముస్లిం హదీసు గ్రంధము

28: స్థానికుడి కోసం ప్రయాణికుడు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: అస్'తౌదిఉకుముల్లాహ్ అల్లజీ లా తదీఉ వ దాఇఉహు. (నేను నీకు అల్లాహ్ కు అప్పగించుచున్నాను, ఆయనకు అప్పగించినది ఏదీ వృధాగా పోదు). అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధం.

29: ప్రయాణికుడి కోసం స్థానికుడు ఏమని దుఆ చేయవలెను?

జవాబు: 'అస్తవుదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక' (నేను మీ ధర్మాన్ని, మీ విశ్వాసాన్ని మరియు మీ అంతిమ కర్మలను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను). అహ్మద్ మరియు అత్తిర్మిజి మొదలైన హదీసు గ్రంధాలు.

30: మార్కెట్లో ప్రవేశించే ముందు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు లహుల్'ముల్'కు లహుమ్ హమ్'దు యుహ్'యీ వ యుమీతు వహువ హయ్యి లా యమూతు బియదిహిల్ ఖైర్, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సకల స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి. ఆయనే ప్రాణం పోసేవాడు మరియు ఆయనే ప్రాణం తీసేవాడును. ఆయన నిత్యుడు, ఆయనకు మరణం లేదు. ఆయన చేతిలోనే శుభాలన్నీ ఉన్నాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు). అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధములు

31:కోపం వచ్చినప్పుడు చెేయవలసిన ప్రార్థనను పేర్కొనండి.?

జవాబు: అఊదు బిల్లాహి మినష్'షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను). ముత్తఫఖున్ అలైహి

32: మీకు మేలు చేసిన వారి కొరకు చేయు దుఆ?

జవాబు: జజాకల్లాహ్ ఖైర్ (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక) తిర్మిజి హదీసు గ్రంధము

33: స్వారీ చేస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో అబూ దావూద్ హదీసు గ్రంధము

34: ఎవరికైనా ఏదైనా మంచి జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

జవాబు: అల్'హమ్'దు లిల్లాహ్ అల్లదీ బి నేమతిహీ తతిమ్మశ్'శాలిహాత్. (స్తుతులన్నీ ఆ అల్లాహ్ కే శోభిస్తాయి, ఆయన అనుగ్రహము ద్వారా శుభకార్యాలు పరిపూర్ణమవుతాయి). అల్ హాకిమ్ మరియు ఇతర హదీసు గ్రంధాలు.

35: ఎవరికైనా ఏదైనా చెడు జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

జవాబు: అల్ హమ్'దు లిల్లాహి అలా కుల్లి హాల్' (అన్ని సందర్భాల్లోనూ స్తుతులన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి) సహీహ్ అల్'జామయి

36: అభివాదము (సలాము) ఎలా చేయ వలెను మరియు అభివాదమునకు (సలాముకు) జవాబు ఎలా చెప్ప వలెను?

జవాబు: అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని అభివాదము (సలాము) చేయవలెను
దానికి జవాబుగా వాఅలైకుమ్ అస్సలాము వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని చెప్ప వలెను అత్తిర్మిజి, అబూ దావూద్ మొదలైన హదీసు గ్రంధములు

37: వర్షం కురుస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅహ్ (ఓ అల్లాహ్! ఈ వర్షాన్ని లాభదాయకమైనదిగా చేయి) బుఖారీ హదీసు గ్రంధము

38: వర్షం కురిసిన తరువాత చేయవలసిన దుఆ ఏమిటి ?

జవాబు: మతర్'నా బి పద్'లిల్లాహి వ రహ్'మతిహీ (అల్లాహ్ అనుగ్రహంతో మరియు దయతో వర్షం కురిసింది) బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధము

39: పెనుగాలులు వీస్తున్నపుడు చేయవలసిన దుఆ ఏమిటి?

జవాబు: అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరహా వ అఊదు బిక మిన్ షర్రిహా (ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను దాని మేలును కోరుకుంటున్నాను,దాని కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.) అబూ దావూద్ మరియు ఇబ్నె మాజహ్ హదీసు గ్రంధాలు

40: ఉరుములు గర్జిస్తున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు ఏమని దుఆ చేయవలెను ?

జవాబు: సుబహానల్లదీ యుస'బ్బిహు ర్రఅదు బిహమ్'దిహి వ మలాఇకతు మిన్ ఖీఫతిహీ (ఆయన అత్యంత పరిశుద్ధుడు, మేఘాలు సైతం ఆయన్ని స్తుతిస్తున్నాయి, దైవదూతలు కూడా ఆయనను భయభక్తులతో స్తుతిస్తున్నాయి.) ముఅత్తఅ మాలిక్

41: బాధిత వ్యక్తిని చూసినప్పుడు అతని కొరకు ఏమని ప్రార్థన చేయ వలెను?

జవాబు: అల్'హమ్'దు లిల్లాహిల్లదీ ఆఫినీ మిమ్మా ఇబ్'తలాక బిహి వ ఫద్దల్'నీ అలా కసీరన్' మిమ్మన్ ఖలఖ తఫ్'దీలా (సర్వ స్తోత్రాలు ఆ అల్లాహ్ కే శోభిస్తాయి, ఎవరైతే నీవు దేనికైతే లోను చేయబడ్డావో దాని నుండి నన్ను ఆరోగ్యంగా ఉంచాడో మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు.) అత్తిర్మిజి హదీసు గ్రంధము:

42: తనకు ఇతరుల దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ ఏమిటి?

జవాబు: మీలో ఎవరైనా తన సోదరునిలో అంటే స్వయంగా తనలో లేదా తన వద్దనున్న సంపదలో సంతోషం కల్గించే విషయం చూసినట్లయితే అతను ఆ సంపదలో శుభాలు ప్రసాదించమని అల్లాహ్ తో దుఆ చేయాలి, ఎందుకనగా దిష్టి తగులుతున్నది అనే మాట సత్యం. అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధాలు

43: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏమని దరూద్ పంప వలెను?

జవాబు: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీంను మరియు ఆయన కుటుంబాన్ని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు' నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే. 'ఓ అల్లాహ్! ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు. నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే. ముత్తఫఖున్ అలైహి

ఇతర విషయాల విభాగం21

1: ధర్మాదేశాలకు సంబంధించిన ఐదు నియమాలు ఏమిటి?

జవాబు:
1 - అల్ వాజిబ్ (తప్పనిసరి, విధి)
2 - అల్ ముస్తహబ్ (చేస్తే మంచిది)
3 - అల్ ముహర్రమ్ (నిషేధించబడింది)
4 - అల్ మక్రూహ్ (చేయకపోతే మంచిది)
5 - అల్ ముబాహ్ (చేస్తే పాపమూ కాదు, పుణ్యమూ కాదు)

2: ఈ ఐదు నియమాల గురించి వివరించండి?

జవాబు:
1 - అల్ వాజిబు: ఉదాహరణకు ఐదుపూటల సలాహ్ (నమాజులు), రమదాన్ మాసంలో నెల మొత్తం పాటించ వలసిన ఉపవాసాలు మరియు తల్లిదండ్రుల పట్ల విధేయత వంటివి.
- వాజిబ్ ఆచరణలు విధిగా అమలు చేసినందుకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ వాటిని విడిచిపెడితే శిక్షలు ఉంటాయి.
2 - అల్ ముస్తహబ్: సాధారణ సున్నత్ సలాహ్ లు (నమాజులు), రాత్రి నమాజులు, ప్రజలకు భోజనం పెట్టడం మరియు శాంతి శుభాకాంక్షలు అభిలషిస్తూ సలాం చేయడం వంటివి. దీనిని "సున్నత్" మరియు "మందూబ్" అని కూడా అంటారు.
- ముస్తహబ్ ఆచరణలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది మరియు చేయకపోతే శిక్ష ఉండదు.
ముఖ్య గమనిక:

ముస్లింలు సున్నత్ లేదా ముస్తహబ్ ఆచరణలు చేసేందుకు త్వరపడాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణలను అనుసరించాలి.
3 - అల్ ముహర్రమ్: ఉదాహరణకు మద్యం సేవించడం, తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ఉండటం మరియు బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం వంటివి.
- నిషేధించబడిన వాటిని విడిచిపెట్టినందుకు పుణ్యాలు ప్రసాదించ బడతాయి, కానీ వాటికి పాల్పడితే శిక్షలు ఉంటాయి.
4 - అల్ మక్రూహ్: ఎడమ చేతితో తీసుకోవడం మరియు ఇవ్వడం మరియు నమాజులో వస్త్రం యొక్క దిగువ భాగాన్ని పైకి ఎత్తడం వంటివి.
- మక్రూహ్ పనులు (అయిష్టకరమైనవి) త్యజించినందుకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ వాటిని చేస్తే దానివలన శిక్షలు ఉండవు.
5 - అల్ ముబాహ్: ఆపిల్ తినడం మరియు టీ తాగడం వంటివి. దీనిని "జాయజ్" మరియు "హలాల్" అని కూడా అంటారు.
- అనుమతించబడిన వాటిని విడిచిపెట్టినందుకు ప్రతిఫలం ఉండదు, అది చేయడం వలన శిక్షలూ ఉండవు.

3: అమ్మకాలు మరియు లావాదేవీలపై ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: సూత్రప్రాయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన కొన్ని తప్ప, అన్ని రకాల అమ్మకాలు మరియు లావాదేవీలు అనుమతించబడినాయి.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేసినాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]

4: నిషేధించబడిన కొన్ని అమ్మకాలు, లావాదేవీలు ఏమిటి?

జవాబు:
1 - మోసం: వస్తువులో లోపాన్ని దాచడం వంటివి.
అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన (అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)" అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు." ముస్లిం హదీసు గ్రంధము
2 -రిబా (వడ్డీ): ఒకరి నుండి వెయ్యి అప్పుగా తీసుకుని, రెండు వేలు తిరిగి ఇవ్వడం.
ఈ అదనపు ధనం నిషేధిత వడ్డీగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు వ్యాపారాన్ని ధర్మబద్ధం చేసాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]
3 - ఘరర్ (అనిశ్చితి, అపాయము) మరియు జహాలహ్ (అజ్ఞానం): ఆడ గొర్రె పొదుగులో ఉన్న పాలను అమ్మడం లేదా ఇంకా పట్టుకోని చేపలను అమ్మడం వంటివి అంటే తన ఆధీనంలో లేని దానిని అమ్మడం అన్నమాట.
హదీస్ లో ఇలా పేర్కొనబడింది:
"రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఘరార్ (అనిశ్చితి, అపాయం) లావాదేవీలను నిషేధించారు". ముస్లిం హదీసు గ్రంధము

5: అల్లాహ్ మీకు ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను పేర్కొనండి?

జవాబు: 1 - అవిశ్వాసిగా కాకుండా ముస్లింగా ఉండటమనే గొప్ప అనుగ్రహం
2 - మతోన్మాద ఆవిష్కర్తలను అనుసరించే వారిలో కాకుండా సున్నత్కు కట్టుబడి ఉండటం.
3 - చక్కగా వినడం, చూడడం, నడవడం మొదలైన వాటితో సహా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అనుగ్రహాలు.
4 - ఆహారం, పానీయం మరియు బట్టలు కలిగి ఉన్న అనుగ్రహం
వాస్తవానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి మరియు వాటన్నింటినీ మనం లెక్కించలేము మరియు పేర్కొనలేము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [సూరతున్నహల్ : 18వ ఆయతు]

6: మనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల మన కర్తవ్యం ఏమిటి? మనం వాటికి బదులుగా ఎలా కృతజ్ఞత తెలుపుకోవలెను?

జవాబు: అల్లాహ్ను మన నాలుకతో స్తుతించడం ద్వారా మరియు అన్ని ఉపకారాలను ఆయనకే ఆపాదించడం ద్వారా అటువంటి అనుగ్రహాలు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడం మన విధి.

7: ముస్లింల పండుగలు ఏవి?

జవాబు: ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్'హా
అనస్ రజియల్లాహు అన్హు యొక్క హదీసులో ఇలా పేర్కొనబడింది: "రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాకు (వలస) వచ్చినప్పుడు, ప్రజలు రెండు రోజులు ఆటపాటలలో గడపడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అడిగారు: 'ఏమిటి ఈ రెండు రోజులు?' దానికి వారు ఇలా బదులు పలికారు: 'మేము ఇస్లామ్ కు పూర్వ కాలంలో ఈ రెండు దినాలలో ఆటపాటలలో గడిపేవాళ్ళం.' అప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 'అల్లాహ్ మీకు ఈ రెండింటి కంటే మెరుగైన వాటిని ఇచ్చాడు: ఒకటి ఖుర్బానీ చేసే దినం (ఈద్ అల్-అద్హా) మరియు ఉపవాసాలు విరమించే దినం (ఈద్ అల్ - ఫితర్). అబూ దావూద్ హదీసు గ్రంధము
ఈ రెండు ఈద్ పండుగలు కాకుండా మిగిలిన అన్ని పండుగలు మతపరమైన ఆవిష్కరణలుగా, నూతన కల్పితాలుగా పరిగణించబడతాయి.

8: మాసములలో ఏ మాసము ఉత్తమమైనది?

జవాబు: రమదాను మాసం

9: వారం రోజులలో ఏ రోజు ఉత్తమమైనది?

జవాబు: జుమఅహ్ రోజు

10: మొత్తం సంవత్సరంలోని దినములలో ఏ దినము ఉత్తమమైనది?

జవాబు: అరఫహ్ దినము

11: మొత్తం సంవత్సరములోని రాత్రులలో ఏ రాత్రి ఉత్తమమైనది?

జవాబు: లైలతుల్ ఖదర్ రాత్రి

12: మహ్రం కాని స్త్రీని చూసినప్పుడు ఏమి చేయాలి?

జవాబు: తప్పనిసరిగా తన చూపును క్రిందికి దించుకో వలెను. మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశం: విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. [సూరతున్నూర్: 30వ ఆయతు]

13: మానవుడి శత్రువులు ఎవరు?

1 - ఒకరిని చెడు వైపుకు ప్రేరేపించే మానవ ఆత్మ: ఇది ఒక వ్యక్తి తన ఆత్మ తనకు ఏది నిర్దేశిస్తుందో దానిని అనుసరించి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు అవిధేయత చూపడంలో అతని వ్యక్తిగత కోరికలను అనుసరించేలా చేసే ఆత్మ. పరమ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రకటన: వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది – నా ప్రభువు కరుణించిన వాడు తప్ప – నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత. [సూరతు యూసుఫ్ :53వ ఆయతు] 2 - షైతాను: అతడి ప్రధాన లక్ష్యం - మనిషిని తప్పుదారి పట్టించడం, అతనిని చెడు వైపు ప్రేరేపించడం మరియు నరకాగ్నిలోకి తీసుకెళ్లడం. షై’తాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. [సూరతుల్ బఖరహ్: 168వ ఆయతు] 3 - చెడ్డ సహవాసులు: వారు చెడు వైపు ఒకరిని పురికొల్పేవారు మరియు మంచితనం నుండి అతన్ని నిరోధించేవారు. ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొరకు శత్రువులవుతారు. [సూరతుల్ జుఖ్'రుఫ్: 67వ ఆయతు]

14: తౌబహ్ (పశ్చాత్తాపం) అంటే ఏమిటి?

జవాబు: అత్తౌబహ్: పశ్చాత్తాపం అంటే పాపాలను విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు విధేయత చూపడం. అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో నడుస్తాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను. [సూరతు తాహా : 82వ ఆయతు]

15: అత్తౌబహ్ (పశ్చాత్తాపం) యొక్క షరతులు ఏమిటి?

జవాబు: 1 - చెడుపనులు, పాపకార్యాలు విడిచి పెట్టడం
2 - చేసిన చెడుపనికి, పాపకార్యానికి పశ్చాత్తాపం చెందటం
3 - మరలా ఆ చెడుపనులు, పాపకార్యాలను చేయనని దృఢనిశ్చయం చేసుకోవడం
4 - ఒకవేళ ఆ చెడుపనిలో, పాపకార్యంలో ఇతరుల హక్కులు ఉల్లంఘించి ఉంటే వాటిని వాపసు చేయడం (దొంగిలించి ఉంటే దానిని అసలు యజమానికి వాపసు చేయడం).
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
మరియు వారు, ఎవరైతే అశ్లీల పనులు చేసినా లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన తప్పులను బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు! సూరతు ఆలే ఇమ్రాన్ : 135 ఆయతు.

16: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపడం అంటే ఏమిటి?

జవాబు: అంతిమదినంనాడు జరిగే అత్యున్నత సమావేశంలో తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రస్తావనను గొప్పగా ప్రస్తావించమని అల్లాహ్ ను వేడుకోవడం.

17: సుబహానల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: ఇది ఒక తస్బీహ్ పదం అంటే అల్లాహ్ యొక్క ధ్యానం చేసే పదం. దీని అర్థం ఎలాంటి లోపములకూ, కొరతలకూ అతీతుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అని ప్రశంసించడం.

18: అల్'హమ్'దు లిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను స్తుతించడం మరియు పరిపూర్ణత యొక్క అన్ని లక్షణాలతో ఆయనను ప్రశంసించడం, ఆయనకు కృతజ్ఞతలు తెలుపు కోవడం.

19: అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నిటికంటే, అందరి కంటే గొప్పవాడు మరియు అత్యంత శక్తిమంతుడు అని దీని అర్థం.

20: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: అల్లాహ్ యొక్క బలం మరియు శక్తి ద్వారా తప్ప స్వయంగా ఒక వ్యక్తి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు.

21: అస్తగ్'ఫిరుల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: ఒకరి పాపాలను తుడిచివేయమని మరియు లోపాలను కప్పిపుచ్చమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కోరడం.